(Source: Poll of Polls)
Sweet Potato Smoothie : చలికాలంలో చిలగడదుంపల స్మూతీ.. సింపుల్, టెస్టీ రెసిపీ ఇదే
Smoothie Recipes with Sweet Potato : చిలగడ దుంపలతో స్మూతీ. ఎప్పుడూ వినలేదా? అయితే మీరు మెరుగైన ఆరోగ్యప్రయోజనాల కోసం దీనిని మీరు కచ్చితంగా ట్రై చేయాల్సిందే.
Sweet Potato Smoothie Recipe : చలికాలంలో చిలగడదుంపలు విరివిగా దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. అందుకే వీటిని ఎక్కువగా తీసుకుంటారు. అయితే వాటిని ఎప్పుడూ ఉడకబెట్టి, కాల్చి తీసుకుంటాం. అయితే దీనిని మీరు తినాలని అనుకోవట్లేదా? అయితే ఉడకబెట్టిన చిలగడదుంపల (Boiled Sweet Potatos)తో ఓ హెల్తీ స్మూతీ(Winter Smoothies) తయారు చేసుకోవచ్చు. ఇది మీ ఆరోగ్యానికి మంచి చేయడమే కాకుండా.. శీతాకాలంలో మీకు అనేక ప్రయోజనాలు అందిస్తుంది. మరి ఈ స్మూతీ ఎలా తయారు చేయాలి? కావల్సిన పదార్థాలు ఏమిటి? దీనిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
చిలగడదుంప - 1 (ఉడికించినది)
పాలు - 1 కప్పు
ఖర్జూరాలు - 2
అల్లం పొడి - 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్కపొడి - పావు టీస్పూన్
ఐస్ క్యూబ్స్ - 3
తయారీ విధానం
ముందుగా ఉడికించిన చిలగడదుంప పొట్టు తీసేయండి. దీనిని బ్లెండర్లో వేసి.. పాలు, ఖర్జూరం, అల్లం, దాల్చిన చెక్క పొడిని వేసి బాగా కలపాలి. అది స్మూత్ మాదిరిగా వచ్చేవరకు బ్లెండ్ చేస్తూనే ఉండాలి. అంతే చిలగడదుంప స్మూతీ రెడీ. దీనిని మీకు నచ్చిన నట్స్, క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చు. పెద్దల నుంచి పిల్లల వరకు ఈ స్మూతీ నచ్చుతుంది. సహజంగా చిలగడదుంపకుండే టేస్టే.. పిల్లలను బాగా ఆకర్షిస్తుంది.
చిలగడదుంపలతో చేసే ఈ స్మూతీ మీకు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు చేకూరుస్తుంది. ఎందుకంటే.. స్వీట్ పొటాటోలు ఎన్నో పోషకవిలువలతో నిండి ఉన్నాయి. దీనిలోని ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మీకు హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో ఉన్నాయి. ఇవి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
పైగా చలికాలంలో ఈ స్మూతీ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే శీతాకాలంలో ఇమ్యూనిటీ త్వరగా తగ్గిపోతుంది. దీనివల్ల సీజనల్ వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. ఈ స్మూతీ మీకు ఇమ్యూనిటీనిస్తుంది. తద్వారా సీజనల్ వ్యాధులు దరిచేరకుండా చేస్తుంది. చలికాలంలో శరీరం కాస్త బద్ధకంగా ఉంటుంది. అయితే ఈ స్మూతీ మీ మెదుడును చురుగ్గా చేస్తుంది. తద్వార మీరు యాక్టివ్గా ఉంటారు.
ఎలాంటి హెల్తీ రోటీన్ ఫాలో అవ్వని వారు కూడా ఈ స్మూతీని తమ రోటీన్లో చేర్చుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు కూడా దీనిని తమ డైట్లో చేర్చుకోవచ్చు. దీనిలోని ఫైబర్ బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాల నుంచి, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా మీకు విముక్తినిస్తుంది. దీనిలో ఉపయోగించే అల్లం కూడా మీకు పలు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కాబట్టి ఈ స్మూతీ మీ మొత్తం ఆరోగ్యానికి మంచిది.
Also Read : చలికాలంలో స్ప్రౌట్స్ను ఇలా తీసుకుంటే ఇంకా మంచిది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.