అన్వేషించండి

Mango Lassi Recipe : సమ్మర్ స్పెషల్ కూల్ మ్యాంగో లస్సీ.. చాలా సింపుల్​గా చేసుకోగలిగే టేస్టీ రెసిపీ ఇదే

Summer Special Mango Lassi : మ్యాంగో అంటే చాలామందికి ఇష్టం. అయితే దీంతో చల్లటి లస్సీ చేసుకుని తాగితే ఎంత బాగుంటుందో కదా. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ టేస్టీ, చల్లటి మ్యాంగో రెసిపీ చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేసవిలో మామిడి పండ్లతో రుచికరమైన మ్యాంగో లస్సీ తయారుచేయండి.
  • మామిడి ముక్కలు, పాలు, పెరుగు, పంచదార, ఐస్ వాడాలి.
  • మెరుగైన రుచికి మ్యాంగో ఎసెన్స్, జీడిపప్పు జోడించవచ్చు.
  • మధుమేహం ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.

Homemade Mango Lassi Recipe for Hot Summer : వేసవిలో మామిడిపండ్లు ఎంత తిన్నా తనివి తీరదు. అందుకే వీటిని నేరుగా తినడంతో పాటు వివిధ రకాల వంటకాలుగా చేసుకుని ఆస్వాదిస్తారు. అలాంటివాటిలో మ్యాంగో లస్సీ కూడా ఒకటి. సరిగ్గా చేసుకోవాలే కానీ.. దీని రుచి అమోఘంగా ఉంటుంది. సమ్మర్​లో వేడి నుంచి ఉపశమనం కోసం.. చల్లగా, మ్యాంగో ఫ్లేవర్​తో ఏదైనా ఆస్వాదించాలనుకుంటే మ్యాంగో లస్సీ పర్​ఫెక్ట్ ఆప్షన్. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు  ఏంటో చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

మామిడి పండ్లు - 2

జీడిపప్పు - గుప్పెడు

పాలు - 350 మిల్లీ లీటర్లు

పెరుగు - అర లీటర్

పంచదార - దాదాపు కప్పు

మ్యాంగో ఎసెన్స్ - పావు టీస్పూన్

ఐస్ క్యూబ్స్ - 20 

తయారీ విధానం

ముందుగా బాగా పండిన మామిడి పళ్లు తీసుకుని వాటిపైన తొక్క తీసి.. ముక్కలుగా చేసుకోవాలి. వాటిని డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. జీడిపప్పును నీళ్లలో నానబెట్టుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. టేస్టీగా లస్సీ తాగాలనుకునేవారు దీనిని యాడ్ చేసుకోవచ్చు. అరగంట తర్వాత పంచదార తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిగా చేసుకోవాలి.

బ్లెండర్ తీసుకుని.. దానిలో చల్లని పాలు, ఫ్రీజర్లో నుంచి తీసిన మామిడి ముక్కలు, 20 ఐస్ క్యూబ్స్, పంచదార పొడి, మ్యాంగో ఎసెన్స్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. మ్యాంగో ఎసెన్స్ వేసుకుంటే లస్సీ మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు అర లీటర్ పెరుగు కూడా దానిలో వేసుకోవాలి. మరోసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి. అంతే టేస్టీ, చల్లటి మ్యాంగో లస్సీ రెడీ. 

మ్యాంగో లస్సీ సర్వ్ చేసుకునేప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులు, కొన్ని మామిడి పండ్ల ముక్కలు వేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మరింత చల్లగా తాగాలనుకునేవారు దీనిని ఫ్రిడ్జ్​లో పెట్టుకుని కాసేపటి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోగలిగే ఈ సమ్మర్ రెసిపీని మీరు కూడా ఈ వేసవిలో ట్రై చేసేయండి. పైగా దీనిని పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టపడతారు. కానీ మధుమేహం ఉన్నవారు దీనికి దూరంగా ఉంటే మంచిది. లేదా చాలా తక్కువ మోతాదులో తీసుకోవచ్చు.  

మరిన్ని రెసిపీల కోసం దీనిని క్లిక్ చేయండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Best Roti For Health: మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
Potato Boiling Guide: ప్రెషర్ కుక్కర్‌లో బంగాళాదుంపలు ఉడకడానికి ఎన్ని విజిల్స్ పడతాయి?  
ప్రెషర్ కుక్కర్‌లో బంగాళాదుంపలు ఉడకడానికి ఎన్ని విజిల్స్ పడతాయి?  
Gas Burner Cleaning: మూసుకుపోయిన గ్యాస్ బర్నర్ రంధ్రాలు నిమిషాల్లో శుభ్రం చేసే చిట్కాలు ఇవే!  
మూసుకుపోయిన గ్యాస్ బర్నర్ రంధ్రాలు నిమిషాల్లో శుభ్రం చేసే చిట్కాలు ఇవే!  
House Fly Control Tips: ఇంట్లో ఈగలు పోవడం లేదా? శాశ్వతంగా వదిలించుకునే సీక్రెట్ టిప్స్ ఇవే!
ఇంట్లో ఈగలు పోవడం లేదా? శాశ్వతంగా వదిలించుకునే సీక్రెట్ టిప్స్ ఇవే!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
Kohli Milestones Show: కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Embed widget