News
News
X

Bhagat Singh Birth Anniversary: స్వాతంత్య్ర సంగ్రామంలో ఉవ్వెత్తున ఎగిసిన అగ్నిగోళం భగత్ సింగ్.. ఆయన స్ఫూర్తి సూక్తులు మీకోసం!

23 ఏళ్ళ వయసులోనే ఉరిశిక్ష పడుతుందని తెలిసినా.. దేశం కోసం ఉరితాడును ముద్దాడిన త్యాగశీలి భగత్ సింగ్. ఇవాళ ఆ మహనీయుడి జన్మదినం. ఈ సందర్భంగా ఆయనకు ఘనమైన జోహార్లు అర్పిస్తున్నది ఏబీపీ దేశం.

FOLLOW US: 

భగత్ సింగ్.. పరాయి పాలన నుంచి భరతమాత దాస్యపు సంకెళ్లు తెచ్చేందుకు ప్రాణాలను అర్పించిన వీర యోధుడు. నా జీవితం దేశానికే అంకితం అంటూ ఉరితాడును ముద్దాడిన ధీశాలి. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన అనితర సాధ్యమైన పోరాట పటిమ చూస్తే.. భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. ఆయన ఆలోచనలు, ఆశయాలు, ఆవేశం లక్షలాది మంది యువతకు స్పూర్తిదాయకం. భరతమాత విముక్తి పోరాటంలో ఆయన చేసిన సాహసం అనన్యసామాన్యం. 23 ఏండ్లకే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు భగత్ సింగ్.

1907 సెప్టెంబర్ 28 జన్మించాడు భగత్ సింగ్. అప్పటికే ఆయన కుటుంబం స్వాతంత్య్ర పోరాటంలో ఉన్నది. కుటుంబ సభ్యుల అడుగుజాడలో నడిచిన ఆయన..  దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిషర్లపై తిరుగుబాటు చేశాడు. 23 సంవత్సరాల వయసులోనే ఉరితీయబడ్డాడు. 1931, మార్చి 23న రాత్రి 7.30 గంటలకి భగత్ సింగ్‌తో పాటు సహచర విప్లవకారులు సుఖ్ దేవ్, రాజ్ గురులను హుస్సైన్‌వాలా జైల్లో బ్రిటీష్ పాలకులు ఉరి తీశారు. ఉరి కంబం ఎదురుగా కనిపిస్తున్నా.. వారు అధైర్య పడలేదు. చిరునవ్వుతోనే మృత్యువును కౌగిలించుకుని.. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. అందుకే ఆ రోజును ‘షహీదీ దివాస్‌’గా జరుపుకుంటారు. భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురు ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకుంటారు.

ఇవాళ  భగత్ సింగ్ జన్మదినం. ఆయన జయంతి సందర్భంగా ఘనమైన నివాళులర్పిద్దాం. ఇప్పటి యువత, రాజకీయ నాయకులు భగత్ సింగ్ ని కచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి. ఈ నేపథ్యంలో భగత్ సింగ్ చెప్పిన కొన్ని స్ఫూర్తిదాయక సూక్తులను అందిస్తున్నాం. వీటిని మీ సోషల్ మీడియాలో పోస్టు చేసుకోండి.

‘‘విప్లవం కలహాలతో కలవలేదు. బాంబులు, తుపాకులు విప్లవం చేయలేవు. విప్లవం అనే కత్తికి మీ ఆలోచనలతో పదును పెట్టండి’’
- భగత్ సింగ్

News Reels

 ‘‘నేను ఒక మనిషిని, మానవాళిని ప్రభావితం చేసేవన్నీ నాకు సంబంధించనవే’’
- భగత్ సింగ్

‘‘కనికరం లేని విమర్శలు, స్వతంత్ర ఆలోచనలు.. విప్లవానికి అవసరమైన రెండు విశిష్ట లక్షణాలు’’

