అన్వేషించండి

Sleeping Time: ఈ టైమ్‌లో నిద్రపోతే ఆరోగ్యం గ్యారెంటీ - కానీ, మీకు కుదురుతుందా?

రాత్రి నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే ఏ సమయంలో నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారనేది చెప్తూ ఒక కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది.

రోగ్యంగా ఉండాలంటే సమయానికి తినడం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. టైమ్ కి నిద్రపోకపోవడం వల్ల మధుమేహం, అలసట, ఊబకాయం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక వ్యక్తికి కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. అర్థరాత్రి 12 గంటలకు పడుకుని తెల్లారి 10 గంటలకి లేవడం అసలు కరెక్ట్ కాదు. చాలా మందికి మధ్యాహ్నం 2.30-3.00 గంటల మధ్యలో ఎక్కువగా నిద్ర ముంచుకు వస్తుంది. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా? రాత్రిపూట సరైన టైమ్ కి పడుకోవడం లేదని అర్థం.

సిర్కాడియన్ రిథమ్ అంటే ఏంటి?

శరీరం ఎప్పుడు నిద్రపోవాలి, మేల్కొవాలి అనే వాటిని సిర్కాడియన్ రిథమ్ సూచిస్తుంది. అందుకే దీన్ని ‘నిద్ర చక్రం’ అని కూడా అంటారు. ఉదయం శరీరం సూర్యరశ్మికి గురైనప్పుడు మేల్కొని ఉండటానికి సహాయపడే హార్మోన్లను విడుదల చేస్తుంది. సూర్యుడు అస్తమించినప్పుడు విశ్రాంతినిచ్చేలా చేస్తుంది. శరీరంలో విడుదలయ్యే రాశయనాలు అలసిపోయిన అనుభూతిని కలిగిస్తాయి. దీన్ని పోస్ట్ ప్రాండియల్ డిప్ అంటారు. ఈ డిప్ ఎప్పుడు సంభావిస్తుందో పరిశోధకులు పర్యవేక్షిస్తున్నారు. నిద్ర- మెల్కొనే చక్రంలో ఎంత దూరంలో ఉన్నారనే దానికి ఇది సూచిక.

మీకు మధ్యాహ్నం 3 గంటల నుంచి అలసిపోయినట్టుగా అనిపిస్తే రాత్రి 9-10 మధ్య నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఉదయం త్వరగా నిద్రలేవాలి అనుకుంటే 7-8 గంటల మధ్య నిద్రపోవాలి. ప్రతీ రోజు ఇదే క్రమం పాటించాలని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. వ్యక్తి నిద్ర అలవాట్లు, అవసరాలు భిన్నంగా ఉంటాయి. కానీ నిద్ర టైమ్ మార్చుకుంటే దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన నిద్ర కావాలంటే వెలుగులు చిమ్మే కాంతి దీపాలు, ఆల్కహాల్, కెఫీన్ ను నివారించాలి. మెటబాలిక్ డిజార్డర్స్, గుండె జబ్బులు, స్ట్రోక్ ను దూరంగా ఉంచి మెదడు పనితీరు సక్రమంగా ఉండేలా చేయాలనుకుంటే కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం.

గుండెకి మేలు

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి 10 లేదా 11 గంటల మధ్య నిద్రపోవడం మంచిదని కొత్త అధ్యయనం చెప్తోంది. నిద్ర తగ్గిన వారిలో మధుమేహం, ఊబకాయం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. లేదంటే నిద్ర తక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఆ ప్రభావం అంతా శరీరంపై పడుతుంది. అవయవాల పనితీరు కూడా మందగిస్తుంది. పని ఒత్తిడి వల్ల ఎక్కువగా నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటారు. దీన్ని అధిగమించాలంటే నిద్రని ప్రేరేపించే ఆహార పదార్థాలు తీసుకోవడం ముఖ్యం. పడుకోవడానికి ఒక గంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే హాయిగా నిద్రపోవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: ఐస్‌ ఫేషియల్‌తో మతిమరపు సమస్య పోతుందా? ఈ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Watermelon vs Muskmelon : పుచ్చకాయ vs ఖర్బూజ.. వేసవిలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది, బరువు తగ్గొచ్చు?
పుచ్చకాయ vs ఖర్బూజ.. వేసవిలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది, బరువు తగ్గొచ్చు?
Stomach Cancer : కడుపు క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలు ఇవే.. గ్యాస్, అజీర్ణం, పొట్ట నొప్పితో పాటు మరెన్నో
కడుపు క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలు ఇవే.. గ్యాస్, అజీర్ణం, పొట్ట నొప్పితో పాటు మరెన్నో
Life of Jesus : యేసు మరణం గుడ్ ఫ్రైడే, జననం క్రిస్మస్.. మరి ఈస్టర్? జీసస్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే  
యేసు మరణం గుడ్ ఫ్రైడే, జననం క్రిస్మస్.. మరి ఈస్టర్? జీసస్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే  
Good Friday 2026 : యేసును శిలువ వేయడానికి కారణాలు ఇవే.. జీసస్ మరణించినా 'గుడ్ ఫ్రైడే' అని ఎందుకు అంటారు?
యేసును శిలువ వేయడానికి కారణాలు ఇవే.. జీసస్ మరణించినా 'గుడ్ ఫ్రైడే' అని ఎందుకు అంటారు?

వీడియోలు

Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam
Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
DC vs MI 1st innings highlights: సూర్య హాఫ్ సెంచరీ, రాణించిన రోహిత్ శర్మ.. అయినా ఢిల్లీ టార్గెట్ 163.. MI బౌలర్లకు కష్టమే
సూర్య హాఫ్ సెంచరీ, రాణించిన రోహిత్ శర్మ.. అయినా ఢిల్లీ టార్గెట్ 163.. MI బౌలర్లకు కష్టమే
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Gajwel Attack: రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
VitalID: ఇక పాస్‌వర్డ్‌లు అవసరం లేదు! కదిలితే చాలు గుర్తిస్తుంది - సరికొత్త టెక్నాలజీ ఇదీ
ఇక పాస్‌వర్డ్‌లు అవసరం లేదు! కదిలితే చాలు గుర్తిస్తుంది - సరికొత్త టెక్నాలజీ ఇదీ
TVK Chief Vijay: CSK మ్యాచ్‌లు పోతున్నా... విజయ్‌కి మాత్రం కలిసి వస్తుంది! స్టేడియం అంతా విజిల్ సౌండ్సే! ఇదో రకం పబ్లిసిటీ!
CSK మ్యాచ్‌లు పోతున్నా... విజయ్‌కి మాత్రం కలిసి వస్తుంది! స్టేడియం అంతా విజిల్ సౌండ్సే! ఇదో రకం పబ్లిసిటీ!
Embed widget