By: ABP Desam | Updated at : 15 May 2023 07:36 PM (IST)
Image Credit: Pixabay
శరీర సాధారణ పనితీరుకు, ఎదుగుదలకి విటమిన్లు, ఖనిజాలు చాలా అవసరం. ఇవి లోపిస్తే వాటిని భర్తీ చేయడానికి కొంతమంది సప్లిమెంట్లను సూచిస్తారు. కానీ వైద్యుని సలహా తీసుకోకుండా ఎటువంటి విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది అనేక దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. విటమిన్ బి 12 లేదా విటమిన్ డి వంటివి శరీర అభివృద్ధి విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆహారం ద్వారా పొందడానికి వీల్లేని విటమిన్ల లోపాన్ని పూరించేందుకు వైద్యులు సప్లిమెంట్లు సిఫార్సు చేస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, లోపాలకు సంబంధించిన సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. కానీ అతిగా వాడితే ఇబ్బందులు వస్తాయి.
విటమిన్స్ సప్లిమెంట్స్ తీసుకుంటే అందరికీ అనార్థాలు ఎదురవుతాయని లేదు. వైద్యులు సూచించిన మోతాదు ప్రకారం కాకుండా అతిగా తీసుకున్నా లేదంటే సొంత వైద్యంగా తీసుకుంటే మాత్రం దుష్ప్రభావాలకు కారణం కావచ్చు.
⦿ విటమిన్ సి సాధారణంగా సురక్షితమైనదిగా పరిగణిస్తారు. అయితే అధిక మోతాదులో తీసుకుంటే అతిసారం, కడుపు తిమ్మిరి వంటి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. మరికొంత మందికి కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదానికి కూడా దారి తీయవచ్చు.
⦿ విటమిన్ బి12 సప్లిమెంట్లు కొంతమందికి సెట్ అవుతాయి. కానీ ఇంకొంత మందిలో వికారం, అతిసారం లేదా తలనొప్పి వంటి తేలికపాటి దుష్ప్రభావాలు అనుభవిస్తారు.
⦿ చేప నూనె నుంచి తీసుకోబడిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ చేపల రుచి, దుర్వాసన, జీర్ణ అసౌకర్యానికి కారణం కావచ్చు. రక్తాన్ని పలుచన చేసే మందులు తీసుకునే వ్యక్తులలో రక్తస్రావం ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.
⦿ ఐరన్ సప్లిమెంట్స్ మలబద్ధకం, వికారం, కడుపు తిమ్మిరికి కారణం కావచ్చు. అరుదైన సందర్భాల్లో ఐరన్ ఓవర్ లోడ్ అవుతుంది. హెమోక్రోమాటోసిస్ వంటి వంశపారంపర్య పరిస్థితులతో బాధపడుతున్న వారిలో ఈ తరహా పరిస్థితి ఎదురవుతుంది.
⦿ హెర్బల్ రెమిడీస్, వెయిట్ లాస్, ఎయిడ్స్ లేదా హార్మోన్ ఆధారిత సప్లిమెంట్స్ వంటి ఇతర సప్లిమెంట్లు అలర్జీ ప్రతిచర్యలు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. వీటిని తగ్గించుకునేందుకు ఇతర సప్లిమెంట్స్ తీసుకునే ముందు ఆరోగ్య నిపుణులు తప్పనిసరిగా సంప్రదించడం ముఖ్యం.
మోతాదుకి మించి వేసుకోవడం లేదా ఇతర మందులతో సరిపోలకపోవడం, అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు వంటివి కారణాలుగా చెప్పవచ్చు. ట్యాబ్లెట్ల నుంచి లిక్విడ్ లేదా గమ్మీలకు మారడం వంటివి దుష్ప్రభావాలను తగ్గిస్తాయి. అతిగా సమస్యలు వస్తే వాటికి బదులుగా వేరే వాటిని వైద్యులు సిఫార్సు చేస్తారు. లేదంటే ఆహారంలో మార్పులు సూచిస్తారు.
కొంతమంది మహిళలు తమ పోషకాహార అవసరాలను తీర్చుకోవడానికి విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం చాలా ముఖ్యం. రుతుస్రావం, గర్భం, మెనోపాజ్ వంటి కారణాల వల్ల మహిళలకు ప్రత్యేకమైన శారీరక అవసరాలు ఉంటాయి. కొన్ని విటమిన్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. గర్భం దాల్చినప్పుడు శిశువు ఆరోగ్యం కోసం తరచుగా అదనపు ఫోలిక్ యాసిడ్స్ తీసుకుంటారు. మెనోపాజ్ లో ఉన్న మహిళలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి వారికి పోషకాహార లోపాలని నివారించడంలో సహాయపడతాయి. అయితే ఏదైనా సప్లిమెంట్ తీసుకునే ముందు వైద్యుల సలహా అవసరం. సమతుల్య ఆహారం తీసుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరమైనప్పుడు మాత్రమే సప్లిమెంట్ల జోలికి వెళ్ళాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: చర్మానికి హాని చేసే ఆహారాలు ఇవే
Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు
Relationships: ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తాడు, వచ్చిన వెంటనే ఆ పనిలో పడతాడు, అతడిని మార్చడం ఎలా?
Mental Illness: ఈ మానసిక రోగాల గురించి ఇంతకుముందు మీరు విని ఉండరు, ఇవి చాలా అరుదైనవి
Screen Time: స్క్రీన్ టైమ్ పెరిగితే హార్మోన్ల అసమతుల్యత వచ్చే అవకాశం, జాగ్రత్త పడండి
Milk in Dream: పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా? మీకేం జరగబోతోందో తెలుసా?
ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
Delhi Murder Case: మాట్లాడటం లేదనే ఢిల్లీలో బాలిక హత్య- నేరాన్ని అంగీకరించిన సాహిల్
Prabhas Vs Bollywood Heroes : ప్రభాస్ కంటే శ్రీ రాముని పాత్రకు ఆ హిందీ హీరోలు బెటరా?