అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Honey Ants: తేనెటీగలే కాదు చీమలు కూడా తేనెను తయారు చేస్తాయి, ఈ తేనే ఎంతో ఖరీదు

తేనె అనగానే తేనెటీగలే గుర్తొస్తాయి. కానీ కొన్ని చీమలు కూడా తేనెను తయారు చేస్తాయి.

ప్రపంచంలో ఎప్పటికీ చెడిపోని పదార్థం ఉందంటే అది తేనె మాత్రమే. తేనె అనగానే అందరూ తేనెటీగలు మాత్రమే తేనెను తయారు చేస్తాయని అనుకుంటారు. నిజానికి కొన్ని రకాల చీమలు కూడా తేనెను తయారు చేస్తాయి. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. మన దేశంలో తేనెటీగలు తయారుచేసిన తేనెనే అధికంగా వినియోగిస్తాం. కానీ ఆస్ట్రేలియాలో చీమలు తయారు చేసిన తేనెను అధికంగా వినియోగిస్తారు. ఈ తేనే ఖరీదు కూడా చాలా ఎక్కువ. ఈ తేనెలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ చీమలను హనీపాట్ చీమలు అంటారు. ఇవి తేనెను ఉత్పత్తి చేస్తాయి కాబట్టే వాటికి హనీపాట్ అనే పేరు వచ్చింది. ఈ చీమలు పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఎడారి ప్రాంతాల్లో అధికంగా ఉంటాయి. ఇవి తమ పొత్తికడుపులో చివరన గాలి బుడగ లాంటి భాగాల్లో తేనెను ఉత్పత్తి చేసి దాస్తాయి. తమ గూడు నుంచి వేలాడుతూ కనిపిస్తాయి. వాటికి ఆహారం దొరకనప్పుడు ఈ తేనెనే తిరిగి తిని జీవిస్తాయి. ఒక చీమ పొట్ట నుంచి తేనెను మరో చీమ వెలికి తీస్తుంది. చీమలు తమ తేనెను తాము బయటికి తీసుకోలేవు.

 ఈ చీమలు చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ తేనెను సేకరించి ఎక్కువ ధరకు అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఆ తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో పాటు మన శరీరానికి, మానసిక ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో సమ్మేళనాలు ఉన్నాయి. ఈ తేనెలో యాంటీ మైక్రో బయల్ పెప్టైడ్, మిథైల్ గ్లైక్సాల్ సమ్మేళనం, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటివి అధికంగా ఉంటాయి. అందుకే ఈ చీమల నుంచి తీసే తేనెను ఆస్ట్రేలియన్ ప్రజలు ఔషధంగా భావిస్తారు. దెబ్బలు, గాయాలు తగిలిన చోట ఆయింట్‌మెంట్‌లా పూస్తారు. అయితే సాధారణ తేనెతో పోలిస్తే ఈ తేనే చాలా తక్కువ తీపి ఉంటుంది . 

ఈ తేనె తాగడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా అతి త్వరగా సోకే జలుబు దగ్గు వంటి వాటినుంచి ఇది ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచి, అంటువ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. ఈ చీమల నుంచి తేనెను సేకరించడం కాస్తా క్లిష్టమైన ప్రక్రియ. అందుకే ఇది ఎక్కువగా అందుబాటులో ఉండదు. ఆస్ట్రేలియాతో పాటూ మరికొన్ని దేశాల్లో ఈ చీమలు కనిపిస్తాయి. 

Also read: మిమ్మల్ని, మీ నిర్ణయాలను తిరస్కరిస్తే తట్టుకోలేకపోతున్నారా? మీకు ఈ రిజెక్షన్ ట్రామా ఉందేమో?

Also read: సూర్యాస్తమయం తరువాత ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్, ఆ వ్యాధి ఉన్నట్లే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget