అన్వేషించండి

Body Signals Before Death : మరణానికి 7 రోజుల ముందు ఏమి జరుగుతుంది? శరీరంలో జరిగే మార్పులు ఇవే

Death Symptoms : మరణానికి ముందు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుందట. సైన్స్ వాటిని జీవసంబంధమైన మార్పులుగా పరిగణిస్తుంది. అలాగే సంప్రదాయం వాటిని ఆధ్యాత్మిక సంకేతాలతో అనుబంధింస్తుంది. ఇంతకీ అవి ఏంటంటే.. 

Signs the Body Shows Before Death : మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కానీ శరీరం చనిపోవడానికి ముందు సంకేతాలు ఇస్తుందట. దీని గురించి చాలామందికి డౌట్ ఉంటుంది. ఇది నిజమా? కాదా? అని. దీనిగురించి కొందరు సైన్స్‌ని ఆశ్రయిస్తే.. మరికొందరు మత గ్రంథాలలో సమాధానాలు వెతుక్కుంటారు. కానీ ఆశ్చర్యకరంగా.. ఆధునిక వైద్య శాస్త్రం, పురాతన నమ్మకాలు రెండూ కూడా మరణానికి ముందు సంభవించే నిర్దిష్ట మార్పులను సూచించాయి. 

ఆకలి తగ్గుతుందా?

వైద్య శాస్త్రం ప్రకారం.. శరీరం జీవితపు చివరి దశలకు చేరుకునే కొద్దీ.. అనేక శారీరక ప్రక్రియలు క్రమంగా మందగిస్తాయని తెలిపింది. వైద్యులు, ఉపశమన సంరక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మరణానికి కొన్ని రోజుల ముందు శరీరం శక్తిని ఆదా చేసే స్థితిలోకి ప్రవేశిస్తుందట. ఆ సమయంలో మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తికి తరచుగా ఆకలి, దాహం తగ్గుతుందని గుర్తించింది. జీర్ణవ్యవస్థ మందగించి ఆకలి, నీరు తీసుకోవడం తగ్గిస్తారట. ఇది సాధారణ జీవ ప్రక్రియగా పరిగణిస్తారు.

శ్వాసలో మార్పులు.. 

చివరి రోజుల్లో శ్వాస తీసుకోవడం చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా మారవచ్చు. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం అడపాదడపా జరుగుతుంది. దీనిని వైద్యులు చెయిన్-స్టోక్స్ శ్వాస అని పిలుస్తారు. గొంతు నుంచి శ్వాసలో గురక శబ్దం కూడా ఉండవచ్చు. దీనిని సాధారణంగా డెత్ రాటిల్ అని పిలుస్తారు.

నిద్రలో ఉన్నా..

శరీర శక్తి స్థాయిలు వేగంగా తగ్గుతాయట. అలాగే ఆ వ్యక్తి రోజులో ఎక్కువ సమయం నిద్రలోనే గడుపుతాడు. అయినా సరే మేల్కొన్న తర్వాత కూడా చాలా అలసటగా ఫీల్ అవుతాడట. చేతులు, కాళ్లు ఎత్తడం లేదా మాట్లాడటం కూడా కష్టంగా మారుతుంది.

మానసిక ఆలోచనలు..

మరణానికి కొన్ని రోజుల ముందు వ్యక్తి ప్రవర్తన, ఆలోచనలలో కూడా మార్పులు వస్తాయట. కొన్నిసార్లు ఆ వ్యక్తి భ్రాంతికి గురై.. తన పరిసరాలతో సంబంధం లేని విధంగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. మరి కొందరైతే నిజానికి లేని వాటిని చూస్తున్నట్లు లేదా విన్నట్లు నివేదిస్తారు. వైద్య శాస్త్రం దీనికి ఆక్సిజన్ లేకపోవడం, మందుల ప్రభావాలు లేదా మెదడు కార్యకలాపాల్లో మార్పులే కారణమని చెబుతుంది.

సంప్రదాయాలు ఏమి చెప్తున్నాయంటే..

భారతీయ సంప్రదాయంలో.. గరుడ పురాణం, శివ పురాణం వంటి గ్రంథాలు మరణానికి ముందు సంభవించే సంకేతాలను వివరిస్తాయి. అయితే వీటిని శాస్త్రీయ ఆధారాలుగా కాకుండా విశ్వాసం, నమ్మకానికి సంబంధించిన విషయంగా చూస్తారు.

చివరిగా..

మరణానికి వారం ముందు శరీరం, మెదడు రెండూ వేగంగా పనితీరు క్షీణిస్తాయని నిపుణులు నమ్ముతున్నారు. అందుకే ఈ సమయంలో శారీరక బలహీనత, మానసిక గందరగోళం, భావోద్వేగ దూరం తరచుగా ఒకేసారి కనిపిస్తాయి. ఇది భయంతో కాకుండా అవగాహన, సున్నితత్వంతో చూడవలసిన సహజమైన ప్రక్రియగా చెప్తున్నారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పరిశోధనలు, పండితులు చెప్పిన వివరాలు సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Fenugreek Water 21 Days : 21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget