అన్వేషించండి

New Year Weight Loss Goals : బరువు తగ్గడమే న్యూ ఇయర్ రిజల్యూషనా? ఫెయిల్ కాకూడదంటే ఈ సింపుల్ రొటీన్ చిట్కాలు ఫాలో అయిపోండి

Weight Loss Resolution : 2026లో బరువు తగ్గాలనుకుంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. ఇవి జీవక్రియను మెరుగుపరిచి.. బరువు తగ్గించడంతో పాటు.. ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించడంలో హెల్ప్ చేస్తాయి.

Proven Tips To Stick To Your Weight Loss Resolution : చాలామంది కొత్త సంవత్సరం(New Year 2026)లో రెజుల్యూషన్​లో భాగంగా బరువు తగ్గాలనుకుంటారు. మొదట్లో దీనిని సీరియస్​గా తీసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేసినా.. చాలామంది ఆ లక్ష్యాన్ని చేరుకోరు. దానివెనుక తేలికపాటి నిర్లక్ష్యం ఉంటుంది. లేదా ఇతర పనుల్లో బిజీగా అయిపోవడం వల్ల పట్టించుకోవడం కష్టం అవుతుంది. దీనివల్ల బరువు తగ్గడం తీరని కోరికగా మిగిలిపోతుంది. కానీ మీరు సరైన ప్రణాళికతో ఉంటే బిజీ టైమ్​లో కూడా బరువు తగ్గవచ్చు అని చెప్తున్నారు నిపుణులు. దానికోసం మీరు బరువు తగ్గడాన్ని రొటీన్​ పనులతో మిక్స్ చేయాలంటున్నారు. అవేంటో.. వాటివల్ల బరువు ఎలా తగ్గవచ్చో చూసేద్దాం. 

రోటీన్​పై దృష్టి పెట్టండి

వర్క్ బిజీ పెరిగినప్పుడు.. స్ట్రిక్ట్ డైట్, జిమ్ షెడ్యూల్‌లు బ్రేక్ అవుతాయి. అలాంటి సమయంలో మీరు ఇంటి భోజనం ఎన్నిసార్లు తింటున్నారు? ఎంతసేపు కూర్చొని ఉంటున్నారు? ఎప్పుడు నిద్రపోతున్నారు? అనే విషయాలపై దృష్టి పెట్టాలి. మీరు ఈ బేసిక్​ విషయాలపై ఫోకస్ చేస్తే రిజల్ట్ చూడవచ్చని చెప్తున్నారు. ఎందుకంటే ఇవి చిన్న మార్పులే అయినా.. పెద్ద ఫలితాలు ఇస్తాయి. పైగా ఈ రొటీన్ సెట్ అయితే ఎక్కువకాలం కొనసాగించవచ్చు. 

భోజనం విషయంలో మార్పులు

 

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

చాలామంది ఫుడ్ మానేస్తే బరువు తగ్గిపోతామనుకుంటారు. అలాగే కొన్ని ఫుడ్స్ పూర్తిగా తినడం మానేస్తారు. ఇలా చేస్తే  తర్వాత మీకు తొందరగా క్రేవింగ్స్ పెరుగుతాయి. కొన్నిసార్లు ఎక్కువ తినేస్తారు. కాబట్టి ఫుడ్ బ్యాలెన్స్​డ్​గా ఉండేలా చూసుకోండి. ఇది మీకు శక్తిని ఇచ్చి ఆకలిని కంట్రోల్ చేస్తుంది. పప్పులు, కూరగాయలు, పెరుగు, తృణధాన్యాలు, పండ్లు వంటివి డైట్​లో ఉండేలా చూసుకోండి. నూనె తగ్గించండి. వేయించిన స్నాక్స్​కి దూరంగా ఉండండి. తప్పట్లేదు అనే సందర్భాల్లో తక్కువ తీసుకోండి. స్వీట్ క్రేవింగ్స్​ని డేట్స్ వైపు డైవర్ట్ చేయండి. ఏది తీసుకున్నా.. లిమిటెడ్​గా తీసుకోవాలని గుర్తించుకోండి. టైమింగ్స్ పాటిస్తే మంచి ఫలితాలు చూస్తారు.

ఆ ఫుడ్​కి నో..

ప్యాకేజీ చేసిన స్నాక్స్, ఆర్డర్ పెడితే వచ్చే ఫుడ్స్​కి వీలైనంత దూరంగా ఉండండి. కార్బోనేటెడ్, స్వీట్స్ డ్రింక్స్ కట్ చేస్తే మంచిది. తాజా ఆహారాన్ని కంటికి కనిపించేలా ఉంచుకుంటే.. అధికంగా ప్రాసెస్ చేసిన స్నాక్స్​కి దూరమవ్వవచ్చు. ఇంట్లో తయారు చేసిన ఫుడ్​ని ఆఫీస్​కి తీసుకెళ్తే బయట తినాల్సిన అవసరం రాదు. మీరు పీజీలో ఉన్నా కెటిల్, కుకర్ ఉపయోగించి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేయకుండా కుదరదు అని సాకు చెప్తే నష్టం మీకేనని గుర్తించాలి.

శారీరక శ్రమ

వ్యాయామం అనేది మీ రొటీన్​లో భాగమవ్వాలి. అలా అని మీరు జిమ్​కే వెళ్లాల్సిన పని లేదు. నడవడం, సైకిల్ తొక్కడం, యోగా చేయడం, ఈత కొట్టడం, ఇంట్లో వ్యాయామాలు చేయడం లేదా వినోదం కోసం క్రీడలు ఆడటం వంటివి మీ బరువును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. మీరు చేసే పని ఎంత తరచుగా చేస్తారనేదే ముఖ్యం. స్వల్పకాలిక, తీవ్రమైన వ్యాయామాల కంటే రెగ్యులర్​గా చేసే తేలికపాటి వ్యాయామాలే ఆరోగ్యానికి మంచిది.

నిద్ర ప్రభావం

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

తగినంత నిద్ర లేకపోవడం వల్ల మీ ఆకలి దెబ్బతింటుంది. క్రేవింగ్స్ పెంచుతుంది. అలసిపోయేలా చేస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడం కష్టతరం చేస్తుంది. ఆలస్యంగా భోజనం చేయడం, అసాధారణ సమయాల్లో నిద్రపోవడం, స్క్రీన్‌ల ముందు ఎక్కువ సమయం గడపడం వంటివి నిద్రను దూరం చేస్తాయి. క్రమమైన నిద్ర షెడ్యూల్ ఫాలో అవ్వడం, రాత్రిపూట తేలికపాటి భోజనం వంటివి నిద్రతో పాటు బరువును కూడా బ్యాలెన్స్ చేస్తాయి.

బరువు చెక్ చేసుకోకండి..

తరచుగా బరువు చూసుకుని.. అనవసరంగా ఆందోళనకు గురికాకండి. ఎందుకంటే మీ బరువు ప్రతిరోజూ మారుతుంది. ఒక్కోసారి పెరగవచ్చు, తగ్గొచ్చు. కానీ అస్తమాను బరువు చూసుకుని ఏమి చేసినా తగ్గలేదనే నిరాశతో పూర్తిగా మానేయడం కన్నా.. మీరు అన్ని క్రమంగా ఫాలో అవుతూ బరువు చెక్ చేసుకుంటే మంచిది. ఒకవేళ తగ్గకపోయినా.. మీరు ఎంత యాక్టివ్​గా ఉంటున్నారు? ఎంత రెగ్యులర్​గా ఇవి ఫాలో అవుతున్నారనేది మీకు మంచి ఫీలింగ్ ఇవ్వవచ్చు. కాబట్టి వెయిట్ చెక్ చేసుకుని ఒత్తిడి పెంచుకోకండి.

వైద్య సహాయం 

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

జీవనశైలిలో మార్పులు చేసినప్పుడు క్రమంగా మెరుగుదలలను చూస్తారు. అయితే కొందరికి ఎలాంటి ఫలితాలు ఉండకపోవచ్చు. అలాంటివారు వైద్యుల సహాయం తీసుకోవాలి. అంటే సమస్య ఎక్కడ వస్తుందో గుర్తించాలి. ఏదైనా ఆరోగ్య సమస్య కారణంగా బరువు తగ్గట్లేదో తెలుసుకోవాలి. తప్పని పరిస్థితుల్లో వైద్యులు రోబోటిక్ బారియాట్రిక్ సర్జరీ సిఫార్సు చేయవచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 32 కంటే ఎక్కువగా ఉండి.. మధుమేహం, ఊబకాయం, ఆస్టియో ఆర్థరైటిస్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా లేదా ఆస్టియో ఆర్థరోసిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే ఇలాంటి సర్జరీలు వైద్యులు సిఫార్సు చేస్తారు. 

కాబట్టి బరువు తగ్గడాన్ని స్వల్పకాలిక లక్ష్యంగా కాకుండా.. మీ మొత్తం ఆరోగ్య నిర్వహణలో భాగంగా తీసుకోండి. అప్పుడే మీరు గోల్ రీచ్ అవుతారు. ఈరోజు జిమ్ చేసి ఈరోజు బరువు తగ్గడమనేది అసాధ్యం. చిన్న మార్పు అయినా ఎక్కువ రోజులు చేస్తేనే ఫలితాలు ఉంటాయనేది నిజం. ఇది యాక్సెప్ట్ చేస్తే బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee: ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
Advertisement

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee: ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
ప్రశాంత్ కిషోర్ లేని ఐ ప్యాక్ పైనే మమతా బెనర్జీ ఆశలు - మరోసారి గెలిపిస్తారని నమ్మకంతోనే ఈడీని ఢీకొట్టారా?
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
The Raja Saab OTT : 'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Mobile Recharge Price : మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్! రీఛార్జ్ ప్లాన్‌ల ధరల్లో భారీ మార్పులు!, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే?
మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్! రీఛార్జ్ ప్లాన్‌ల ధరల్లో భారీ మార్పులు!, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయంటే?
Ayyappa Deeksha Rules: అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
Embed widget