Chicken Soup Recipe : చలికాలంలో జలుబు, దగ్గును దూరం చేసే చికెన్ సూప్.. ఇంట్లో చేసుకోగలిగే రెసిపీ ఇదే
Winetr Special Soup : వింటర్లో చలిని, జర్వాన్ని దూరం చేసుకోవాలనుకుంటే.. వేడి వేడి చికెన్ సూప్‌ని ట్రై చేయవచ్చు. దీనిని ఇంట్లో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
Winter Special Chicken Soup : చలికాలంలో టేస్టీగా, వేడిగా ఏమైనా తినాలని ఉంటుంది. అది సూప్ రూపంలో నోటికి రుచిగా ఉంటే దానికి మించిన ఫుడ్ ఏమి కావాలి. అలాంటి వాటిలో చికెన్ సూప్ ఒకటి. చలికాలంలో వచ్చే ఫ్లూ లక్షణాలను, చలిని దూరం చేసి.. రిలీఫ్‌ని, వెచ్చదనాన్ని ఇస్తుంది. మరి ఈ చికెన్ సూప్‌ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు? కావాల్సిన పదార్థాలు ఏమిటి? హెల్తీగా ఉండడంలో ఇది ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
చికెన్ - 250 గ్రాములు (బోన్ లెస్)
ఉల్లిపాయ - 1
వెల్లుల్లి రెబ్బ - 3
నిమ్మకాయ - సగం
కొత్తిమీర - కట్ట
బిర్యానీ ఆకులు - 2
లవంగాలు - 4
ఉప్పు - రుచికి తగినంత
మిరియాల పొడి - చిటికెడు
మొక్కజొన్న - అర కప్పు
క్యారెట్ - 1
క్యాప్సికమ్ - 1
గుడ్లు - 2
స్ప్రింగ్ ఆనియన్ - 1
కార్న్ పౌడర్ -1 టీస్పూన్
తయారీ విధానం
ముందుగా ఉల్లిపాయ పై తొక్క తీసి.. దానికి లవంగాలు గుచ్చాలి. ఇప్పుడు ఓ గిన్నెలో నీళ్లు వేసి.. దానిలో బోన్ లెస్ చికెన్, ఈ ఉల్లిపాయ వేయాలి. దానిలోనే వెల్లుల్లి రెబ్బలు, నిమ్మబద్ద, బిర్యానీ ఆకులు, కొత్తిమీరు, ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిని మరగనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత స్టౌవ్ ఆపేయాలి.
ఉడికిన చికెన్‌ను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరిగించిన నీటిని వడకట్టుకుంటూ మరో గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన స్టార్చ్‌ని పక్కకి పెట్టుకుని.. ఉడికిన ఉల్లిపాయను అదే గిన్నెలో స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలోకి చికెన్ స్టార్చ్‌ను వేసి.. దానిలో మొక్కజొన్న గింజలు వేసుకోవాలి. కొత్తిమీర తురుమును కూడా వేసి, క్యాప్సికమ్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బ్రాత్‌లో వేసుకోవాలి.
ఇప్పుడు స్మాష్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను, చికెన్ ముక్కలను కూడా అదే గిన్నెలో వేసుకోవాలి. దానిపై మూత పెట్టి ఉడికించుకోవాలి. నీళ్లు బాగా ఉడికిన తర్వాత దానిలో గుడ్లు నేరుగా పగలగొట్టి వేయాలి. అనంతరం బాగా గిలక కొట్టాలి. ఇలా సూప్‌లో గుడ్డు కలిసిన తర్వాత సోయాసాస్ వేసుకోవాలి. వెనిగర్ కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు టీస్పూన్ కార్న్ పౌడర్‌ను నీళ్లు వేసి కలిపి.. దానిని ఈ సూప్‌లో వేసి బాగా కలపాలి. ఈ కార్న్ పొడి వేయడం వల్ల సూప్ చిక్కబడుతుంది. నీరుగా కాకుండా.. అసలైన సూప్ మాదిరిగా మారుతుంది.
ఇప్పుడు దానిలో స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. అలాగే బటర్ కూడా వేసుకోవాలి. మూతపెట్టి మరో రెండు నిమిషాలు కుక్ చేస్తే వేడి వేడి చికెన్ సూప్ రెడీ. ఇది వింటర్లో తీసుకుంటే జలుబు వంటి ఫ్లూ లక్షణాలు దూరమవుతాయి. పైగా హెల్తీ కూడా. చలిని దూరం చేసి.. వెచ్చదనాన్ని అందిస్తుంది. పైగా దీనిలోని చికెన్ శరీరానికి మంచి ప్రోటీన్‌ను అందిస్తుంది. ప్రోటీన్‌ను కండరాల బలానికి, బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ టేస్టీ, హెల్తీ సూప్‌ని తయారు చేసి లాగించేయండి. దీనిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టంగా తింటారు.
Also Read : చలికాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు రోగనిరోధక శక్తిని పెంచే సూప్.. సింపుల్ రెసిపీ, మరెన్నో హెల్త్ బెనిఫిట్స్