Barly Soup for Weight Loss : బరువు తగ్గడానికి బార్లీ సూప్.. ఇలా చేసుకుంటే హెల్త్‌కి కూడా చాలా మంచిది
Barly Soup Recipe : ఉదయాన్నే విటమిన్లు, మినరల్స్, న్యూట్రిషియన్స్తో ఉండే ఫుడ్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ బార్లీ సూప్ ట్రై చేయండి. ఇది బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తుంది.
Summer Recipes for Weight Loss : సమ్మర్లో చాలామంది బార్లీ తీసుకుంటారు. దీనివల్ల శరీరంలో వేడి తగ్గుతుందని భావిస్తూ ఉంటారు. అయితే మీరు బరువు తగ్గాలనుకునేవారు కూడా దీనిని రెగ్యూలర్‌గా తీసుకోవచ్చు. ఎందుకంటే దీనిలోని విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పోషక పదార్థాలతో నిండి ఈ సూప్ మిమ్మల్ని ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఈ టేస్టీ సూప్‌లో కేలరీలు, కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. మరి ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా తయారు చేయవచ్చు.. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బార్లీ - పావు కప్పు
నీరు - 2 కప్పులు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి - 8 రెబ్బలు
అల్లం - అంగుళం
పచ్చిమిర్చి - 1
ఉల్లిపాయ - 1 పెద్దది
టోమాటో - 2
బేబీ కార్న్ ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
క్యారెట్- 3 టేబుల్ స్పూన్లు
గుమ్మడికాయ - పావు కప్పు
బ్రోకలీ - 3 టేబుల్ స్పూన్లు
క్యాప్సికమ్ ముక్కలు - 3 టేబుల్ స్పూన్లు
సొరకాయ ముక్కలు - టేబుల్ స్పూన్
తులసి ఆకులు - 5
మిరియాలు - అర స్పూన్
తయారీ విధానం
ముందుగా బార్లీనీ రాత్రంతా నానబెట్టుకోవాలి. బార్లీ నానిపోతే.. ఉదయాన్నే సూప్ చేసుకునేముందు ముందుగా కొన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి, అల్లాన్ని సన్నగా తురుముకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. టోమాటోలను పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు, క్యారెట్, బ్రోకలీ, బేబీ కార్న్‌ను కట్ చేసుకుని.. సూప్ కోసం రెడీగా ఉంచుకోవాలి. ముందుగా స్టౌవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో నీరు వేసి.. నానిన బార్లీ వేసి ఉడకనివ్వాలి. కుక్కర్లో కూడా దీనిని ఉడికించుకోవచ్చు. ఏది ఏమైనా బార్లీ మెత్తగా ఉడకాలి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయండి. దానిలో వెల్లుల్లి వేసి వేయించుకోండి. రంగుమారక ముందే అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో ఉల్లిపాయలు కూడా వేగనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టోమాటో పేస్ట్ వేయాలి. సన్నని మంట మీద దీనిని ఉడకనివ్వాలి. అడుగుపట్టకుండా దానిని తిప్పుతూ ఉండాలి. టోమాటో పేస్ట్ ఉడికి మంచి అరోమా వస్తున్నప్పుడు దానిలో బేబికార్న్ వేయాలి. గుమ్మడికాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసి ఉడకనివ్వాలి.
మూడు లేదా నాలుగు నిమిషాల తర్వాత గుమ్మడికాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఉడికినట్లు కనిపిస్తాయి. క్యాప్సికమ్ ముక్కలు, బ్రోకలీ వేపుకోవాలి. అవి వేగిన తర్వాత దానిలో లీటర్ నీరు వేయాలి. దానిని ఉడకనివ్వాలి. మీ దగ్గర ఇన్ని రకాల వెజిటేబుల్స్ లేకపోయినా ఉన్నవాటితోనే చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గరుండే ఆకు కూరలు, సూప్‌కి తగిన వెజిటేబుల్స్‌తో ఈ సూప్‌ని సిద్ధం చేసుకోవచ్చు. సూప్ బాగా ఉడికిన తర్వాత దానిలో మెత్తగా ఉడికించుకున్న బార్లీ వేయాలి. బార్లీ, వెజిటెబుల్స్ ఉడుకుతున్న సమయంలో ఉప్పు, మిరియాల పొడి వేయాలి. దానిలోనే తులసి ఆకులను వేసుకోవాలి. మంచి వాసన వస్తుంది. మరో 5 నిమిషాలు ఉడికించి.. స్టౌవ్ ఆపేయాలి. వేడి వేడి హెల్తీ సూప్ రెడీ. దీనిని మీరు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా, రాత్రులు పడుకునేముందు.. డిన్నర్ స్కిప్ చేయాలనుకున్నప్పుడు.. మధ్యాహ్నం లంచ్‌లో కూడా తీసుకోవచ్చు. మధుమేహమున్నవారు కూడా హాయిగా దీనిని ఆస్వాదించవచ్చు.
Also Read : టేస్టీ టేస్టీ షీర్ ఖుర్మా రెసిపీ.. రంజాన్ స్పెషల్ స్వీట్ ఇదే