Natural Skin Glowing Tips : స్కిన్ సహజంగా గ్లో అవ్వాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. అందానికే కాదు, ఆరోగ్యానికి కూడా
Skin Glowing Tips : ముఖంలో గ్లో కనిపించేందుకు చాలామంది మేకప్ వేసుకుంటారు. కానీ మీ స్కిన్ సహజంగా మెరుస్తూ షైనీగా మారాలంటే కొన్ని రెగ్యులర్ టిప్స్ ఫాలో అయితే చాలు అంటున్నారు అవేంటంటే..
Simple Skin Care Routine : చర్మం సహజంగా మెరుస్తూ.. షైనీగా ఉంటే ఆ లుక్‌ని మాటల్లో వర్ణించలేము. మేకప్‌తో గ్లో లుక్‌ని సింపుల్‌గా తెచ్చుకోవచ్చు. కానీ మేకప్ అనేది ఎప్పటికైనా.. ఎలా అయినా స్కిన్‌ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి సహజంగా స్కిన్‌కి మెరుపుని, గ్లోని అందించే రోటీన్ని ఫాలో అవ్వాలి. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వ్యాయామంతో పాటు కొన్ని మార్పులు, కొన్ని చేర్పులు చేస్తే చాలు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ మార్పులు ఏంటి? చేర్పులు ఏంటి?
వ్యాయామం
ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా వ్యాయామం చాలా అవసరం. మీరు రోజూ వ్యాయామం చేస్తూ ఉంటే మీ స్కిన్ గ్లో అవుతూ ఉంటుంది. మీరు కొన్ని రోజులు ఎక్సర్సైజ్ చేసి చూస్తే ఈ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా వర్క్అవుట్లు, వాకింగ్ వంటివి చేస్తూ ఉండండి.
డైట్
మీ గట్ ఎంత హెల్తీగా ఉంటే.. మీ స్కిన్ అంత గ్లోయింగ్‌గా ఉంటుంది. కాబట్టి ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు ఫాలో అయితే స్కిన్ సహజంగా గ్లో అవుతుంది. పండ్లు, కూరగాయలు, పప్పులు, హెల్తీ ఫ్యాట్స్‌ని డైట్లో చేర్చుకుంటే మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తాయి.
నిద్ర
నిద్ర అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలామంచిది. మీరు ఓ రోజు 8 గంటలు నిద్రపోయారంటే మీ స్కిన్‌లో డిఫరెన్స్ తెలుస్తుంది. రోజూ ఇదే షెడ్యూల్ కంటిన్యూ చేస్తే స్కిన్‌కి మంచి గ్లో రావడమే కాదు.. వృద్ధాప్య ఛాయలు కూడా దూరమవుతాయి. కాబట్టి నిద్ర విషయంలో కాంప్రిమైజ్ కాకండి.
సన్ స్క్రీన్
ఏ కాలంలోనైనా.. ఇంట్లోనే ఉన్నా.. సన్‌స్క్రీన్ అస్సలు స్కిప్ చేయకూడదు. సన్‌స్క్రీన్ స్కిన్‌ని కాపాడడమే కాకుండా.. సూర్య కిరణాల వల్ల స్కిన్ డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే స్కిన్‌కి మంచి గ్లోని ఇవ్వడంతో పాటు.. హెల్తీ స్కిన్‌ని ప్రమోట్ చేస్తుంది. స్కిన్‌కి బారియర్‌గా ఉంటుంది.
ఎక్స్ఫోలియేట్
స్కిన్‌ని వారానికోసారైనా ఎక్స్ఫోలియేట్ చేయాలి. దీనివల్ల స్కిన్‌పై ఉండే డార్క్, టాన్ అంతా పోతుంది. అంతేకాకుండా స్కిన్‌ని కూడా బ్రైట్‌గా చేస్తుంది. డెడ్ సెల్స్‌ని రిమూవ్ చేసి.. గ్లోని అందిస్తుంది.
Also Read : సెలబ్రెటీలు పవర్‌లిఫ్టింగ్ చేసేది ఇందుకే.. బెనిఫిట్స్, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
హైడ్రేషన్
స్కిన్‌ని హెల్తీగా ఉంచడంలో, గ్లోని అందించడంలో హైడ్రేషన్ అనేది కీ అని చెప్పవచ్చు. కాబట్టి రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగండి. ఇది స్కిన్ హెల్త్‌ని మెరుగుపరిచి.. సహజంగా మెరిసేలా చేస్తుంది.
ఒత్తిడి
ఒత్తిడి కూడా స్కిన్ హెల్త్‌ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకుంటే స్కిన్ గ్లో అవుతుంది. మెడిటేషన్, డీప్ బ్రీతింగ్, యోగా వంటివి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది.
ఈ రోటీన్‌ను రెగ్యూలర్‌గా ఫాలో అయితే అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. హెల్తీ స్కిన్ మీ సొంతమై.. వృద్ధాప్యఛాయలు దూరమవుతాయి.
Also Read : ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు సింపుల్‌గా ముస్తాబై, స్టన్నింగ్‌గా కనిపించాలంటే కీర్తి సురేష్‌ని ఫాలో అయిపోండిలా