News
News
X

ఉదయం లేవగానే ఈ పనులు చేసి చూడండి - ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం

మీ అందం రోజు రోజుకు తరిగిపోవడానికి కారణం.. మీరే. ఔనండి. ఉదయాన్నే ఇలాంటి చిట్కాలు పాటిస్తే.. మీ వయస్సు రివర్స్ అవుతుంది.

FOLLOW US: 

రీరానికి శక్తిని నింపేందుకు ఉదయం పూట చాలా మంచి సమయం. నిద్ర లేవగానే మనం చేసే పనులు తీసుకునే ఆహార ప్రభావం రోజంతా కనిపిస్తుంది. ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ లేవగానే ముందుగా చూస్తుంది ఫోన్. అందులోనూ వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ మీదే ఎక్కువ దృషి పడుతుంది. అవి చూసిన వెంటనే గబ గబ లేచి ఉరుకులు పెడుతూ తమ పనులు ముగించుకుని బయటకి వెళ్లిపోతున్నారు. చర్మం, జుట్టు సంరక్షణ గురించి వారానికి ఒకసారి నెలకి ఒకసారి ఆలోచిస్తున్నారు. ఈ బ్యూటీ పార్లర్, సౌందర్య ఉత్పత్తులు వచ్చిన తర్వాత సహజమైన అందాన్ని పొందేందుకు ఎవరు ప్రయత్నించడం లేదు. అందరూ పార్లర్ వెంట పడుతూ లేని అందాలను వేలకి వేలు కొని పోసి తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా కొద్దిగా సమయాన్ని మనకంటూ ప్రత్యేకంగా కేటాయించుకుంటే ఇంట్లోనే సులభంగా మెరిసే చర్మాన్ని, సహజమైన అందాన్ని పొందవచ్చు. అందుకోసం చిన్న చిన్న పనులు చేస్తే సరిపోతుంది.

ఉదయాన్నే వ్యాయామం లేదా ఇంటి పనులు చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. అల్పాహారంగా కఠినమైన పదార్థాలు తీసుకోకుండా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎంచుకోవాలి. మంచి ఆరోగ్యమే కాదు జుట్టు, చర్మ సంరక్షణ కూడా ముఖ్యమే. అందుకే ఉదయం నిద్ర లేచిన వెంటనే వీలైతే ఈ పనులు చేసేందుకు ప్రయత్నించండి.

ఆయిల్ పుల్లింగ్: ఇది సుప్రసిద్ధ ఆయుర్వేద టెక్నిక్. దీనికి కేవలం కొన్ని నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటుంది. ఆయిల్ పుల్లింగ్ చెయ్యడం వల్ల నోటిలో ఉన్న బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఒక స్పూన్ కొబ్బరి నూనె లేదా ఇంకేదైనా నూనెతో ఆయిల్ పుల్లింగ్ చెయ్యొచ్చు. కొద్ది నిమిషాల పాటు ఆ నూనెని మింగకుండా పుక్కిలించి ఊసేయాలి. ఇలా చెయ్యడం వల్ల నోటి దుర్వాసన ఉండదు. బ్యాక్టీరియా కూడా నశించిపోతుంది. చిగుళ్ళు కూడా బలపడతాయి.

నీరు తాగడం: ఉదయం లేచిన వెంటనే కాఫీ, టీ తాగుతారు. పరగడుపున వీటికి బదులుగా ఒక గ్లాస్ మంచి నీరు తాగడం చాలా మేలు చేస్తుంది. నిద్ర వల్ల చాలా సమయం నీరు లేకుండా ఉండటం వల్ల శరీరం డీ హైడ్రేట్ అవుతుంది. పొద్దున్నే నీరు తాగడం వల్ల శరీరం రీ హైడ్రేట్ అవుతుంది. జీర్ణక్రియ, జీవక్రియకి ఇది ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ నీరు తాగడం వల్ల మీరు రీఫ్రెష్ అవుతారు.

చర్మ సంరక్షణ కోసం

పసుపుతో ఫేస్ ప్యాక్: ఇది పాకెట్ ఫ్రెండ్లీ. పసుపు మంచి యాంటీ బయాటిక్ గా పని చేస్తుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపుతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఇది మొటిమలు, వాటి వల్ల వచ్చే నల్ల మచ్చలను తొలగిస్తుంది.

రోజ్ వాటర్: రోజ్ వాటర్ తో చర్మం శుభ్రం చెయ్యడం వల్ల జిడ్డు పోతుంది. మలినాలను పారద్రోలుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంతో పాటు ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది.

ముల్తాని మట్టి: ఇది స్కిన్ కి అద్భుతంగా పని చేస్తుంది. ముల్తాని మట్టితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం మెరిసిపోతుంది. ఇందులో యాంటీ యాక్నే, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. చర్మం దెబ్బతినకుండా చేస్తుంది. బ్లాక్ హెడ్స్, మొటిమల వల్ల వచ్చే నల్ల మచ్చలను తొలగించడానికి సహాయ పడుతుంది. 

Also Read: ‘డైట్’ సోడా డ్రింక్స్ సేఫ్ అనుకుంటున్నారా? ఎంత ముప్పో తెలిస్తే మళ్లీ ముట్టరు!

Also Read: అరటి పండు అతిగా తింటున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త

Published at : 17 Aug 2022 05:57 PM (IST) Tags: Health Tips Skin Care Tips Beauty tips Healthy life style Multani Matti Oil Pulling

సంబంధిత కథనాలు

Cardiac Arrest: ఆకస్మిక గుండె నొప్పి ఎలా వస్తుంది? ఆ ముప్పు నుంచి బయటపడేదెలా?

Cardiac Arrest: ఆకస్మిక గుండె నొప్పి ఎలా వస్తుంది? ఆ ముప్పు నుంచి బయటపడేదెలా?

Meals: భోజనం తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు

Meals: భోజనం తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు

Cough Syrups Banned: దగ్గు మందు అంత ప్రమాదకరమా? ఆ పిల్లల మరణానికి కారణాలేమిటీ?

Cough Syrups Banned: దగ్గు మందు అంత ప్రమాదకరమా? ఆ పిల్లల మరణానికి కారణాలేమిటీ?

అరె ఏంట్రా ఇదీ, ఆఫీసుకు రమ్మంటే ఉద్యోగాలు మానేస్తారా? 61 శాతం మందికి ఇదే ఆలోచన: స్టడీ

అరె ఏంట్రా ఇదీ, ఆఫీసుకు రమ్మంటే ఉద్యోగాలు మానేస్తారా? 61 శాతం మందికి ఇదే ఆలోచన: స్టడీ

Mysterious Places: ప్రపంచంలో గురుత్వాకర్షణ పని చేయని వింత ప్రదేశాలు ఇవే, గాల్లో తేలినట్లే!

Mysterious Places: ప్రపంచంలో గురుత్వాకర్షణ పని చేయని వింత ప్రదేశాలు ఇవే, గాల్లో తేలినట్లే!

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు