అన్వేషించండి

Boiled Water: మంచి నీళ్ళు పదే పదే వేడి చేస్తున్నారా? అది ఎంత డేంజర్ తెలుసా?

వేడి నీళ్ళు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ నీళ్ళు ఒకటి కంటే ఎక్కువ సార్లు వేడి చేస్తే మాత్రం చాలా ప్రమాదకరం.

మంచి నీళ్ళు వేడి చేసుకుని తాగడం ఎప్పుడూ సురక్షితమే. అది ఆరోగ్యానికి మంచిది కూడా. వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫైయర్లు రాకముందు నేరుగా పంపుల నుంచి వచ్చిన నీటిని బాగా వేడి చేసుకుని వడకట్టుకుని తాగేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది ఉదయం లేవగానే నీళ్ళు వేడి చేసుకుని తాగుతున్నారు. అయితే ఒకసారి వేడి చేసిన నీటిని పదే పదే వేడి చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పంపుల నుంచి వచ్చిన నీటిని వేడి చేసుకుని తాగి మిగతా వాటిని మళ్ళీ దాహంగా అనిపించినప్పుడు వేడి చేస్తూ ఉంటారు కొంతమంది. లేదంటే ఆ మిగిలిపోయిన నీళ్ళలో మరికొన్ని చన్నీళ్ళు కలిపి వేడి చేస్తారు. కానీ నీటిని అన్ని సార్లు వేడి చేయడం వల్ల అందులోని లవణాల సంఖ్య పెరిగిపోతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

నీటిలో ఉండే లవణాలు ఏంటి?

నైట్రేట్స్: కరిగే గుణం కలిగిన ఇది సాధారణంగా హానికరం కాదు. అయితే ఎక్కువ సేపు నీటిని వేడి చేస్తే మాత్రం అవి విషపూరితం అవుతాయి. క్యాన్సర్, లుకేమియా, నాన్ హాడ్కిన్ లింఫోమా వంటి ప్రమాదకరమైన, ప్రాణాంతక వ్యాధులకి కారణం కావచ్చు.

ఆర్సేనిక్: ఇది తక్కువ మొత్తంలో ఉంటే హానికరం కాదు. అయితే ఇది పంపు నీటిలో పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆర్సెనిక్ క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు, మానసిక రుగ్మతలను కలిగిస్తుంది. అధిక మొత్తంలో ఆర్సెనిక్ ఉన్న నీటిని తాగితే అది ప్రసరణ వ్యవస్థతో పాటు చర్మాన్ని కూడా దెబ్బతీస్తుంది.

ఫ్లోరైడ్: పంపు నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బోలు ఎముకల వ్యాధి, పగుళ్లు, నొప్పులు వంటి రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. చిన్న పిల్లల్లో అధిక ఫ్లోరైడ్ వినియోగం వల్ల దంతాల మీద ఎనామిల్ దెబ్బతింటుంది.

కాల్షియం: ఎముకలకి కాల్షియం అవసరం. కానీ నీళ్ళని మరిగించడం వల్ల అందులోని కాల్షియం మొత్తాన్ని పెంచుతుంది. ఇది మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్ళని కలిగిస్తుంది.

లెడ్: సీసం నీటి నుంచి రాదు. ఇది పాత పైపుల నుంచి నీటిలోకి చేరి కలుషితం అవుతుంది. సీసం తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు వస్తాయి.

నీళ్ళు ఎక్కువ సార్లు వేడి చేయడం వల్ల అనార్థాలు

హార్డ్ వాటర్ ని మళ్ళీ మరిగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. సాధారణంగా మంచి నీటిలో వేడి చేసేటప్పుడు గ్యాస్ బుడగలు ఉంటాయి. ఇవి మరిగించే సమయంలో న్యూక్లియేషన్ సైట్ గా పని చేస్తాయి. మళ్ళీ అవే నీటిని వేడి చేయడం వల్ల నీటిలో కరిగిన వాయువులు బయటకి పంపుతుంది. అంతే కాదు వాటి రుచి కూడా మారిపోతుంది. వేడి చేసిన నీటితో తయారు చేసే ఆహారం, పానీయాల రుచిని ప్రభావితం చేస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: బ్యాక్టీరియాలను అడ్డుకునే లిప్‌స్టిక్ ! శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Coconut Water vs Lemon Water : కొబ్బరి నీరు vs నిమ్మరసం.. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏది తాగితే మంచిది?
కొబ్బరి నీరు vs నిమ్మరసం.. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏది తాగితే మంచిది?
Social Media Overuse in Kids : పిల్లలకు సోషల్ మీడియా ముప్పు.. ప్రమాదంలో మానసిక ఆరోగ్యం, వరల్డ్ రిపోర్ట్ షాకింగ్ నిజాలు
పిల్లలకు సోషల్ మీడియా ముప్పు.. ప్రమాదంలో మానసిక ఆరోగ్యం, వరల్డ్ రిపోర్ట్ షాకింగ్ నిజాలు
Eating Eggs vs Egg Hair Mask : జుట్టు పెరగాలంటే గుడ్డు తింటే మంచిదా? లేక మాస్క్ వేస్తేనా? నిపుణుల సూచనలివే
జుట్టు పెరగాలంటే గుడ్డు తింటే మంచిదా? లేదా హెయిర్ మాస్క్‌ వేస్తే ఒత్తుగా పెరుగుతుందా?
Okra Water : బెండకాయలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే షుగర్ తగ్గుతుందా? నెలరోజులు తాగితే కలిగే లాభాలు ఇవే
బెండకాయలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే షుగర్ తగ్గుతుందా? నెలరోజులు తాగితే కలిగే లాభాలు ఇవే

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Budget 2026-27: 3 లక్షల 24 వేల 234 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన మల్లు భట్టివిక్రమార్క
3 లక్షల 24 వేల 234 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన మల్లు భట్టివిక్రమార్క
Telangana Budget 2026-27 Live Updates: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
Ustaad Bhagat Singh Collection Day 1 : ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... వారికి నెలకు 2 వేలు - తెలంగాణ బడ్జెట్ కేటాయింపులివే!
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... వారికి నెలకు 2 వేలు - తెలంగాణ బడ్జెట్ కేటాయింపులివే!
Dhurandhar 2 Collections : ధురంధర్ 2 ఫస్ట్ డేనే 100 కోట్లు - వారం రోజుల్లో ఆ రికార్డ్ బ్రేక్!
ధురంధర్ 2 ఫస్ట్ డేనే 100 కోట్లు - వారం రోజుల్లో ఆ రికార్డ్ బ్రేక్!
Gaddar Awards 2026 : తెలంగాణ గద్దర్ అవార్డ్స్ - బెస్ట్ మూమెంట్స్... ఈవెంట్ హైలెట్స్
తెలంగాణ గద్దర్ అవార్డ్స్ - బెస్ట్ మూమెంట్స్... ఈవెంట్ హైలెట్స్
Eid ul-Fitr 2026: ఈద్-ఉల్-ఫితర్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు!
ఈద్-ఉల్-ఫితర్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు!
Assam Congress troubles: అస్సాం కాంగ్రెస్ అస్సాం - సీనియర్ నేతలంతా బీజేపీ గూటికి - రాహుల్, ప్రియాంక చేతులెత్తేశారా?
అస్సాం కాంగ్రెస్ అస్సాం - సీనియర్ నేతలంతా బీజేపీ గూటికి - రాహుల్, ప్రియాంక చేతులెత్తేశారా?
Embed widget