- భగత్ సింగ్

‘‘మనుషులను చంపగలరేమో.. కానీ వారి ఆదర్శాలను చంపలేరు’’
- భగత్ సింగ్

‘‘జీవితాన్ని ప్రేమిస్తాం.. మరణాన్ని ప్రేమిస్తాం.. మేం మరణించి..
ఎర్రపూల వనంంలో పూలై పూస్తాం..
ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం..
నిప్పురవ్వల మీద నిదురిస్తాం’’
- భగత్ సింగ్

‘‘దేశం కోసం చనిపోయేవారు..
ఎల్లకాలం బతికే ఉంటారు’’
- భగత్ సింగ్

‘‘తిరుగుబాటు అనేది ఒక విప్లవం కాదు. అది చివరికి ముగింపునకు దారి తీయవచ్చు.’’
- భగత్ సింగ్

‘‘ప్రేమ ఎల్లప్పుడూ మనిషి పాత్రను ఉద్దరిస్తుంది. ఇది అతన్ని ఎప్పటికీ తగ్గించదు. ప్రేమ ఎప్పుడూ ప్రేమగానే ఉంటుంది‘‘.
- భగత్ సింగ్

‘‘వారు నన్ను చంపవచ్చు. కానీ వారు నా ఆలోచనలను చంపలేరు. వారు నా శరీరాన్ని దహించగలరు. నా ఆత్మను దహించలేరు’’
- భగత్ సింగ్

‘‘చెవిటి వారికి వినబడాలంటే శబ్దం చాలా బిగ్గరగా ఉండాలి’’
- భగత్ సింగ్

‘‘ప్రేమికులు, వెర్రివాళ్లు, కవులు ఒకే ముడిసరుకుతో తయారవుతారు’’
- భగత్ సింగ్

Published at : 28 Sep 2022 10:23 AM (IST) Tags: bhagat singh birthday Shaheed Bhagat Singh Bhagat Singh Birth Anniversary

సంబంధిత కథనాలు

క్వీన్ ఎలిజబెత్ డెత్ మిస్టరీ - చివరి రోజుల్లో ఆమెకు నరకం చూపిన ఆ వ్యాధి ఇదే, ఈ లక్షణాలుంటే జాగ్రత్త

క్వీన్ ఎలిజబెత్ డెత్ మిస్టరీ - చివరి రోజుల్లో ఆమెకు నరకం చూపిన ఆ వ్యాధి ఇదే, ఈ లక్షణాలుంటే జాగ్రత్త

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

నిద్ర రావడం లేదా? ఇలా చేసి చూడండి

నిద్ర రావడం లేదా? ఇలా చేసి చూడండి

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయ ఇదే, కిలో కొనాలంటే ఎంత ఖర్చుపెట్టాలంటే

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయ ఇదే, కిలో కొనాలంటే ఎంత ఖర్చుపెట్టాలంటే

Bruce Lee 1 Inch Punch: బ్రూస్ లీ వన్ ఇంచ్ పంచ్ కు ప్రపంచం ఫిదా, ఈ పంచ్ ప్రత్యేకత ఏంటి? ఎందుకు వరల్డ్ ఫేమస్ అయ్యింది? దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే?

Bruce Lee 1 Inch Punch: బ్రూస్ లీ వన్ ఇంచ్ పంచ్ కు ప్రపంచం ఫిదా, ఈ పంచ్ ప్రత్యేకత ఏంటి? ఎందుకు వరల్డ్ ఫేమస్ అయ్యింది? దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే?

టాప్ స్టోరీస్

ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి- త్వరలో సీఎంఓ లోకి శ్రీలక్ష్మీ

ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి- త్వరలో  సీఎంఓ లోకి శ్రీలక్ష్మీ

హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్‌- పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని రిక్వస్ట్

హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్‌- పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని రిక్వస్ట్

మంత్రి అప్పలరాజుకు అసమ్మతి సెగ, అతడిని ఓడించాలంటూ వైసీపీ నేతల ప్రచారాలు!

మంత్రి అప్పలరాజుకు అసమ్మతి సెగ, అతడిని ఓడించాలంటూ వైసీపీ నేతల ప్రచారాలు!

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్