అన్వేషించండి

Brain Eating Amoeba : స్విమ్మింగ్ పూల్స్‌తో జాగ్రత్త, చిన్నారి మెదడు తినేసిన అమీబా - ఇది సోకితే 18 రోజుల్లోనే మరణం

Naegleria Fowleri Kerala : ఐదేళ్లపాప మెదడు తినే అమీబా సోకి చనిపోయిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. అది సోకితే ఎంత త్వరగా చనిపోతారో తెలిస్తే చాలా షాకింగ్​ ఉంటుంది. అసలు మెదడు తినే అమీబా అంటే ఏంటి?

Naegleria Fowleri Symptoms and Treatment : స్మిమ్మింగ్​ పూల్​లో పడి బాలుడు లేదా బాలిక మృతి అని చూస్తూ ఉంటాము. కానీ స్విమ్మింగ్​ పూల్​లోని నీటితో మెదడు తినే అమీబా సోకి బాలిక మృతి అనేవి రేర్​ కేసులు. అసలు కొందరికి ఇలాంటి ఓ ఇన్​ఫెక్షన్​ ఉంటుందని కూడా తెలియదు. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలిక.. నేగ్లేరియా ఫౌలెరీ(Naegleria Fowleri) అనే బ్రెయిన్​ ఇన్​ఫెక్షన్​తో చనిపోయింది. దీనినే మెదడు తినే అమీబా అంటారు. అసలు ఈ ఇన్​ఫెక్షన్ ఎలా సోకింది? దీనికి ఏమైనా చికిత్స ఉందా? ఎన్నిరోజులు బతుకుతారు? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 

మంచినీటి నదిలో స్నానం చేసేప్పుడు

కేరళలోని ఓ బాలిక.. తన ఇంటికి సమీపంలోని బంధువలు ఇంటికి వెళ్లింది. అక్కడ నదిలో బంధువులతో కలిసి స్నానం చేసింది. ఆ సమయంలోనే బాలికకు ప్రాణాంతకమైన అమీబా సోకినట్లు తెలుస్తోంది. స్నానం తర్వాత బాలికకు తలనొప్పి, వాంతులు కావడంతో.. బంధువులు పేరెంట్స్​కి సమాచారం చేరవేశారు. వారు పాపను వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. బాలిక మాత్రమే కాకుండా మరో నలుగురు చిన్నారులు కూడా ఆస్పత్రిలో చేరారు. వారు తర్వాత డిశ్చార్జ్ అయిపోయారు కానీ.. బాలిక పరిస్థితి మాత్రం విషమించింది. దీంతో ఆమెను కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారంపాటు వెంటిలేటర్​పై ఉండి పాప ప్రాణాలు విడిచింది. 

కేరళలో ఇదేమి కొత్త కేసు కాదు..

ఈ తరహా ఘటన కేరళలో కొత్తేమి కాదు. గత ఏడాది జూలైలో ఓ 15 ఏళ్ల బాలుడు.. తన ఇంటి సమీపంలోని కాలువలో ఈత కొట్టాడు. అతనికి మెదడు తినే అమీబా సోకి వారంలోనే మరణించాడు. అయితే నేగ్లేరియా ఫౌలెరి మంచినీటి సరస్సులు, చెరువులు, అన్​లోరినేటెడ్ కొలనులు, అరుదైన సందర్భాల్లో పంపు నీటిలో కూడా కనిపిస్తుంది. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్​గా అభివృద్ధి చెంది.. ప్రాణాంతకమవుతుంది. కాబట్టి దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

ఎలా వ్యాపిస్తుందంటే(Naegleria Fowleri Causes).. 

మెదడు తినే అమీబా ఇన్​ఫెక్షన్​ నీటి ద్వారా ముక్కు లోపలికి చేరి.. మెదడుకు వెళ్తుంది. తద్వారా ఈ ఇన్​ఫెక్షన్ వస్తుంది. నోటితో మింగడం ద్వారా ఈ వ్యాధి సోకదు. నీటిలో ఆడటం, ఈతకొట్టడం వంటి సందర్భాల్లో ఈ ఇన్​ఫెక్షన్​ ముక్కులోకి చేరుతుంది. కొన్ని సందర్భాల్లో మనం వినియోగించే నీటిలో కూడా ఉండొచ్చు. ఈ ఇన్​ఫెక్షన్​ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు. 

లక్షణాలు ఇవే.. (Naegleria Fowleri Symptoms)

మెదడును తినే అమీబా(నెగ్లేరియా ఫౌలెరి) ఇన్​ఫెక్షన్ సోకితే.. దాని లక్షణాలు ఒకటి నుంచి వారంలో రోజుల్లోపే అభివృద్ధి చెందుతాయి. తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, మెడ నొప్పి, వాంతులు ప్రారంభంలో ఉంటాయి. అనంతరం ఈ లక్షణాలు రోగిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల మూర్ఛ, మతిమరుపు, కోమా, చివరికి ప్రాణాంతకమవుతుంది. CDC ప్రకారం ఈ ఇన్​ఫెక్షన్ సోకిన చాలామంది వ్యక్తలు 18 రోజులలోపే మరణిస్తున్నారని తెలిపింది. 

నివారణ చర్యలు(Naegleria Fowleri Treatment)

ఈ ఇన్​ఫెక్షన్ సోకిన వారిలో మరణాల రేటు 85 కంటే ఎక్కువగా ఉందని ఓ నివేదిక తెలిపింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ప్రాణాంతకమైందో. కాబట్టి నీటి వనరులలో ఈతకు దూరంగా ఉండాలి. పూల్స్, స్ప్లాష్ ప్యాడ్​లు, వాటర్​పార్క్​లలో జాగ్రత్తగా ఉండాలి. అన్​లోరినేటెడ్ వాటర్​ వినియోగం మానుకోవాలి. ముక్కును క్లీన్ చేసుకోవడానికి.. పంపు నీటిని ఉపయోగించకూడదు. ఈత కొట్టే సమయంలో లేదా నీటిలోపల ఉండే సమయంలో ముక్కును మూసుకోవాలి. లేదా క్లిప్స్ ఉపయోగించవచ్చు. దీనివల్ల ఇన్​ఫెక్షన్ సోకదు. 

Also Read : రాత్రుళ్లు త్వరగా నిద్రరావట్లేదా? అయితే ఈ టిప్స్​తో హాయిగా నిద్రపోండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Embed widget