An Apple A Day : శీతాకాలంలో యాపిల్ తింటే మంచిదా? కాదా? ఆ సమయంలో మాత్రం..
Health Benefits With Apple : రోజూ యాపిల్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఇది మనం వినేదే. అయితే దీనిని రోజూ తింటే ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా? వాస్తవం ఏమిటి?
Apple Is A Healthy Snack : మన డైట్లో కచ్చితంగా యాపిల్ ఉండాలని అంటారు ఆహార నిపుణులు. ఇంతకీ రోజూ యాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిదేనా అనే ప్రశ్న తలెత్తితే మాత్రం దానికి సమాధానం ఇక్కడుంది. అవును.. రోజూ యాపిల్ తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు డైటీషియన్స్. దీనిలోని పోషక విలువలు, ఫైబర్, విటమిన్లు సి, ఎ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయంటున్నారు. ఇంతకీ దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి? చలికాలంలో దీనిని తినొచ్చా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చలికాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి తగ్గుతూ ఉంటుంది. అయితే యాపిల్‌ను తినడం వల్ల దీనిని అధిగమించవచ్చు. దీనిలోని ఫైబర్ మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తక్కువ కేలరీలు కలిగిన ఈ ఫ్రూట్.. మిమ్మల్ని హైడ్రేటింగ్‌గా కూడా ఉంచుతుంది. అందుకే ఇది బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఎంపిక.
మన రోటీన్లో లైఫ్‌లో ఎలాగో మంచి ఆహారం తీసుకోవడం కష్టమే అవుతుంది. బిజీలైఫ్‌లో కావాల్సినవి వండుకోలేక.. నచ్చని ఆహారం తినలేని వారు చాలామందే ఉంటున్నారు. అయితే కనీసం ఇలాంటి హెల్తీ ఫుడ్‌ని మీ డైట్లో అయితే చేర్చుకోగలరు కదా. ఆరోగ్యానికి మేలు చేసే, రుచికరమైన ఫుడ్‌ని దూరం పెట్టడం ఎందుకు చెప్పండి. అసలు యాపిల్ చేసే అద్భుతాలు తెలిస్తే మీరు కచ్చితంగా మీ డైట్లో దానిని తీసుకుంటారు.
పోషకాలకు నిలయం
యాపిల్ పోషకాలకు పవర్‌హౌస్ అని చెప్పవచ్చు. దీనిలోని డైటరీ ఫైబర్ చేసే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు. పెక్టిన్ అనే కరిగే ఫైబర్ యాపిలో ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేలా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపు చేస్తుంది. దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తి (Winetr Immunity Booster)ని పెంచుతుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు..
యాపిల్‌లో క్వెర్సెటిన్‌తో సహా అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో సహాయం చేస్తాయి. హానీకరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, వయసు సంబంధిత వ్యాధులను ప్రమాదాన్ని ఇవి సమర్థవంతంగా తగ్గిస్తాయి.
బరువు తగ్గేందుకు..
బరువు తగ్గాలని ఏవేవో తినడం మానేస్తారు. దానితో పాటు.. దీనిని మీ డైట్లో చేర్చుకోండి. కేలరీలు తక్కువ మోతాదులో ఉండే ఈ ఫ్రూట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని కంట్రోల్ చేసి.. అతిగా తినడాన్ని నియంత్రిస్తుంది. కడుపు నిండుగా ఉండేలా చేసి.. మీకు క్రంచీ స్నాక్ ఫీలింగ్ ఇస్తుంది. ఇదో సమతుల్యమైన ఆరోగ్యకరమైన స్నాక్.
గుండె ఆరోగ్యానికై..
యాపిల్స్ గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. దీనిలోని ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పోటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా యాపిల్ తింటే.. మీ గుండె పదిలంగా ఉంటుంది.
డెంటల్ కేర్..
యాపిల్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ రోజువారీ హెడ్రేషన్ అవసరాలను తీరుస్తుంది. అలాగే మొత్తం ఆరోగ్యం కాపాడుకోవడంలో సహాయం చేస్తుంది. ఎందుకంటే శారీరక విధులకు హైడ్రేషన్ చాలా అవసరం. అంతేకాకుండా యాపిల్ తినడం వల్ల లాలాజల ఉత్పత్తి మెరుగవుతుంది. ఇది దంతాలను రక్షించడంలో సహాయం చేస్తుంది. పూర్తి నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది.
దీనిని మీరు జర్నీలో స్నాక్‌గా తీసుకోవచ్చు. దీనితోనే మీ రోజును ప్రారంభించవచ్చు. సలాడ్స్‌లో, వోట్మీల్లో కూడా కలిపి తీసుకోవచ్చు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అందించే ఈ ఫ్రూట్‌ని కచ్చితంగా మీ డైట్లో చేర్చుకోండి. రోజూ దీనిని తింటే ఫలితాలు మీకే కనిపిస్తాయి. అయితే రాత్రుళ్లు దీనిని తీసుకోకపోవడమే మంచిది. పగలు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. కానీ రాత్రులు యాపిల్ తినడం వల్ల జీర్ణక్రియ కాస్త మందగిస్తుంది.