Republic Day 2023 Wishes: రిపబ్లిక్ డే రోజున స్నేహితులకు తెలుగులో ఇలా శుభాకాంక్షలు చెప్పండి
Republic Day 2023 Wishes: గణతంత్ర దినోవ్సతవం రోజున కచ్చితంగా శుభాకాంక్షలు చెప్పుకోవాల్సిందే.
Republic Day 2023 Wishes: జనవరి 26, 1950 ... భారతదేశం గణతంత్ర దేశంగా మారిన రోజు. ఆరోజునే భారత ప్రభుత్వ చట్టాలకు బదులు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1949లో భారత రాజ్యంగ సభలో రాజ్యాంగం ఆమోదం పొందింది. ఏరోజు అమల్లోకి తేవాలో బాగా ఆలోచించి పెద్దలు నిర్ణయించారు. 1930లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్‌గా జనవరి 26న ప్రకటించుకుంది. ఆ తేదీనే రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు ఎన్నుకున్నారు. అలా మనదేశ మూడు జాతీయ సెలవుల్లో ఇది కూడా ఒకటిగా మారింది. గాంధీ జయంతి, భారత స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే... ఈ మూడు మన దేశ జాతీయ సెలవులు. ఈ గణతంత్ర దినోత్సవానికి మీ స్నేహితులుకు, బంధువులకు తెలుగులోనే శుభాకాంక్షలు పంపండి.
1. జాతులు వేరైనా, మతాలు వేరైనా
భాషలు వేరైనా... మనమంతా ఒక్కటే.
హ్యాపీ రిపబ్లిక్ డే.
2. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా...
మన సమరయోధులను స్మరించుకుందాం
మన వారసత్వాన్ని కాపాడుకుందాం
మనదేశాన్ని చూసి గర్వపడదాం
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
3. అపార త్యాగాల ఫలితంగా సిద్ధించిన
స్వాతంత్య్రాన్ని పరిపూర్ణం చేసి,
జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తోంది భారత రాజ్యాంగం.
ఆ రాజ్యాంగం అమల్లోకి రోజే గణతంత్ర దినోత్సవం.
హ్యాపీ రిపబ్లిక్ డే.
4. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన
గణతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని
ప్రతి ఒక్కరు రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా,
ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా
నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ... హ్యాపీ రిపబ్లిక్ డే
5. భారతదేశం పూర్తి ప్రజా ప్రభుత్వంగా
రూపుదిద్దుకున్న చారిత్రాత్మక శుభవేళ
మీకు, మీ కుటుంబసభ్యులకు
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
6. సమరయోధుల పోరాట బలం...
అమర వీరుల త్యాగఫలం..
బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం...
మన గణతంత్ర దినోత్సవం...
సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని
భరతజాతి సంపూర్ణ స్వేఛ్ఛను పొందిన దినం
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
7. ఈ ప్రత్యేకమైన రోజున,
మన స్వరాజ్యకర్తలు మనకందించిన స్వేచ్ఛను,
విలువలను సంరక్షిస్తామని,
భావితరాల శ్రేయస్సుకు తోడ్పడుతామని
మనదేశ సాక్షిగా వాగ్ధానం చేద్దాం.
హ్యాపీ రిపబ్లిక్ డే 2023
8. మీ స్వేచ్ఛను ఆస్వాదించండి
మన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన
అమర త్యాగాలను గౌరవించండి
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
9. ఇంత గొప్ప చరిత్ర, వారసత్వం ఉన్న దేశంలో
మనం జన్మించినందుకు గర్వపడదాం
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
10. భిన్నత్వంలో ఏకత్వమే మన విధానం...
అదే మన భారతదేశ ఔన్నత్యం
మీకు మీ కుటుంబసభ్యులకు
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
11. మన స్వేచ్ఛా స్వాతంత్ర్యం కోసం
అశువులు బాసిన సమరయోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
12. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు..
మనకు సంపూర్న స్వాతంత్ర్యం వచ్చిన రోజు..
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
13. ఒక దేశం...
ఒక జెండా...
ఒకటే గుర్తింపు...
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు
రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
14. భరతమాత కోసం
తమ ధన, మాన, ప్రాణాలను
త్యాగం చేసిన మహానుభావులెందరో...
అందరికీ ఇవే మా వందనాలు
మీకు మీ కుటుంబసభ్యులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
15. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా
పొగడరా... నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
హ్యాపీ రిపబ్లిక్ డే
16. ఎందరో వీరుల త్యాగఫలం
మన నేటి స్వేచ్ఛకే మూలబలం
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
17. భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటితరం...
భారతీయతలను బలంగా మార్చుకోవాల్సింది నేటితరం
హ్యాపీ రిపబ్లిక్ డే