అన్వేషించండి

Nipah Virus : ఇండియాలో మరో Pandemic రానుందా? నిఫా వైరస్ లక్షణాలు, చికిత్స, నివారణ చర్యలివే

Nipah Virus Risk : నిఫా వైరస్ కేసుల కలకలంతో విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేస్తున్నారు. అయితే నిఫా వైరస్ లక్షణాలు, నివారణ, చికిత్స, కోలుకోవడానికి పట్టే సమయం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.

Nipah Virus Symptoms, Risks, Treatment : పశ్చిమ బెంగాల్​లో నిఫా వైరస్ కేసుల వ్యాప్తితో అందరిలో మళ్లీ భయం మొదలైంది. కరోనా రోజులు మళ్లీ రానున్నాయా? అంటూ సోషల్ మీడియాలో పోస్ట్​లు పెడుతున్నారు. అధికారులు మాత్రం వ్యాప్తిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. క్వారంటైన్, వైరస్ స్క్రీనింగ్స్ చేస్తూ.. వైరస్​ గురించి అవగాహన కల్పిస్తున్నారు. వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

నిఫా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. అలాగే వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కూడా వ్యాపిస్తుంది. వైరస్ సంక్రమించిన తర్వాత లక్షణాలు సాధారణంగా 4 నుంచి 14 రోజుల్లో కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో 45 రోజుల వరకు ఉంటుంది. కొన్నిసార్లు లక్షణాలు కనిపించకపోవచ్చు. సరైన చికిత్స విధానం, టీకా సదుపాయం లేదు కాబట్టి ఇది ప్రాణాంతకం కావచ్చు. అందుకే ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.

నిఫా వైరస్ 

WHO ప్రకారం.. నిఫా అనేది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే జూనోటిక్ వైరస్. ఇది కొన్నిసార్లు ఆహారం, పానీయాల ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి నిఫా వైరస్ ఎంత ప్రమాదకరమైనదో, ఒక వ్యక్తి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో, దానికి ఎలా చికిత్స చేయాలో తెలుసుకుందాం.

నిఫా వైరస్ లక్షణాలు

నిఫా వైరస్ సంక్రమణ లక్షణాలు సాధారణంగా 4 నుంచి 14 రోజుల్లో కనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు 45 రోజుల వరకు ఉండవచ్చు. ఇది ప్రాణాంతకం కావచ్చు. నిఫా వైరస్ సంక్రమణ సాధారణంగా జ్వరం, తలనొప్పికి కారణమవుతుంది. తరువాత దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో మెదడు ఇన్ఫెక్షన్ కూడా సంభవించవచ్చు. ఇది తీవ్రమైన ఎన్సెఫాలిటిస్, తలలో వాపునకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో లక్షణాలు కూడా కనిపించకపోవచ్చు.

నిఫా వైరస్‌ నివారణ చర్యలు

నిఫా వైరస్​ నివారించాలంటే.. చెట్టు నుంచి పడిపోయిన, సగం లేదా కుళ్లిన పండ్లను తినవద్దు లేదా ముట్టుకోవద్దు. జబ్బుపడిన జంతువులతో.. ముఖ్యంగా పందులకు దూరంగా ఉండాలి. పరిశుభ్రతను పాటించండి. ముఖ్యంగా తరచుగా చేతులు కడుక్కోండి. వైరస్ సోకిన జంతువులు లేదా వ్యక్తుల చుట్టూ ఉంటే తగిన దుస్తులు ధరించండి. వైరస్ సోకిన వ్యక్తిని ఒంటరిగా ఉంచండి. 

నిఫా వైరస్ చికిత్స 

నిఫా వైరస్ చికిత్సకు ప్రస్తుతం యాంటీవైరల్ మందులు అందుబాటులో లేవు. ఈ వైరస్​కు ఇంకా టీకా లేదు. వైద్యులు లక్షణాలను తగ్గించడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. లక్షణాలు నియంత్రించే వరకు చికిత్స కొనసాగుతుంది. రోగికి సరైన సంరక్షణ చాలా ముఖ్యం.

రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రోగులు రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు తాగాలి. రోగులకు తగినంత విశ్రాంతి అవసరం. వికారం, వాంతులు నియంత్రించడానికి మందులు వెంటనే తీసుకోవాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారికి ఇన్​హేలర్లు లేదా నెబ్యులైజర్లు సిఫార్సు చేస్తారు. మూర్ఛలకు యాంటీకన్వల్సెంట్లను సూచిస్తారు. నిఫా వైరస్​కు మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సను కూడా ఇస్తారు.

ఈ వైరస్​కు చికిత్స లేదు కాబట్టి నివారణే ప్రధాన మార్గం. కాబట్టి అధికారులు సూచించే నియంత్రణ మార్గాలు ఫాలో అవుతూ ఉండాలి. అలాగే ఏ కారణంగానైనా వైరస్ వ్యాపించడం, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సేవలు తీసుకోండి. చికిత్సతో లక్షణాలు కంట్రోల్ చేసుకోవచ్చు. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Alopecia Areata : జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? కంట్రోల్ చేసేందుకు ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Embed widget