అన్వేషించండి

Rava Pulihora Recipe : రవ్వ పులిహోర.. శ్రావణమాసంలో చేసుకోగలిగే టేస్టీ, సింపుల్ రెసిపీ ఇదే 

Sravana Masam Recipes : శ్రావణమాసంలో ప్రతిరోజుకి ఓ ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఈ నెలను చాలామంది ఇష్టపడతారు. ఈ సమయంలో చేసుకోగలిగే టేస్టీ రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Rava Pulihora for Sravana Masam : పులిహోరను ప్రసాదంగా చేస్తూ ఉంటాము. చాలామంది దానినిని ఇష్టంగా తీసుకుంటారు. అయితే మీరు ఎప్పుడైనా రవ్వ పులిహోరను తిన్నారా? శ్రావణమాసంలో చేసుకోగలిగే అత్యంత రుచికరమైన రెసిపీల్లో ఈ పులిహోర కూడా ఒకటి. దీనిని తయారు చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది కానీ.. టేస్టీ రెసిపీ కోసం ఆ మాత్రం కష్టపడొచ్చు. మరి ఇంతకీ ఈ టేస్టీ రవ్వ పులిహోరను ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు చూద్దాం. 

కావాల్సిన పదార్థాలు 

బియ్యం రవ్వ - 1 కప్పు

నీళ్లు - రెండు కప్పులు

పసుపు - పావు టీస్పూన్

ఉప్పు - రుచికి తగినంత 

నూనె - రెండు టేబుల్ స్పూన్లు

తాళింపు కోసం

నూనె - 5 టేబుల్ స్పూన్లు

ఆవాలు - పావు టీస్పూన్

మిరియాలు - అర టీస్పూన్

శనగపప్పు - టీస్పూన్

మినపప్పు - టీస్పూన్

జీడిపప్పు - 3 టేబుల్ స్పూన్స్

ఎండు మిర్చి - 2

జీలకర్ర - అర టీస్పూన్

అల్లం తురుము -1 టీస్పూన్

పచ్చిమిర్చి - 2

కరివేపాకు - రెండు రెబ్బలు 

ఇంగువ - చిటికెడు

నిమ్మరసం - 1.5 టీస్పూన్స్

తయారీ విధానం

ముందుగా పచ్చిమిర్చి, అల్లాన్ని కావాల్సిన విధంగా కట్ చేసుకోవాలి. నిమ్మకాయల్లో గింజలు తీసేసి నిమ్మరసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. కరివేపాకు కడిగి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పదార్థాలన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కుక్కర్​ని పెట్టండి. దానిలో రెండు కప్పుల నీరు వేసి.. పసుపు, ఉప్పు, నూనె వేసి.. వేడిచేయాలి. నీరు బాగా కాగి మసులుతున్నప్పుడు దానిలో బియ్యం రవ్వను వేసుకుని మూతపెట్టాలి. బియ్యం రవ్వ ఉడుకుతుంది. 

కుక్కర్ మూడు విజిల్స్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దానిలో ఆవిరి పోయే వరకు అలాగే ఉంచాలి. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసి.. దానిలోని రవ్వను ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి. దీనిని ఓ గంట పక్కన పెట్టేయండి. ఇలా చేయడం వల్ల రవ్వ కాస్త పొడిపిడిలాడుతూ మంచిగా రెడీ అవుతుంది. గంట తర్వాత ఇప్పుడు స్టౌవ్ వెలిగించి తాళింపు కోసం గిన్నె పెట్టండి. 

ఈ తాళింపు గిన్నెలో నూనె వేయండి. అది వేడి అయ్యాక దానిలో ఆవాలు, మిరియాలు వేయాలి. అవి కాస్త చిట్లిన తర్వాత దానిలో జీలకర్ర, ఎండుమిర్చి, జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ రెడ్ కలర్​లో వచ్చేలా వేయించుకోవాలి. అప్పుడు దానిలో ఇంగువ, కరివేపాకు, అల్లం తురము, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఎండు మిర్చి నల్లగా మారితే.. అది పర్​ఫెక్ట్ తాళింపు అని అర్థం. 

ఇలా సిద్ధం చేసుకున్న తాళింపును.. ముందుగా ఉడికించి పెట్టుకున్న బియ్యం రవ్వలో వేయాలి. తాళింపు మొత్తం బియ్యం రవ్వను అంటుకునేలా బాగా కలపాలి. ఇప్పుడు దానిలో ఒకటిన్నర చెక్కల నిమ్మరసాన్ని వేసుకుని.. మరోసారి బాగా కలపాలి. అంతే టేస్టీ టేస్టీ రవ్వ పులిహోర రెడీ. దీనిని శ్రావణమాసంలో చాలామంది చేసుకుంటారు. శ్రావణ మాసంలో ఉల్లిపాయలు తిననివారికి ఇది మంచి టేస్టీ రెసిపీ అవుతుంది. 

Also Read : బ్రెడ్​ బూరెలు.. వినడానికి కొత్తగా ఉన్నా, తినడానికి టేస్టీగా ఉంటాయి.. సింపుల్ రెసిపీ ఇదే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
Embed widget