(Source: ECI/ABP News/ABP Majha)
Mother in law Bond: కొత్త కోడలికి అత్తగారితో సెట్ అవ్వట్లేదా... ఇలా చేయండి, ఫ్రెండ్సయిపోతారు
ఇంట్లో అత్తాకోడళ్లు స్నేహంగా ఉంటే చాలు, ఆ ఇల్లు స్వర్గమే. పడకపోతే మాత్రం అంతకన్నా నరకం ఉండదు.
పెళ్లంటేనే జీవితంలో పెద్ద మార్పు. ముఖ్యంగా అమ్మాయిలకు మరీను. అంతవరకు తన తల్లికి దగ్గరగా మెలిగిన అమ్మాయి, పెళ్లయ్యాక భర్త తల్లితో ఆప్యాయంగా మెలగాలి. ఏమాత్రం సర్దబాటు కాకపోయినా ఆ ఇల్లు నరకంలా మారిపోతుంది. అందుకే భర్తతో కన్నా ముందు అత్తతో స్నేహం చేయమని చెబుతుంటారు అనుభవజ్ఞులు. అత్తని స్నేహితురాలిగా మార్చుకుంటే ఎలాంటి కష్టం ఉండదు. అందుకు ఇవిగో కొన్ని మార్గాలు...
కలిసి వంట చేయండి
ఏ ఇంటికైనా వంటగదే ముఖ్యమైన ప్రదేశం. అత్తతో కలిసి వంటచేస్తే ఆమెకు మీపై మంచి అభిప్రాయంతో పాటూ ప్రేమ కూడా పెరుగుతుంది. వంట చేస్తూ ఆమె తన అనుభవాలను మీతో పంచుకుంటూ స్నేహితురాలిగా మారుతుంది. అప్పుడప్పుడు ఆవిడకి ఇష్టమైన వంటకాలు స్వయంగా మీరే వండి వడ్డించండి.
షాపింగ్‌కు తీసుకెళ్లండి
మీరు ఎప్పుడు షాపింగ్ కు వెళ్లినా అత్తగారిని తీసుకుని వెళ్లండి. ఏమి కొనాలనుకున్నా ఆమె అభిప్రాయం కనుక్కోండి. ఆమె ఇష్టాలకు విలువనివ్వండి. ఆమె ఎంపిక చేసినవే తీసుకోండి. షాపింగ్ అయ్యాక రెస్టారెంట్ కు వెళ్లి కలిసి తినండి. ఇలా చేస్తే కొన్నాళ్లకు అత్త మీకు అభిమాని అయిపోవడం ఖాయం. ఆ తరువాత మీ ఇష్టాలను ఆమ విలువ ఇవ్వడం మొదలుపెడుతుంది.
జంటగా సినిమాకు
భర్తతోనే కాదు, అప్పుడప్పుడు అత్తగారితో కూడా సినిమాకు వెళ్తుండండి. ఆమెకు కూడా బయటి ప్రపంచాన్ని పరిచయం చేయండి.
ఆటలు ఆడుతూ...
ఇంట్లో పనులు అయ్యాక మీ ఇద్దరూ ఖాళీగా ఉన్నప్పుడు కలిసి బోర్డు గేమ్లు ఆడుకోండి. మీరు ఉద్యోగిని అయితే రాత్రి పడుకునే ముందు కాసేపు ఆమెతో కొంత సమయం గడపండి.
గార్డెనింగ్
అత్తాకోడళ్లను ఒక్కచోట చేర్చే మంచి పని గార్డెనింగ్. కలిసి మొక్కలు నాటుతూ, నీళ్లు పోస్తూ సమయమే తెలియకుండా గడిపేయచ్చు. ఇవన్నీ చిన్నపనులే కానీ మనుషులను దగ్గర చేయడంలో మాత్రం చాలా శక్తివంతమైనవి.
Read also: భోజనం మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
Read also: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల
Read also: థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!
Read also: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి
Read also: బ్రౌన్ రైస్, వైట్ రైస్, బాస్మతి రైస్... డయాబెటిస్ ఉన్న వారికి ఏ బియ్యం బెటర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి