News
News
X

Queen Elizabeth: 36 ఏళ్ల క్రితం రాసిన క్వీన్ ఎలిజబెత్ లేఖ, అందులో ఏముందో చదవాలంటే మరో 63 ఏళ్లు ఆగాలి

క్వీన్ ఎలిజబెత్ లేఖ ఒకటి గత 36 ఏళ్లు తెరకుండా అలానే ఉంది.

FOLLOW US: 

క్వీన్ ఎలిజబెత్ 2 మరణించాక ఆమెకు సంబంధించిన ఎన్నో విశేషాలు బయటకు వస్తున్నాయి. ఆమె 36  ఏళ్ల క్రితం రాసిన ఓ ఉత్తరం ఇప్పటికీ తెరవకుండా అలాగే ఉందట. దాన్ని తెరిచి చూడాలంటే మరొక 63 ఏళ్లు ఆగాల్సిందే. అందులో ఏం రాసిందో తెలియాంటే 2085 వరకు వేచియుండాలి. ఈ లేఖను క్వీన్ 1986 నవంబర్లో రాశారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగర ప్రజలను ఉద్దేశించి ఆమె ఆ లేఖను రాశారు. ఆ ఉత్తరాన్ని ఎవరూ తెరకుండా రహస్యంగా సిడ్నీలోని ఒక చోట దాచి ఉంచారు. ఆ ప్రదేశం అందిరకీ తెలియదు. కొంతమంది ప్రభుత్వ పెద్దలకు తప్ప. ఒక గాజుపెట్టలో ఆ ఉత్తరాన్ని పెట్టి, తాళం వేసి బంధించారు. 

లార్డ్ మేయర్ ఆఫ్ సిడ్నీని ఉద్దేశించి ఆ ఉత్తరంపై సూచన రాసి ఉంది. 2085 A.Dలో ఈ ఉత్తరాన్ని తగిన రోజున తెరిచి సిడ్నీ పౌరులకు చదివి వినిపించండి అని రాసి ఉంది. చివర్లో ఎలిజబెత్ .ఆర్ అని సంతకం చేసి ఉంది.  క్వీన్ ఎలిజబెత్ తన జీవిత కాలంలో 16 సార్లు ఆస్ట్రేలియాను సందర్శించారు. 

ఆస్ట్రేలియా దేశాధినేత క్వీన్
బ్రిటన్ రాణి అయినప్పటికీ ఆస్ట్రేలియా దేశాధినేతగా క్వీన్ ఎలిజబెత్ వ్యవహరిస్తోంది. 1999లో ఆస్ట్రేలియా దేశాధానేతగా రాణిని ఉంచాలా లేదా తొలగించాలా అనే దానిపై రిఫరెండం నిర్వహించింది. కానీ అది ఓడిపోయింది. క్వీన్ ఎలిజబెత్ దేశాధినేతగా కొనసాగాలనే అందులో ఓటేశారు. 

అన్ని చోట్ల రాచరికం మాయమైనప్పటికీ బ్రిటన్లో మాత్రం ఇంకా దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది. ప్రజాస్వామ్య యుగంలోనూ రాచరిక వ్యవస్థను బ్రిటన్ ప్రజలు స్వాగతిస్తున్నారు. క్వీన్ విక్టోరియా తరువాత బ్రిటన్ ను పాలించిన రాణిగా ఎలిజబెత్ 2 చరిత్ర సృష్టించారు. ఆమె దాదాపు 70 ఏళ్ల పాటూ మహారాణిగా ఉన్నారు. ఆమె రాచరికాన్ని, పాలను ప్రజలు స్వాగతించారు. బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 96 ఏళ్ల వయసులో అనారోగ్యంగతో మరణించారు. లండన్లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో ఎలిజబెత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కింగ్ జార్జ్ 4 మెమోరియల్ చాపెల్‌లో క్వీన్ ఎలిజబెత్ భర్త కింగ్ ఫిలిప్ సమాధి పక్కనే ఆమెను ఖననం చేయనున్నారు. 

మేగన్‌కు నో ఎంట్రీ...
ప్రిన్స్ హ్యారీ భార్య మేగన్‌కు క్వీన్స్ ను చివరి చూపు చూసే అవకాశం దక్కలేదు. అమెరికాలో సెటిల్ అయిన  ప్రిన్స్ హ్యారీ అనుకోకుండా బ్రిటన్ వచ్చాడు. అదే సమయంలో క్వీన్ మరణించారు. దీంతో హ్యారీ తండ్రి ప్రిన్స్ చార్లెస్ ఈ విషాద సమయంలో మేగన్ ఈ పరిసరాల్లో కనిపించకూడదు అని అన్నారు. ఊహించినట్టుగానే మేగన్‌కు అవకాశం దక్కలేదు. మేగన్ రాజకుటుంబంలో అడుగుపెట్టాకే కుటుంబ గొడవలు మొదలయ్యాయని అంటారు. వీరిద్దరూ ఓప్రా విన్‌ఫ్రే కార్యక్రమంలో రాజకుటుంబంలో జాత్యహంకార ధోరణి ఉందంటూ  బయటపెట్టారు.

Also read: మీరు పెళ్లికి సిద్ధమయ్యే ముందు మీ కాబోయే భార్యని లేదా భర్తని కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలు ఇవే

Also read: అలెగ్జాండర్ ది గ్రేట్ నుంచి క్వీన్ ఎలిజబెత్ వరకు ప్రపంచం మెచ్చిన పాలకులు ఇష్టంగా తాగే పానీయాలు ఇవే

Published at : 12 Sep 2022 03:12 PM (IST) Tags: Queen Elizabeth Queen Elizabeth's letter Queen Elizabeth's Death Queen Elizabeth last rites Queen Elizabeth secret letter

సంబంధిత కథనాలు

పెరుగు ఎప్పుడు, ఎలా తీసుకోవాలో తెలుసా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోందో చూడండి

పెరుగు ఎప్పుడు, ఎలా తీసుకోవాలో తెలుసా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోందో చూడండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Covid-19: ఒమిక్రాన్ వల్ల నిద్రలేమి సమస్య? భయపెడుతున్న కొత్త లక్షణం

Covid-19: ఒమిక్రాన్ వల్ల నిద్రలేమి సమస్య? భయపెడుతున్న కొత్త లక్షణం

ఈ రాశులవారిని అంతా ఇష్టపడతారు, ఇందులో మీ రాశి ఉందా?

ఈ రాశులవారిని అంతా ఇష్టపడతారు, ఇందులో మీ రాశి ఉందా?

Food Poisoning: ఈ ఐదు ఆహారాలు మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేస్తాయ్ జాగ్రత్త !

Food Poisoning: ఈ ఐదు ఆహారాలు మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేస్తాయ్ జాగ్రత్త !

టాప్ స్టోరీస్

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!