అన్వేషించండి

Valentine's Day: అక్కడ ప్రేమికుల రోజున పంది బొమ్మ గ్రీటింగ్ కార్డులే స్పెషల్

ప్రేమికుల దినోత్సవం వచ్చేసింది. ఈ ప్రేమ వేడుకకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

వాలెంటైన్స్ డే (Valentine's Day)...
ప్రేమ కవితలు పొంగే రోజు ఇది. చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్ని రంగుల పూలున్నా ఎరుపు గులాబీలు మాత్రమే కంటికి కనిపిస్తాయి. ఎంతమంది మనుషులున్నా నచ్చినా, మనసు మెచ్చిన వ్యక్తి కోసం మాత్రమే కళ్లు వెతుకుతుంటాయి.  ఈ రోజున ఎన్నో మనసులు కలుస్తాయి, మరెన్నో తిరస్కారానికి గురై విరహ వేదనను భరిస్తాయి. ఏడాదిలో ఓసారి వచ్చే ప్రేమ పండుగ. ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే రోజు ఇది. కొన్ని దేశాల్లో వీటికి చాలా ప్రత్యేకత ఉంది, ప్రత్యేక విధానంలోనే తమ ప్రేమను వ్యక్తపరుస్తారు కూడా. 

పంది పిల్ల స్పెషల్
ఏ దేశంలోనైనా ప్రేమ ఒక్కటే, ప్రేమ చిగురించే విధానం ఒక్కటే. కానీ వ్యక్తపరిచే పద్దతులే వేరుగా ఉంటాయి. జర్మనీలో ప్రేమికుల రోజున పందిపిల్లలకు చాలా విలువ పెరిగిపోతుంది. వాటికి ఫోటోలు తీసి, గ్రీటింగ్ కార్డులుగా అచ్చేసి అమ్ముకుంటారు. ఆ రోజున ప్రేమికులు పందిపిల్ల బొమ్మలున్న గ్రీటింగ్ కార్డులు ఇచ్చిపుచ్చుకుంటారు. అది చాలా శుభసూచకమని వారి నమ్మకం. జర్మనీలోకి 1940లలో వాలెంటైన్స్ డే వేడుకలు ప్రవేశించాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ సైనికులు అక్కడే ఉంది వేడుకలు నిర్వహించుకున్నారు. అప్నట్నించి జర్మనీ ప్రజలు కూడా మొదలు పెట్టేశారు. చిన్న పంది పిల్లలు పువ్వులు పట్టుకున్నట్టు, నాలుగు ఆకులను పట్టుకున్నట్టు అనేక గ్రీటింగ్ కార్డులను అమ్ముతారు. ప్రేమజంటలు వాటిని ఇచ్చుకుంటే ప్రేమ సక్సెస్ అవుతుందని వారి నమ్మకం. 

అమ్మాయిలే ఇస్తారు
ప్రతి చోటా వాలెంటైన్స్ డే రోజు అబ్బాయిలే అమ్మాయిలకు చాక్లెట్లు కొని ఇస్తుంటారు. కానీ జపాన్ లో మాత్రం అమ్మాయిలే చాక్లెట్లు కొని అబ్బాయిలకు ఇస్తారు. ఈ చాక్లెట్లను అక్కడ ప్రత్యేకంగా తయారు చేస్తారు. వీటిని ‘గిరి - చాకో’ అంటారు.  ఈ చాక్లెట్లను ఇస్తే ఇష్టపడుతున్నట్టు అర్థం. అదే ‘హోన్మీ చాకో’పేరుతో అమ్మే చాక్లెట్లను ఇస్తే రొమాన్స్ చేసే ఉద్దేశం ఉందని చెప్పకనే చెబుతున్నట్టు. 

పువ్వుల సంఖ్యను బట్టి
తైవాన్లో ప్రియుడు తన ప్రేయసికి ఇచ్చే పూల సంఖ్యను బట్టి అతని మనసులోని మాటను చెబుతాడు. 
ఒక ఎర్ర గులాబీ ఇస్తే ‘నువ్వు మాత్రమే నా ప్రేయసివి’ అని చెప్పినట్టు
11 గులాబీలు ఇస్తే ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పినట్టు
99 గులాబీలు ఇస్తే ‘ఎప్పటికీ నువ్వే నా ప్రేమ’ అని చెప్పినట్టు
అదే 108 గులాబీలు ఇస్తే ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’అని అడిగినట్టు. 

పేరు రాసి...
దక్షిణాఫ్రికాలోని వాలెంటైన్స్ డే రోజున పాత రోమన్ సంప్రదాయాలను పాటిస్తుంటారు. అబ్బాయిలు తాము ప్రేమించిన అమ్మాయి పేరును చేతులపై రాసుకుంటారు. అదే వారి ప్రేమ ప్రకటన. అమ్మాయి చూసి ఒప్పుకుంటే సరి, లేకుండా సబ్బుతో పేరును శుభ్రం చేసుకోవడమే. 

ఆ సంప్రదాయానికి పాతర
ప్రేమికుల రోజున ఫ్రాన్స్‌లో ఓ అనాగరిక ఆచారం అమలులో ఉండేది. లవ్ లాటరీ పేరుతో వాలెంటైన్స్ డే రోజు ఒక కార్యక్రమం నిర్వహించుకునేవారు. సింగిల్స్ పేర్లను కాగితంపై రాసి లాటరీ తీసేవారు. తమకు వచ్చిన పేర్లను బట్టి జంటలుగా మారేవారు. వచ్చిన వ్యక్తి పేరు తమకు నచ్చకపోతే వారి ఫోటోను అక్కడే మంటల్లో వేసేవారు. ఇది అనారికమైనదిగా భావించి ఫ్రాన్స్ లో చాలా మంది ఈ ఆచారాన్ని వదిలేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
iPhone Amazon Offer: ఐఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ - రూ.40 వేలలోపే!
ఐఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ - రూ.40 వేలలోపే!
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
Embed widget