Weight Loss : జిమ్, నో-కార్బ్ డైట్‌తో తగ్గేది కొవ్వు కాదట.. బరువు తగ్గడానికి తమన్నా ఫిట్‌నెస్ కోచ్ ఇస్తోన్న టిప్స్ ఇవే
Right Way to Lose Fat : బరువు తగ్గడానికి చాలామంది కార్బ్స్ పూర్తిగా మానేస్తారు. జిమ్ చేస్తే కొవ్వు తగ్గుతుందని భావిస్తారు. కానీ నిజంగా బరువు తగ్గాలంటే ఏమి చేయాలో తెలుసా?

Tamannaah Fitness Coach Weight Loss Tips : బరువు తగ్గాలని అనుకున్న వెంటనే.. అందరం ఒకటే ఆలోచనతో ఉంటాము. జిమ్‌లో చెమట పట్టేలా వ్యాయామం చేయాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్లని తగ్గించాలి. బంగాళాదుంపలు, చపాతీలు, బియ్యం వంటివి తీసుకోకూడదు. ట్రెడ్‌మిల్, చికెన్ గ్రిల్ బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాయి. బరువు తగ్గాలంటే వీటిని ఫాలో అవ్వాలని.. అనుకుంటారు. కానీ మీకు తెలుసా? బరువు తగ్గాలనుకుంటే.. అపోహలు కాదు వాస్తవానికి దగ్గరగా ఉండాలంటున్నారు.. తమన్నా భాటియా ఫిట్‌నెస్ కోచ్ సిద్ధార్థ్ సింగ్.
సోషల్ మీడియా పోస్ట్‌లో ఈవిధంగా వెల్లడించాడు. రోజుకు 40 నుంచి 50 నిమిషాల కార్డియో, కార్బోహైడ్రేట్‌లను పూర్తిగా తొలగించడం కొవ్వు తగ్గడానికి ఒక షార్ట్‌కట్. కానీ ఇది స్థిరమైన మార్గం కాదని చెప్పాడు. ఈ ఫార్ములా నిజంగా పని చేస్తే.. ట్రైనర్ దగ్గరికి ఎందుకు అందరూ వస్తారంటూ క్వశ్చన్ చేశారు. ఈ పద్ధతి చాలా మందికి ఫలితాలను ఇవ్వదని అంటున్నారు. ఇంతకీ సిద్ధార్థ్ సింగ్ చెప్పే విషయాలు ఏంటి? బరువు తగ్గేందుకు వేటిని ఫాలో అవ్వాలి?
View this post on Instagram
ఇన్స్టంట్ రిజల్ట్స్ వద్దు..
ఫిట్‌నెస్ కోచ్ సిద్ధార్థ్ సింగ్ ప్రకారం.. ఎక్కువ కార్డియో, జీరో-కార్బ్ డైట్ ద్వారా బరువు తగ్గితే నిజమైన కొవ్వు తగ్గదని చెప్తున్నారు. ఎక్కువగా నీరు, గ్లైకోజెన్ బయటకు వస్తాయి. దీని ఫలితంగా మనపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపారు.
- అలసట
- చిరాకు
- కార్బ్స్ కోసం తీవ్రమైన కోరిక
- అదే బరువు
అందుకే చాలా మంది నో-కార్బ్ డైట్‌ను ప్రారంభిస్తారు. కానీ కొన్ని వారాల్లో వారు ఎక్కడ ప్రారంభించారో అక్కడికే తిరిగి వస్తారు. ఒకేసారి క్రేవింగ్స్ ఎక్కువై.. మళ్లీ తినేస్తారు. దీనివల్ల కోల్పోయిన బరువు కూడా ఈజీగా పెరిగిపోతారు.
మంచి ఫలితాల కోసం..
బరువు తగ్గాలనుకున్నప్పుడు సిద్ధార్థ్ శాశ్వతంగా రిజల్ట్స్ ఇచ్చేవాటిని ఎంచుకోవాలంటున్నారు. అప్పుడే నిజమైన కొవ్వు తగ్గుతుందని చెప్తున్నారు. అతను ఇస్తోన్న కొన్ని సలహాలు..
- మీరు నచ్చిన వర్క్అవుట్స్ ఎంచుకోండి..
- రోజువారీ ఆహారంలో ప్రోటీన్, బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోండి.
- ఏది చేసినా.. రెగ్యులర్‌గా ఫాలో అయ్యేలా ప్లాన్ చేసుకోండి.
స్ట్రెంత్ ట్రైనింగ్..
సిద్ధార్థ్ ప్రకారం.. స్ట్రెంత్ కోసం కేవలం నడవడం మాత్రమే సరిపోదు. కార్డియో కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. కానీ ఇది కండరాలను నిర్మించదు. కండర బలం లేకుండా జీవక్రియ వేగంగా ఉండదు. అందుకే మనం సమతుల్య ప్రణాళికతో పని చేయాలి.
- తేలికపాటి కార్డియో
- దాంతో పాటు రోజువారీ నడక
ఈ కలయిక కొవ్వును వేగంగా తగ్గిస్తుంది. శరీరాన్ని మంచి ఆకృతిలోకి తెస్తుంది.
ప్రణాళిక ఎలా ఉండాలంటే..
మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు.. మీరు సులభంగా, ఎక్కువ కాలం చేయగలిగేది ఎంచుకోవాలి. అది ఎలా ఉండాలంటే..
- వారానికి 3 రోజులు స్ట్రెంత్ ట్రైనింగ్
- 2 నుంచి 3 చిన్న కార్డియో లేదా కండిషనింగ్ సెషన్‌లు
- తేలికపాటి నడక
- ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారంతో రోజును ప్రారంభించాలి.
- వర్కవుట్‌లతో పాటు కార్బ్స్ కంట్రోల్ చేయాలి.
- నిద్ర, నీరు, ఒత్తిడిపై దృష్టి పెట్టాలి.
మీరు ఏ రొటీన్ చేసినా.. వారాల తరబడి కాకుండా.. నెలల తరబడి కొనసాగే దినచర్యను రూపొందించుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు చూడగలుగుతారని చెప్తున్నారు సిద్ధార్థ్.






















