Homemade Ferrero Rocher : చిల్డ్రన్స్ డే స్పెషల్.. మీ పిల్లలకు చాక్లెట్స్ ఇష్టమా? ఇంట్లోనే ఫెర్రెరో రోచర్ చేసేయండిలా
మీ పిల్లలకు చాక్లెట్స్ ఇష్టమా? అయితే ఇంట్లోనే వారికి ఫెర్రెరో రోచర్ చేసి తినిపించేయండి.
Ferrero Rocher Recipe in Telugu : ఏ తల్లైనా.. తన పిల్లలకు ఇంట్లోనే.. స్వయంగా తన చేతులతో తయారు చేసిన ఫుడ్ మాత్రమే పెట్టాలనకుంటుంది. ఎందుకంటే బయట వాళ్లు ఎలా తయారు చేస్తారో.. అవి పిల్లలకు సెట్ అవుతాయో.. లేదంటే ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తాయని భయపడుతూ ఉంటుంది. అందుకే పిల్లలకోసం ప్రత్యేకమైన వంటకాలు నేర్చుకుని మరి వండుతూ ఉంటుంది. అమ్మవంటలకు పేరు పెట్టలేము కానీ.. పిల్లలకు నచ్చిన అన్ని ఫుడ్స్ అమ్మ చేయలేరు. ముఖ్యంగా చాక్లెట్స్.
పిల్లలకు చాక్లెట్స్ అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. కానీ పళ్లు పుచ్చుపోతాయని.. వివిధ కారణాలు చెప్పి పెద్దలు వాటిని పిల్లలకు ఇవ్వరు. అయితే ఇంట్లోనే మీరు పిల్లలకోసం ఫెర్రెరో రోచర్ చాక్లెట్ ( Ferrero Rocher Chocolate Recipe) తయారు చేయవచ్చు. పైగా రెసిపీ కూడా చాలా ఈజీ. రోజూ కాకాపోయినా.. స్పెషల్ డే రోజుల్లో పిల్లలకోసం మీరు దీనిని ట్రై చేయవచ్చు. ఇది వారికి ఆనందాన్ని ఇస్తుంది. మీకు తృప్తిని ఇస్తుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫెర్రెరో రోచర్ తయారీకి కావాల్సిన పదార్థాలు
హాజెల్ నట్స్ - 1 కప్పు
కోకో పౌడర్ - పావు కప్పు
బాదం పిండి - పావు కప్పు
తేనె - పావు కప్పు
వెనీలా ఎసెన్స్ - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - చిటికెడు
చాక్లెట్ చిప్స్ - కోటింగ్‌కు తగినంత
ఫెర్రెరో రోచర్ తయారీ విధానం
ముందుగా హాజెల్నట్స్ను రోస్ట్ చేయండి. బేకింగ్ ట్రేలో వాటిని సమానంగా పరిచి.. సుమారు 7 నుంచి 8 నిమిషాలు బేక్ చేయండి. అనంతరం వాటిని బయటకి తీసి.. పూర్తి చల్లార్చండి. అనంతరం మీ చేతులకు గ్లౌవ్ ధరించి.. ఈ హాజెల్నట్స్ను రబ్ చేయండి. పైనున్న పొట్టు పోతుంది.
ఇప్పుడు ఫిల్లింగ్‌కోసం.. ఒక గిన్నె తీసుకుని దానిలో కొన్ని రోస్ట్ చేసిన హాజెల్‌నట్స్ ముక్కలను, కోకో పౌడర్, వెనీలా ఎసెన్స్, బాదం పిండి, తేనె, ఉప్పు వేసి బాగాకలపండి. ఇది బాగా మిక్స్ అయి.. కాస్త తీగపాకం మాదిరిగా స్టిక్కీగా మారేవరకు కలుపుతూనే ఉండండి. ఇప్పుడు కొంచెం మిశ్రమాన్ని మీ చేతులోకి తీసుకోండి. మొత్తం హాజెల్‌నట్ ఈ మిశ్రమం మధ్యలో ఉండేలా చేసి.. దానిని ఓ బాల్ మాదిరిగా వత్తండి. ఇలాగే మిగిలిన బాల్స్ కూడా చేసి పక్కన పెట్టండి.
కోటింగ్ కోసం.. చాక్లెట్ చిప్స్‌ను మెల్ట్ చేయాలి. ముందుగా తయారు చేసుకున్న బాల్స్‌ను ఈ మెల్టెడ్ చాక్లెట్లో ముంచండి. బాల్స్‌కు అన్ని వైపులా కోట్ అయ్యేలా చూడండి. ఇప్పుడు ఈ బాల్స్‌ను ఓ ప్లేట్లో బటర్ పేపర్ వేసి ప్లేస్ చేయండి. దీనిని ఓ అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచేయండి. అంతే హోమ్మేడ్ ఫెర్రెరో రోచర్ రెడీ. ఇది పిల్లలతో పాటు.. పెద్దలు కూడా హాయిగా లాగించేయవచ్చు. పుట్టిన రోజు వేళల్లో లేదా ఇలా చిల్డ్రన్స్ డే వంటి సందర్భాల్లో మీరు మీ పిల్లలకు స్వయంగా ఈ రెసిపీ చేసి తినిపిస్తే పిల్లలకి హ్యాపీగా ఉంటుంది. మీకు తృప్తిగా ఉంటుంది.
Also Read : శీతాకాలంలో యాపిల్ తింటే మంచిదా? కాదా? ఆ సమయంలో మాత్రం..