అన్వేషించండి

పొగతాగడం వల్లే క్యాన్సర్, మరోసారి రుజువు చేస్తున్న ఎయిమ్స్ అధ్యయనం

మన దేశంలో టీబీ ప్రబలంగా ఉండడం వల్ల క్యాన్సర్ అని నిర్ధారించుకోవడంలో జాప్యం జరుగుతోందని కొత్త అధ్యయనం రుజువులు చూపుతోంది. ఏయిమ్స్ తాజా నివేదిక వెలువరించిన ఆశ్చర్యకర విషయాలు ఇక్కడ చూద్దాం.

పొగతాగే వారిలో లక్షణాలు కనిపించినా మన దేశంలో టీబీ ప్రబలంగా ఉండడం వల్ల క్యాన్సర్ అని నిర్ధారించుకోవడంలో జాప్యం జరుగుతోందని కొత్త అధ్యయనం రుజువులు చూపుతోంది. ఏయిమ్స్ విడుదల చేసిన కొత్త అధ్యయన ఫలితాలు ఇక్కడ చూద్దాం.

లంగ్ క్యాన్సర్స్ పురుషుల్లోనే ఎక్కువ. అందుకు ముఖ్య కారణం పొగతాగడం. ఇలా పొగతాగే వారు స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (SCLC) బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవల ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ మెడికల్ సైన్స్ (AIIMS) వైద్యులు నిర్వహించిన అధ్యయన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ లో లంగ్స్ లోని కణజాలాల్లో క్యాన్సర్ వృద్ధి చెందుతుంది. చిన్నచిన్న శ్వాస నాళాలను బ్రాంకీ అంటారు. ఇక్కడ ఈ క్యాన్సర్ ప్రారంభమవుతుంది. చాలా త్వరగా ఈ కణాల సంఖ్య పెరుగటం మాత్రమే కాదు, వీటి పరిమాణం కూడా చాలా త్వరగా పెరుగుతుంది. అంతేకాదు చాలా త్వరగా శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది ఈ క్యాన్సర్.

ఉత్తర భారత దేశంలో ఈ వ్యాధి బారిన పడిన వారిని ఈ  అధ్యయనానికి ఎంచుకున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో చాలా మంది పొగతాగే అలవాటున్న వారే కావడం గమనార్హం. ఇందులో 65 శాతం మంది చైన్ స్మోకర్లు. దీన్ని ఆధారం చేసుకోని డాక్టర్లు స్మోకింగ్ కు లంగ్ క్యాన్సర్ కు ఉన్న సంబందాన్ని మరోసారి రుజువు చేస్తున్నారు. వందలో ఇరవై మంది క్యాన్సర్ పేషెంట్లు మాత్రమే పొగతాగే అలవాటు లేని వారున్నారట. కచ్చితమైన కారణాలు తెలియక పోయినా మిడిల్ ఇన్కమ్, లో ఇన్కమ్ పీపుల్ లోనే ఈ లంగ్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోందని ఇండియన్ చెస్ట్ సొసైటి వారి జర్నల్  లంగ్ ఇండియాలో ప్రచురించారు.

ఈ అధ్యయనానికి 360 మంది 46-70 సంవత్సరాల మధ్య వయసున్న క్యాన్సర్ పేషెంట్లను ఎంపిక చేసుకున్నారు. వీరంతా కూడా దాదాపు 12 సంవత్సరాల పాటు ఈ అధ్యయనంలో భాగం పంచుకున్నారు. ఈ అధ్యయనాన్ని ఏయిమ్స్ పల్మనరీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ అనంత మోహన్, ప్రొఫెసర్, మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నిర్వహించారు. అయితే దశాబ్ధ కాలంగా ఎస్సీఎల్సీ కేసులు తగ్గుతున్నట్టు గమనించామని అంటున్నారు ఈ నిపుణులు అయితే టెక్నాలజీ ఎంత పెరిగినప్పటికీ వ్యాధిని త్వరగా నిర్ధారించడంలో మాత్రం విఫలమవుతున్నామని అంటున్నారు. అందువల్ల క్యాన్సర్ సర్వైవల్ సంఖ్య అంత ఆశాజనకంగా లేదట.

ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న రోగులలో సగం మంది నిరక్షరాస్యులు లేదా స్కల్ ఫైనల్ కూడా పూర్తి చెయ్యని వారు. కనుక అవగాహాన లేమి వల్లే వారిలో పొగతాగే అలవాటు కొనసాగి ఉంటుందని అధ్యయన కారులు అభిప్రాయపడ్డారు. ‘‘ చదువు లేకపోవడం వల్లే వీరిలో స్మోకింగ్ గురించిన అవగాహన కొరవడింది. స్మోకింగ్ అలవాటు, దాన్ని మానుకునే ఆలోచన, సామర్థ్యం చదువు తద్వారా వచ్చే అవగాహనతో సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు సమస్యను త్వరగా గుర్తించడం, పరీక్షలు చేయించుకోవడం వంటి జాగ్రత్తల విషయం లో కూడా అవగాహానా లేమి వల్ల జాప్యం జరిగి వ్యాధి ముదిరిపోతోంది’’ అని అధ్యయనం చెబుతోంది.

వ్యాధి ముదిరిపోవడానికి గల కారణాల్లో 26.7 శాతం వరకు వ్యాధిని నిర్థారించడం, సరైన చికిత్స ప్రారంభించడంలో జరిగే జాప్యం వల్లే. చాలా వరకు ఈ సమస్యను టీబీ గా భావించి యాంటీ టీబీ మందులు ఇవ్వడం వల్ రోగం ముదిరిపొయ్యే వరకు తెలియడం లేదు. భారతీయ సమాజంలో టీబీ ఇంకా కూడా విస్తృతంగా ఉండడం వల్ల లక్షణాలను బట్టి క్యాన్సరా? లేక టీబీ ఇన్ఫెక్షనా? అనేది తేల్చుకునే లోపు క్యాన్సర్ ముదిరిపోతోందని కూడా ఈ అధ్యయనం అభిప్రాయపడింది. 360 మంది క్యాన్సర్ పేషెంట్ల మీద ఈ అధ్యయనం జరపగా వీరిలో కేవలం 50 శాతం మందికి మాత్రమే నిర్థుష్టమైన క్యాన్సర్ చికిత్స అందినట్టు నిపుణులు చెబుతున్నారు.

క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్న వారిలో కేవలం 49 శాతం మంది రోగులకు మాత్రమే కీమోథెరపి చికిత్స అందించారు. వీరిలో 12 మందికి మాత్రమే కంబైన్డ్  CT-RT చికిత్స అందించ గలిగారు. దీనికి ప్రధాన కారణం రేడియోథెరపి కొరకు ఎక్కువ కాలం పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్ల కీమో, రేడియో చికిత్సలు ఏకకాలంలో అందించడం వీలు కావడం లేదు.  ఎందుకంటే ఆ సెంటర్ లో రోగులకు సరిపడినన్ని రేడియోథెరపీ పరికరాలు అందుబాటులో ఏవని అక్కడి వారు చెబుతున్నారు. ఎస్ సీ ఎల్ సీ ప్రాథమిక దశల్లో ఉన్నవారికి ఇప్పటి వరకు ఎవరూ కూడా సర్జరీ  చేయించుకోలేదు అని ఈ అధ్యయన నివేదికి తెలియజేస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Issue: మనోజ్‌పై మొదటి నుంచి వివక్షే - మోహన్ బాబే తప్పే ఎక్కువ ?
మనోజ్‌పై మొదటి నుంచి వివక్షే - మోహన్ బాబే తప్పే ఎక్కువ ?
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Issue: మనోజ్‌పై మొదటి నుంచి వివక్షే - మోహన్ బాబే తప్పే ఎక్కువ ?
మనోజ్‌పై మొదటి నుంచి వివక్షే - మోహన్ బాబే తప్పే ఎక్కువ ?
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Pushpa 2 Collection: 'పుష్ప 2'కు 1000 కోట్లు... సామి నువ్వు ఆడు సామి... నువ్వు ఆడాలా - బాక్సాఫీస్ బద్దలవ్వాలా
'పుష్ప 2'కు 1000 కోట్లు... సామి నువ్వు ఆడు సామి... నువ్వు ఆడాలా - బాక్సాఫీస్ బద్దలవ్వాలా
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Embed widget