Accidental Insurance : ఏడాదికి 20 కడితే.. యాక్సిడెంటల్ కవరేజ్ కింద 2 లక్షలు పొందొచ్చు, పూర్తి డిటైల్స్ ఇవే
Accidental Insurance for 20 per Year : ప్రభుత్వానికి ఏడాదికి 20 రూపాయలు కడితే.. యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ కింద 2 లక్షలు ఇస్తుందట. ఈ పాలసీ ప్రాసెస్ ఏంటి? పూర్తి డిటైల్స్ ఇప్పుడు చూసేద్దాం.

Pradhan Mantri Suraksha Bima Yojana : ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఉన్నా.. డబ్బులు లేవు అనుకునేవారు కూడా ఇన్సూరెన్స్ తీసుకునే విధంగా ప్రభుత్వం ఎన్నో పాలసీలు అందిస్తూ ఉంటుంది. అలాంటి పాలసీల్లో ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కూడా ఒకటి. ఏడాదికి వేలల్లో కాదు.. వందల్లో కూడా కాదు.. కేవలం 20 రూపాయలు కడితే యాక్సిడెంటల్ కవరేజ్ కింద 2 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. ఇంతకీ ఆ పాలసీ ఏంటి? దాని పూర్తి వివరాలు చూసేద్దాం.
పథకం..
ఏడాదికి 20 రూపాయలు కడితే ప్రభుత్వం యాక్సిడెంటల్ కవరేజ్ కింద 2 లక్షలు ఇస్తుంది. ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన పథకం కింద.. కేంద్ర ప్రభుత్వం ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తుంది. దీని గురించిన పూర్తి వివరాలు ఇవే..
ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన పథకం ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతే ప్రభుత్వం ఆ వ్యక్తి కుటుంబానికి రెండు లక్షలు ఇస్తుంది. కేవలం రోడ్డు ప్రమాదాలే కాదు.. ఏ ఇతర ప్రమాదాల వల్ల అయినా పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయినా ప్రభుత్వం ఆ కుటుంబానికి రెండు లక్షలు ఇస్తుంది.
బతికితే వర్తించదా?
ప్రమాదంలో చనిపోతే కవరేజ్ ఇస్తుంది. మరి బతికుంటే ఈ పథకం ప్రయోజనాలు అందుతాయా అంటే.. కచ్చితంగా ఉన్నాయి. కానీ కొన్ని కండీషన్స్ కూడా ఉన్నాయి. అప్పుడే ఇది కవరేజ్ అవుతుంది. అవేంటంటే.. ప్రమాదంలో వ్యక్తి పూర్తిగా పనిచేయలేని స్థితి ఏర్పడినప్పుడు అంటే కళ్లు రెండు పోవడం, చేతులు లేకపోడం, మంచానికే పరిమితమవ్వడం వంటి పరిస్థితుల్లో కూడా రెండు లక్షలు ప్రభుత్వం అందిస్తుంది.
లక్ష ఎప్పుడు ఇస్తారంటే..
ప్రమాదంలో ఓ కన్నుపోవడం, కాలు లేదా చేయిపోవడం వంటి పరిస్థితుల్లో రెండు లక్షలు ప్రభుత్వం ఇవ్వదు కానీ.. ఒక లక్ష మాత్రం ఇస్తుంది.
ఎలా అప్లై చేయాలంటే..
PMSBYలో భాగమైన కొన్ని బ్యాంకులలో ఈ పాలసీ కోసం నేరుగా అప్లై చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, భారతీయ మహిళా బ్యాంక్, కెనరా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడిబీఐ బ్యాంక్, ఇండోసండ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేరళ గ్రామీణ బ్యాంక్, కోటక్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పీఎన్బీ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లలో సేవింగ్స్ అకౌంట్ ఉంటే మీరు ఈ స్కీమ్‌కి అప్లై చేయవచ్చు.
ఈ బ్యాంక్‌లకు వెళ్లి.. మీరు ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన పథకంకి అప్లై చేయాలనుకుని చెప్తే వారు ఓ ఫారమ్ ఇస్తారు. దానిలో పూర్తి వివరాలు ఇవ్వాలి. ఇలా చేసిన తర్వాత ప్రతి సంవత్సరం మీ బ్యాంక్ అకౌంట్ నుంచి 20 రూపాయలు కట్ అవుతాయి. ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి మే 31 వరకు యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి సంవత్సరం మే 31వ తేదీ రోజు అమౌంట్ అకౌంట్ నుంచి కట్ అవుతాయి.
క్లైమ్ ప్రాసెస్
పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయినా లేదా ప్రమాదానికి గురైనా.. క్లైమ్ చేసుకునేందుకు క్లైమ్ ఫామ్, డెత్ సర్టిఫికెట్, పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్, డిజబులిటీ సర్టిఫికెట్, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పత్రం, కేవైసీ డాక్యుమెంట్స్ ఆఫ్ నామిని, వాళ్ల ఆధార్, పాన్ కార్డ్, అడ్రస్ వెరిఫికేషన్ ఐడీ, చెక్ క్యాన్సిల్ చేసుకోవడం, బ్యాంక్ కాపీ, PMSBY పాలసీ సర్టిఫికెట్, దానికోసం కట్ అయిన బ్యాంక్ స్టేట్మెంట్ డాక్యూమెంట్స్ రెడీ చేసుకోవాలి. బ్యాంక్ వాళ్లు అన్ని చెక్ చేసి.. పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే నామిని బ్యాంక్‌లో 2 లక్షలు వేస్తుంది. బతికుంటే ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్లోనే డబ్బు వేస్తారు.






















