అన్వేషించండి

Painkillers: పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడుతున్నారా? అయితే ఈ ప్రధాన అవయవానికి ముప్పే

పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడడం వల్ల శరీరంలోని ఈ అవయవం దెబ్బ తినవచ్చు.

Painkillers: నొప్పి నివారణ మందులు లేక పెయిన్ కిల్లర్స్... వీటిని వాడే వారి సంఖ్య అధికంగానే ఉంది. వెన్ను నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా ముందుగా వేసుకునేది పెయిన్ కిల్లర్స్‌నే. అయితే పెయిన్ కిల్లర్స్‌ను ఇలా అధికంగా వాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఇలా నొప్పి నివారణ మందులను వాడడం వల్ల ఆరోగ్యం పై దీర్ఘకాలంలో ప్రభావం పడుతుందని చెబుతున్నారు. పెయిన్ కిల్లర్లు రెండు రకాలు. ఒకటి పారాసిటమాల్ ఆధారంగా తయారైనవి. ఇక మిగతావి నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు.

ఇవి చాలా సులభంగా అందుబాటులో దొరుకుతున్నాయి. అందుకే వీటిని వాడే వారి సంఖ్య పెరిగిపోతుంది. వైద్యులు చెబుతున్న ప్రకారం మూడు నుంచి నాలుగు నెలల పాటు రోజుకు ఒక గ్రాము కన్నా ఎక్కువ పారాసిటమాల్ పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల తీవ్రమైన కాలేయ సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఒక గ్రాము పారాసిటమాల్ తీసుకోవడం వల్ల ఆ ప్రభావం నేరుగా కాలేయంపైనా, మూత్రపిండాలపైనా పడుతుంది. ఒక గ్రాము పారాసిటమాల్ పెయిన్ కిల్లర్ ,  నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు చేసేంత హానిని కలిగించవు. కానీ దీనిని కూడా ఎక్కువ కాలం పాటు తీసుకోకూడదు.

ఇక నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటే... కాలేయానికి గాయం కావడం, పొట్టలో పుండ్లు ఏర్పడడం, గ్యాస్ట్రిక్, అల్సర్లు రావడం, మూత్రపిండాలు తీవ్రంగా నష్టపోవడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఇవి మీ అన్నవాహిక దిగువ భాగాన్ని చీల్చే అవకాశం ఉంది. ఈ మందులు రెండు వారాల కంటే ఎక్కువ కాలం పాటు తీసుకుంటే మూత్రపిండాలు శాశ్వతంగా నష్టపోవచ్చు. కాలేయం ఉండే భాగంలో నొప్పి వస్తుంది. కాలేయం సరిగాప పనిచేయకపోవడం వల్ల కాలేయం విడుదల చేసే ఎంజైమ్స్, బిలిరుబిన్ పెరుగుతాయి. కాలేయ పనితీరు తగ్గడం వల్ల రక్తం గడ్డకట్టే సమస్య పెరుగుతుంది. కాలేయం రక్తం గడ్డకట్టే కారకాన్ని అధికంగా విడుదల చేస్తుంది. దీనివల్ల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.

మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నట్లయితే మీకు సాధారణం కంటే చాలా తక్కువ మొత్తంలో మూత్రాన్ని ఉత్పత్తి చేస్తారు. ఇది ఎంతో సమస్యగా మారుతుంది. శ్వాస ఆడక పోవడం, నడుస్తున్నప్పుడు ఊపిరి తీసుకోవడానికి కష్టపడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పొట్టలో నొప్పి అసౌకర్యంగా కూడా అనిపిస్తుంది. తీవ్రమైన దగ్గు వేధిస్తుంది. దగ్గినప్పుడు రక్తం కూడా పడవచ్చు. అలాగే రక్తపు వాంతులు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు పడితే అప్పుడు నచ్చినట్టు వాడకూడదు.

Also read: డయాబెటిస్ ఉన్నవారికి ఔషధం పనస పిండి - బియ్యం, గోధుమలకు బదులు దీన్ని వాడండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Embed widget