News
News
X

Queen Elizabeth: అలెగ్జాండర్ ది గ్రేట్ నుంచి క్వీన్ ఎలిజబెత్ వరకు ప్రపంచం మెచ్చిన పాలకులు ఇష్టంగా తాగే పానీయాలు ఇవే

ప్రపంచాన్నే పాలించిన వారు చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. వారు ఏం తాగుతారో తెలుసా?

FOLLOW US: 

చరిత్రలో ఎంతో మంది ప్రపంచ పాలకులు. వారంతా ఇప్పటికీ ప్రజల నాలుకల్లో నానుతూనే ఉన్నారు. క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తరువాత ఎన్నో అంశాలు తెరపైకి వచ్చాయి. ఆమె ఇష్టంగా తినే ఆహారం, పానీయాలు తెలుసుకునేందుకు చాలా ఉత్సాహం చూపించారు. అలాగే ప్రపంచాన్ని పాలించిన అలెగ్జాండర్ ది గ్రేట్, నెపోలియన్, క్వీన్ విక్టోరియా వంటి వారు ఇష్టంగా తాగే పానీయాలు ఇవన్నీ. 

ఎలిజబెత్ II (ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ)
ఆమెకు టీ అంటే చాలా ఇష్టం. కుకీలను తింటూ గ్రే టీ తాగడం ఆమె ఎంజాయ్ చేసేది. ఉదయాన లేచిన వెంటనే ఆమె చేసే పని గ్రే టీ తాగడమే. అసోం నుంచి దిగుమతి చేసుకున్న సిల్వర్ టిప్స్ ఇంపీరియల్ టీని ఆమె బాగా ఇష్టపడేవారు. చెఫ్ డారెన్ మెక్‌గ్రాడీ, 15 సంవత్సరాలుగా క్వీన్స్ వ్యక్తిగత వంటవాడిగా ఉండేవారు.  అతను రాసిన పుస్తకంలో ఎలిజబెత్ కు తేనీటిపై ఉన్న ఇష్టాన్ని ఆయన రాశారు. అలాగే ఆమె జిన్ ఆధారిత కాక్‌టెయిల్‌లను  కూడా ఇష్టంగా తాగుది. 

అలెగ్జాండర్ ది గ్రేట్ (355 BC-322 BC)
ప్రపంచాన్ని గెలిచిన అత్యంత శక్తివంతమైన నాయకుల్లో అలెగ్జాండర్ ది గ్రేట్. అతి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన నాయకుడు ఈయన. యోధులను వెంటపెట్టుకుని ఎన్నో రాజ్యాలను గెలిచాడు. 33 సంవత్సరాల వయసులోనే మరణించాడు. అతను ఇష్టంగా తాగేది వైన్. రోజూ తాగకుండా ఉండలేకపోయేవాడు.  అతని గెలుపులో కూడా వైన్ పాత్ర ఉందని నమ్మేవాడట. 

నెపోలియన్ బోనపార్టే
19వ శతాబ్దం ప్రారంభంలో ఐరోపాలో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకున్న వ్యక్తి నెపోలియన్ (1769-1821).  ఈయన ఫ్రెంచ్ సైనిక నాయకుడు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో కీర్తిని పొందిన చక్రవర్తి. చరిత్ర ప్రకారం అతనికి చాంబర్టిన్ ఇష్టమైన వైన్ అని నమ్ముతారు. అతను ఛాంబర్టిన్  వైన్ లేకుండా ఎక్కడికీ వెళ్లడు. మంచి ఆరోగ్యం కోసం దానిని త్రాగమని అతని వైద్యుడు ప్రోత్సహించినందున కూడా ఆ వైన్ ఇష్టపడ్డాని చెప్పుకుంటారు. 

రాజు టుటన్‌ఖామున్
కింగ్ టుట్ అని పిలుచుకునే  ఈజిప్టు రాజు టుటన్‌ఖామున్.  ఈజిప్టు రాజ్యానికి చివరి పాలకుడు ఈయనే. పరిశోధకుల ప్రకారం, కింగ్ టుట్ వైట్ వైన్, రెడ్ వైన్ రెండింటినీ ఇష్టపడేవాడని నమ్ముతారు. అందుకే అతను వైన్ నిండిన జాడీలతో సమాధి చేశారు. అతను వ్యక్తిగత వైన్ తయారీదారుని నియమించుకున్నాడని చరిత్రకారులు చెబుతుంటారు. 

క్వీన్ విక్టోరియా (1819-1901)
స్కాచ్ విస్కీ,  విస్కీతో చేసిన కలిసిన కాకటెల్స్ అంటే క్వీన్ విక్టోరియాకు చాలా ఇష్టమని చెబుతారు చరిత్రకారులు. క్వీన్ విక్టోరియా స్కాట్లాండ్‌లోని హైలాండ్స్‌లోని రాయల్ బాల్మోరల్ కాజిల్‌లో విస్కీ, కాక్‌టెయిల్ మిశ్రమాలను చాలా ఇష్టపడతారు. టీ, సోడా వాటర్‌తో విస్కీని కలిపి ఆమె తాగేదట. 

Also read: అతనికి పదిహేను మంది భార్యలు, వందమందికి పైగా పిల్లలు, వీడియో చూడండి

Published at : 12 Sep 2022 11:56 AM (IST) Tags: Queen Elizabeth Alexander the Great Favorite drinks World leaders

సంబంధిత కథనాలు

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Covid-19: ఒమిక్రాన్ వల్ల నిద్రలేమి సమస్య? భయపెడుతున్న కొత్త లక్షణం

Covid-19: ఒమిక్రాన్ వల్ల నిద్రలేమి సమస్య? భయపెడుతున్న కొత్త లక్షణం

ఈ రాశులవారిని అంతా ఇష్టపడతారు, ఇందులో మీ రాశి ఉందా?

ఈ రాశులవారిని అంతా ఇష్టపడతారు, ఇందులో మీ రాశి ఉందా?

Food Poisoning: ఈ ఐదు ఆహారాలు మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేస్తాయ్ జాగ్రత్త !

Food Poisoning: ఈ ఐదు ఆహారాలు మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేస్తాయ్ జాగ్రత్త !

Diabetes: ఒంటరితనం డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచేస్తుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

Diabetes: ఒంటరితనం డయాబెటిస్  వచ్చే అవకాశాన్ని పెంచేస్తుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

టాప్ స్టోరీస్

KCR Plan : కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేది తెలంగాణలో మూడో సారి గెలవడానికే. - అంచనాలకు అందని కేసీఆర్ వ్యూహం ఇదే !

KCR Plan : కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేది తెలంగాణలో మూడో సారి గెలవడానికే.  -  అంచనాలకు అందని కేసీఆర్ వ్యూహం ఇదే !

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి