Sadhguru Brain Surgery : బ్రెయిన్ బ్లీడింగ్ అంటే ఏమిటీ? శివరాత్రికి యాక్టివ్‌గా ఉన్న సద్గురుకు సడన్‌గా సర్జరీ ఎందుకు చేశారు?
Brain Bleed Surgery : ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు బ్రెయిన్ బ్లీడ్తో ఇబ్బంది పడుతూ.. శస్త్రచికిత్స చేయించుకున్నారు. అసలు ఇది ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి?
Brain Hemorrhage Treatment : ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్(Sadhguru Jaggi Vasudev).. బ్రెయిన్ బ్లీడ్ (Brain Surgery for Sadhguru) కారణంగా ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయన పరిస్థితిని గుర్తించిన వైద్యులు మెదడు ఎమెర్జెన్సీ సర్జరీ చేశారు. వైద్య నిపుణుల బృందం.. బ్రెయిన్లోని బ్లీడ్ను కంట్రోల్ చేసి ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ప్రస్తుతం సద్గురు పురోగతిని సాధిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయనను వెంటిలేటర్‌ను నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. అయితే శివరాత్రి సమయంలో చాలా యాక్టివ్‌గా ఉన్న సద్గురు సడెన్‌గా బ్రెయిన్ బ్లీడ్తో ఎలా ఇబ్బంది పడ్డారు? అసలు బ్రెయిన్ బ్లీడ్ అంటే ఏమిటి వంటి? దాని లక్షణాలు ఎలా గుర్తించాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాణాంతకమైన సమస్య ఇది..
బ్రెయిన్ బ్లీడ్.. దీనిలో బ్రెయిన్ హెమరేజ్ అంటారు. మెదడులో జరిగే రక్తస్రావాన్ని.. ఇంట్రాక్రానియల్ హెమరేజ్ లేదా బ్రెయిన్ బ్లీడ్ అంటారు. మెదడులోని కణజాలం.. స్కల్(పుర్రె)మధ్య లేదా మెదడు కణాజాలంలోనే రక్తస్రావం జరుగుతుంది. దీనివ్లల మెదడుకు ఆక్సిజన్ అందదు. ఇది ప్రాణాంతకమైనది. ఆలస్యం చేస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఎమెర్జెన్సీ శ్రస్తచికిత్సను చేస్తారు. నివేదికల ప్రకారం సద్గురు గత నాలుగు వారాలుగా తలనొప్పితో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు.
బ్రెయిన్ హెమరేజ్ అంటే..
ఆక్సిజన్, పోషకాలను అందించడానికి మెదడు రక్తనాళాలపై ఆధారపడి పని చేస్తుంది. ఈ క్రమంలో మెదడులో రక్తస్రావం జరిగితే.. అది మెదడుకు ఆక్సిజన్‌ను నిలిపివేస్తుంది. అంతేకాకుండా పుర్రె, మెదడు మధ్యప్రాంతంలోకి రక్తాన్ని లీక్ చేస్తుంది. దీనివల్ల స్కల్లో బ్లెడ్ పేరుకుపోతుంది. ఇది తీవ్రమైన ఒత్తిడిని, నొప్పిని కలిగించి.. ఆక్సిజన్‌ను మెదడు కణజాలలకు అందకుండా నిరోధిస్తుంది. దీనినే స్ట్రోక్‌గా చెప్తారు. దీనివల్ల అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు.. మెదడు రక్తస్రావానికి గురయ్యే ప్రమాదం ఉంది.
బ్రెయిన్ బ్లీడ్ రెండు రకాలు.. అవేంటంటే..
ఈ సమస్యను అధిగమించాలంటే.. పరిస్థితి కాస్త ఇబ్బంది పెడుతున్నప్పుడు వెంటనే వైద్యుల దగ్గరకు వెళ్లాలి. త్వరితగతిన చికిత్స చేస్తే ప్రాణాలు నిలుస్తాయి. ఆ సమయంలో అధిక రక్తపోటు ఉంటే.. ఈ శస్త్రచికిత్స చేయడం చాలా కష్టతరం అవుతుంది. మెదడులోని రక్తస్రావం పరిస్థితిని విషమంగా చేసేస్తుంది. ఎందుకంటే మెదడు కణాలు తగినంత ఆక్సిజన్ లేకుంటే.. కొన్ని నిమిషాల్లో చనిపోతాయి. ఈ బ్రెయిన్ బ్లీడ్లో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి.
పుర్రె లోపల లేదంటే మెదడు కణజాలం వెలుపల..
ఈ బ్రెయిన్ బ్లీడ్ రకంలో ఎపిడ్యూరల్ బ్లీడ్, సబ్ డ్యూరల్ బ్లీడ్, సబ్రాక్నోయిడ్ బ్లీడ్ అనే రకాలు ఉంటాలు. ఈ మూడు రకాల్లో పుర్రె లోపల.. మెదడు కణజాలం వెలుపల బ్లీడ్ జరుగుతుంది.
మెదడు కణాజలం లోపల..
దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్, ఇంట్రావెంట్రిక్యులర్ హెమరేజ్. మొదటి దానిలో లోబ్స్, బ్రెయిన్ స్టెమ్, సెరెబెల్లమ్తో సహా మెదడులోని వివిధ భాగాలలో రక్తస్రావం జరుగుతుంది. మరో రకంలో రక్తస్రావం మెదడు జఠరికలలో సంభవిస్తుంది.
బ్రెయిన్ హెమరేజ్ లక్షణాలు ఇవే.. (Brain Bleed Causes)
తీవ్రమైన, దీర్ఘకాలిక తలనొప్పి ఉంటుంది. సడెన్‌గా జలదరింపు రావడం వీక్‌గా అయిపోతారు. శరీరంలో ఓ వైపు ముఖ్యంగా ముఖం, చేయి, కాలులో తిమ్మిరి లేదా పక్షవాతం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కళ్లు తిరగడం వల్ల వికారం, వాంతుల లక్షణాలు ఉంటాయి. మాటలు సరిగ్గా మాట్లాడలేకపోవడం, తీవ్రమైన అలసట, తినడంలో ఇబ్బందులు, కంటి చూపు మందగింతజం, లైట్లను తట్టుకోలేకపోవడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులో.. హార్ట్ బీట్‌లో మార్పులు, సృహకోల్పోవడం వంటి దీనిలో భాగమే.
బ్రెయిన్ హెమరేజ్‌కు చికిత్స (Brain Bleed Treatment)
ఈ లక్షణాలు ఏది కనిపించినా.. వీలైనంత త్వరగా వైద్యులి దగ్గరకు వెళ్లాలి. వారి సలహాలు తీసుకుంటే పరిస్థితి విషమించదు. సర్జరీ, మందులు, వెంటిలేటర్ ఆక్సిజన్ థెరపీ, ఇంట్రావీనస్ ద్రవాలు, ఫీడింగ్ ట్యూబ్ ద్వారా పోషకాలు అందిస్తూ.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి పర్యవేక్షిస్తూ చికిత్సను అందిస్తారు. దీనివల్ల ప్రాణాలు నిలుస్తాయి. పరిస్థితుల చక్కబడతాయి.
Also Read : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే.. గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం 91 శాతం ఎక్కువట