International Womens Day 2024 : నిజమైన ఉమెన్స్ డే అంటే ఇదే.. అందరి బాధ్యతతో పాటు మీ సుఖము ముఖ్యమే
Self Care Tips : మహిళా దినోత్సవం అంటే అదేదో సెలబ్రేషన్స్.. ఆడదే ఆధారం అంటే సరిపోదు. ఎవరు మీ గురించి కేర్ తీసుకున్నా.. తీసుకోకపోయినా.. మీరు మాత్రం తప్పకుండా మీ శరీరం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
Womens Day 2024 : మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి. ఇది అందరూ చెప్పే మాటనే. కానీ మహిళలు తమ ఆరోగ్యం విషయంలో కచ్చితంగా వెనుకపడే ఉన్నారనే విషయం తెలుసుకోవాలి. అంతే కాకుండా స్వీయ సంరక్షణకు ప్రాధ్యాన్యతనిచ్చుకోవాలి. మాకు అంత టైమ్ ఎక్కడ ఉంటుంది అనుకునేవారంతా.. తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే కచ్చింతగా మీ స్వీయ సంరక్షణకు సమయం దొరుకుతుంది. అయితే మీరు హెల్తీగా, సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి ఎలాంటి రోటీన్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి అందరూ సిద్ధమవుతున్నారు. స్త్రీని ప్రతి రోజు గౌరవించాలనే సున్నితమైన రిమైండర్ ఇది. తన ప్రియమైన వారిని నిస్వార్థతతో ప్రేమిస్తూ.. తన సెల్ఫ్కేర్ను తానే మరిచిపోయే ఉన్నతమైన మనసు మహిళకు ఉంటుంది. అలాంటి మహిళలు తమ ఆరోగ్యం, సెల్ఫ్కేర్కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. కొందరు మా వయసు ఇది కాదులే.. ఇప్పుడు మేము చేస్తే బాగోదులే అనే ధోరణిలో వెనకడుగు వేసేస్తారు కానీ.. కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరం.
జుట్టు విషయంలో..
కొంందరు త చేతిలో పని అయినా సరే జుట్టు విషయంలో సరైన శ్రద్ధ తీసుకోరు. చాలామంది జుట్టును ముడి వేసుకునే తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. జుట్టు రాలిపోయాక బాధపడే బదులు.. జుట్టు ఉన్నప్పుడే దానిపై కాస్త శ్రద్ధ చూపించాలి. ఇప్పుడు అమ్మాయిలైతే జుట్టును మెయింటైన్ అయినా చేస్తున్నారు. ఇప్పటికీ హెయిర్ సెలూన్‌కి వెళ్లని వారు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసం లేదు. జుట్టుకి ఆయిల్ పెట్టడం, తలస్నానం చేయడంలో జాగ్రత్తలు తీసుకోవడం.. జుట్టు ఊడిపోకుండా వివిధ ఆయిల్స్ వాడడం.. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసే ఫుడ్స్ తీసుకోవడం వంటివి చేయాలి.
స్కిన్ కేర్
స్కిన్ కేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పౌడర్, ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటే చాలు అదే అందం. సహజంగా ఉండడం అందమే కానీ.. ఉన్న అందాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమే. ఎండలో తిరిగే సమయంలో, జర్నీ చేస్తున్న సమయంలో జుట్టును, ముఖాన్ని డస్ట్ నుంచి కాపాడుకునేందుకు స్కార్ప్ అయినా కట్టుకోవాలి. కనీసం ఇంట్లో దొరికే పదార్థాలతో ఫేస్ ప్యాక్‌లు చేసుకోవాలి. క్రమం తప్పకుండా నీరు తాగాలి. స్కిన్ కేర్ రోటీన్ని ఫాలో అయినా కాకున్నా.. కనీసం సహజంగా దొరికే కలబంద, పసుపు, శనగపిండి, పాలు, పెరుగు, టమాటాలు వంటి వాటిని స్కిన్ కేర్ కోసం ఉపయోగించవచ్చు. వీటిని కేవలం ముఖానికే కాదు.. మొత్తం శరీరానికి ఉపయోగించవచ్చు.
హెల్తీ ఫుడ్..
ఇంట్లో వారు అందరూ తినగ మిగిలింది.. లేదంటే నిన్న, మొన్న మిగిలిపోయిన ఫుడ్స్ పాడేకుండా తినే అమ్మలు ఇంకా మన దేశంలో ఉన్నారు. పిల్లలు వద్దని ఎంత వారించినా.. మీకేమి తెలుసురా అంటూ వాటిని లాగించేస్తారు. అలా కాకుండా మీరు కూడా హెల్తీ ఫుడ్ తీసుకోవాలని గుర్తించండి. అప్పుడే మీరు మరింత స్ట్రాంగ్‌గా ఉంటారు. ఫుడ్ అనేది శారీరక, మానసిక, భావేద్వేగాలపై బాగా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మహిళలు రక్తహీనత, విటమిన్స్ లోపాలు, ఐరస్ సమస్యలతో ఇబ్బంది పడతారు. అలాంటి వారు కచ్చితంగా సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా మీరు మానసికంగా కూడా స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తాయి.
సప్లిమెంట్స్..
సరైన ఆహారం తీసుకోకపోవడం కుదరకపోతే.. వైద్యుని సూచనలమేరకు సప్లిమెంట్స్ అయినా ఉపయోగించాలి. ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, పోషకాలు కచ్చితంగా అవసరం. కాబట్టి మీ శరీరం బాగా పనిచేయడానికి సప్లిమెంట్స్ తీసుకోండి. లేదంటే చిన్నవయసులోనే అన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుమడతాయి. ఇవి ఆయుర్వేదంలో కూడా మీకు దొరుకుతాయి. ఇవి మీరు త్వరగా వృద్ధాప్యదశకు చేరుకోకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా ముఖంలో కూడా వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి. కాల్షియం సమస్యలు వస్తాయి. కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ. లైంగిక సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. హార్మోన్ల సమస్యలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు వైద్యుల సూచనల మేరకు రెగ్యూలర్‌గా సప్లిమెంట్స్ తీసుకుంటే మంచిది.
ఫిట్‌నెస్
రోజంతా పని చేస్తున్నాము.. ఇంట్లో పనులు చేస్తున్నాము కదా.. అదే ఫిట్‌నెస్ అనుకునే మహిళలు కోకొల్లలు. కానీ సరైన ఫిట్‌నెస్ రొటీన్ లేకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది అసాధ్యం. మీరు జిమ్‌కి వెళ్లకపోయినా పర్లేదు కానీ.. దగ్గర్లోని పార్క్‌కి వెళ్లి కాసేపు నడవండి. తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. యోగా చేస్తే శారీరకంగా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో చేసే పనులు కాకుండా.. మీ ఆరోగ్యం కోసం ఇప్పటి నుంచైనా కాస్త వాకింగ్, సైక్లింగ్, కనీసం పిల్లలతో కలిసి అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇది మీ ఆరోగ్యంలో అద్భుతాలు చేస్తుంది. ఇవన్నీ ఫాలో అయ్యి.. ప్రతి మహిళా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ.. Happy Womens Day.
Also Read : నీతా అంబానీ ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవే.. రోజూ ఉదయాన్నే అది కచ్చితంగా తాగుతారట