Tulasi Plant Care : తులసి మొక్క పచ్చగా ఉండాలంటే బంగాళాదుంపలు పెట్టాలా? అసలు నిజం ఇదే
Potato Peels For Tulasi : తులసి పచ్చగా ఉండాలంటే దాని దగ్గర బంగాళదుంపలను పెట్టాలనే చిట్కా ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ఇది నిజంగా పని చేస్తుందా? దీనివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- బంగాళాదుంపలు తులసి పెరుగుదలకు నేరుగా తోడ్పడవు.
- పచ్చి బంగాళాదుంపలు కుళ్ళితే దుర్వాసన, చీడలు వస్తాయి.
- ఆలు తొక్కల ఎరువు తులసికి పోషకాలు, సారవంతమైన నేల.
- సరైన కాంతి, నీరు, ఎరువు తులసికి చాలా అవసరం.
Potatoes for Tulsi Plants : తులసి మొక్క పచ్చగా ఉండాలంటే బంగాళదుంపలను వాటి దగ్గర పెట్టాలా? మరి దీనిలో నిజమెంతో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరైన సమాచారం లేకుంటే తులసికి హాని కలుగుతుంది. పైగా తులసి చాలా సులభంగా వాడిపోతుంది. కాబట్టి సరైన సంరక్షణ తీసుకోవడం అవసరం. అయితే బంగాళాదుంపలతో తులసికి జరిగే మేలు ఏంటో.. ఎరువుగా ఆలు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంపలలోని పోషకాలు తులసి పెరుగుదలను ప్రోత్సహిస్తాయని అంటారు. అయితే సరైన సమాచారం లేకుండా అలా చేయడం మీ తులసి నాణ్యతకు హాని కలిగించవచ్చు. తులసి దగ్గర బంగాళాదుంపలను ఉంచినప్పుడు ఏమి జరుగుతుందో చూసేద్దాం.
తులసికి బంగాళాదుంప మేలు చేస్తుందా?
బంగాళాదుంపలలో ప్రధానంగా పిండిపదార్థం ఉంటుంది. పొటాషియంతో సహా కొన్ని ఖనిజాలు కూడా ఉంటాయి. అందుకే వీటిని తరచుగా మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగిస్తారు. అయితే తులసి కుండీ దగ్గర పచ్చి బంగాళాదుంపను ఉంచినంత మాత్రాన దానిలోని పోషకాలు నేరుగా మొక్క వేళ్లకు చేరవు. దీనికి సేంద్రియ పదార్థం విచ్ఛిన్నం కావడం, పోషకాలు నేలలోకి విడుదల కావడం వంటి ప్రక్రియలు అవసరం.
Also Read : తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
బంగాళాదుంపలను మట్టిలో పాతి పెట్టాలా?
బంగాళాదుంపను కోసి లేదా కుండీలోని మట్టిలో పూర్తిగా పాతిపెడితే.. అది నెమ్మదిగా కుళ్ళిపోవడం మొదలవుతుంది. ఆ సమయంలో దానిలోని సేంద్రియ పదార్థం విచ్ఛిన్నం అవుతున్న కొద్దీ.. కొన్ని పోషకాలు తిరిగి మట్టిలోకి విడుదల కావచ్చు. అయితే దీని అర్థం బంగాళాదుంపలు సమతుల్య ఎరువుకు ప్రత్యామ్నాయం అని కాదు. ఎందుకంటే కొన్నిసార్లు కుళ్లిపోతున్న బంగాళాదుంపల వల్ల కుండీలో దుర్వాసన, బూజు లేదా కీటకాల సమస్యలు రావచ్చు. చిన్న కుండీలలో ఈ పద్ధతిని ఫాలో అయితే ప్రయోజనాల కంటే సమస్యలే ఎక్కువగా ఉండవచ్చు.
బంగాళాదుంప తొక్కలతో లాభమా?
తులసి మొక్క దగ్గర మొత్తం బంగాళాదుంపను ఉంచడం ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు.. కానీ బంగాళాదుంప తొక్కలతో తయారు చేసిన సేంద్రియ ఎరువు తులసికి మేలు చేస్తుంది. బంగాళాదుంప తొక్కలలో పొటాషియం, ఫాస్ఫరస్, నత్రజని, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. తొక్కలలోని పిండిపదార్థం నేలలోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, సూక్ష్మజీవులకు ఆహారాన్ని అందించి, నేలను సారవంతం చేస్తుంది.
Also Read : మూడ్ను మెరుగుపరిచే ఇండోర్ మొక్కలు ఇవే.. ఇంటికి అందం, మనసుకు ప్రశాంతత
తులసి పచ్చగా ఉండాలంటే..
మీ తులసి మొక్క పదేపదే వాడిపోతుంటే.. బంగాళాదుంపలకు బదులుగా మరిన్ని పద్ధతులు ఫాలో కావచ్చు. తులసి పెరుగుదలకు తగినంత కాంతిని అందించడం చాలా ముఖ్యం. అలాగే దానికి నీరు ఎక్కువగా పెట్టడం కూడా మంచిది కాదు. అందుకే కుండీ అడుగు భాగంలో నీరు బయటకు పోవడానికి రంధ్రాలు పెట్టాలి. అవసరమైనప్పుడు కంపోస్ట్ లేదా తగిన ఎరువును వేయడం కూడా మొక్క పెరగడానికి సహాయపడుతుంది.
Also Read : చలికాలంలో ఇంట్లో సులభంగా పెంచగలిగే పండ్ల మొక్కలు ఇవే.. ఏవి బెస్ట్ అంటే..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























