అన్వేషించండి

Eye Infections Monsoons : వర్షాకాలంలో కంటి ఇన్ఫెక్షన్ల ముప్పు - కళ్లను కాపాడుకొనేందుకు ఇలా చెయ్యండి, లేకపోతే చూపు కోల్పోతారు

Eye Infections : వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణం చల్లబడటం, తేమ శాతం పెరగడంతో వ్యాధులు వస్తుంటాయి. ఈ కాలంలో కంటి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Eye Infections Monsoons : ఇతర సీజన్లతో పోల్చి చూస్తే వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణం చల్లబడటం, తేమ శాతం పెరగడంతో అనేక వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అయితే ఈ కాలంలో కేవలం సీజనల్ వ్యాధులు మాత్రమే కాదు. కంటి ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కళ్లు ఎర్రబడటం, మంట, వాపు, వంటి కంటి సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు కంటి వైద్యుడిని సంప్రదించాలి. 

వర్షాకాలంలో వచ్చే సాధారణ కంటి వ్యాధులు ఇవే: 

కండ్లకలక (కంటి ఫ్లూ):

కండ్లకలక అనేది కనురెప్పల లోపలి భాగం, ఐబాల్ తెల్లని భాగాన్ని లైన్ చేసే సన్నని పొర వాపునకు దారితీసే ఇన్ఫెక్షన్. కండ్లకలక వచ్చినప్పుడు దురద, సరిగ్గా కనిపించకపోవడం, నీరు కారడం వంటి సమస్యలు కనిపిస్తాయి. కనురెప్పలు ఎర్రగా మారుతాయి. వైరల్ కంజక్టివిటిస్ అనేది అంటువ్యాధి. జాగ్రత్తలు తీసుకోనట్లయితే ఈ ఇన్ఫెక్షన్ ఇతరులకు సులభంగా సోకే ప్రమాదం ఉంది. 

పొడి కళ్ళు:

మీ కళ్లు కావాల్సినంత కన్నీళ్లను ఉత్పత్తి చేయలేనప్పుడు కళ్లు పొడిగా మారుతాయి. దీనిని సజల ద్రవం అనికూడా పిలుస్తారు. దీనిని వైద్యపరి భాషలో కెరాటో⦿ కంజక్టివిటిస్ అని అంటారు. మొబైల్, కంప్యూటర్ స్క్రీన్‌ని ఎక్కువసేపు చూసినప్పుడు, చదివేటప్పుడు లేదా చూస్తున్నప్పుడు రెప్పలు వేయాలి. రెప్పలు వేయకుండా వాటిని అలాగే చూస్తుండిపోతే కళ్లు పొడిబారిపోతాయి.

కార్నియల్ అల్సర్:

కార్నియల్ అల్సర్ అనేది మీ కార్నియాలో ఏర్పడే పుండు. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కళ్లు ఎర్రగా మారడం, కళ్లలో నుంచి నీరు కారడం, కళ్లలో రక్తం తీవ్రమైన కంటి నొప్పి, చీము లేదా ఇతర కంటి నుంచి నీరు కారడం దీని లక్షణం. కార్నియల్ అల్సర్ దృష్టిలోపంతోపాటు అంధత్వానికి దారితీస్తుంది.

స్టై:

కనురెప్పల బేస్ దగ్గర ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చిన్న గ్రంధులను కలిగి ఉండే బ్యాక్టీరియా. అప్పుడప్పుడు కనురెప్పల పై భాగంలో లేదా కంటి లోపలి భాగంలో మొటిమల్లా ఎర్రటి చీము గడ్డలు ఏర్పడతాయి. వీటినే స్టై అంటారు. సరైన మందులు తీసుకుంటే రెండు రోజుల్లో ఈ సమస్య తగ్గుతుంది. ఈ సమయంలో కళ్లు మూసుకుంటాయి. బాగా నొప్పిగా ఉంటుంది. 

ట్రాకోమా:

ట్రాకోమా బాక్టీరియం క్లామిడియా ట్రాకోమాటిస్ వల్ల వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.9 మిలియన్ల మంది అంధత్వానికి ఈ ఇన్ఫెక్షన్ కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇది సోకిన వ్యక్తి కళ్ళు లేదా ముక్కుతో నేరుగా తాకడం లేదా తువ్వాలు, ఈగలు ద్వారా సంభవిస్తుంది. 

వర్షాకాలంలో మీ కళ్ళను ఎలా రక్షించుకోవాలి?

⦿ మీ కళ్ళను తాకడానికి ముందు మీ చేతులను సరిగ్గా కడుక్కోవాలి. 

⦿ మురికి చేతులతో మీ కళ్లను తాకకూడదు

⦿ మీ కళ్ళను చాలా తరచుగా రుద్దకూడదు.

⦿ మీ కాంటాక్ట్ లెన్స్‌లను షేర్ చేయవద్దు.

⦿ ఈత కొట్టేటప్పుడు లేదా గాలికి గురైనప్పుడు కంటి రక్షణ అద్దాలను ఉపయోగించండి.

⦿ వర్షాకాలంలో స్విమ్మింగ్ కు దూరంగా ఉండటం మేలు.

⦿ ప్రతిరోజూ పరిశుభ్రమైన నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. నిద్ర లేచినప్పుడు, కాంటాక్ట్ లెన్స్ లను తొలగించినప్పుడు చాలా మంది కళ్లను గట్టిగా రుద్దుతుంటారు. 

⦿ ఇలా చేస్తే కార్నియా శాశ్వతంగా దెబ్బతింటుంది. కాబట్టి కళ్లను గట్టిగా రుద్దకూడదు. 

 Also Read : ఉదయం లేచిన వెంటనే ఆ సమస్యలున్నాయా? అయితే మీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశముంది జాగ్రత్త

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Fenugreek Water 21 Days : 21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget