అన్వేషించండి

Menstrual Hygiene Day: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!

రుతుక్రమం రోజుల్లో పరిశుభ్రత చాలా ముఖ్యం. అంతేకాదు, రుతుక్రమం ఉత్పత్తులపై కూడా మీకు అవగాహన ఉండాలి. లేకపోతే, ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది.

మహిళల్లో ఏర్పడే రుతుక్రమం లేదా బహిష్టు.. మూడు రోజులపాటు నరకం చూపిస్తుంది. రక్తస్రావం వల్ల ఆ మూడు రోజులు చాలా బలహీనంగా ఉంటారు. కనీసం పనులు చేసేందుకు కూడా ఓపిక ఉండదు. అలాంటి సమయంలో వారికి విశ్రాంతి అవసరం. కానీ, అది వారికి సాధ్యం కాదు. ఆ రోజుల్లో కూడా పనులన్నీ చక్కబెట్టాలి. ఈ క్రమంలో వారు తమ రుతక్రమం రోజున పాటించాల్సిన పరిశుభ్రతను నిర్లక్ష్యం చేస్తారు. దాని వల్ల బాక్టీరియల్ వాజినైటిస్, ఈస్ట్ ఇన్‌ఫెక్షన్, యూరోజెనిటల్ ఇన్‌ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌లకు గురవ్వుతారు. 

రుతుక్రమం రోజున చాలామంది సాధారణ క్లాత్‌ను ఉపయోగించడం మంచిది కాదు. పరిశుభ్రంగా శానిటరీ నాప్‌కిన్‌లు, మెన్‌స్ట్రువల్ కప్పులు లేదా టాంపాన్‌లను మాత్రమే వాడాలి. ప్యాకింగ్ చేయని రుతుక్రమ ఉత్పత్తులను ఉపయోగించరాదు. శానిటరీ నాప్‌కిన్‌లపై అవగాహనలేని గ్రామీణ ప్రాంత మహిళల్లో చాలామంది సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. ఇన్ఫెక్షన్లకు గురై ఆస్పత్రిపాలవుతున్నారు. కాబట్టి, అవగాహన పొందడటంతోపాటు ఇతరులకు కూడా అవగాహన కలిగించాలి. 

సరైన రుతుక్రమ ఉత్పత్తులు ఉపయోగించండి: ఇటీవల మెన్‌స్ట్రువల్ కప్ వినియోగం బాగా పెరిగింది. ఎందుకంటే ఇది పర్యావరణ అనుకూలమైనది. దీన్ని బయటకు తీసి, ఖాళీ చేసి.. మళ్లీ లోపలికి చొప్పించుకుని ఉపయోగించవచ్చు. వీటిని మళ్లీ మళ్లీ వినియోగించవచ్చు. అయితే, శానిటరీ నాప్‌కిన్‌లతో అది సాధ్యం కాదు. అలర్జీలతో బాధపడేవారు తప్పకుండా శానిటరీ ప్యాడ్‌లు ఉపయోగించాలి. ప్రతి 6-8 గంటలకు ఒకసారి శానిటరీ నాప్‌కిన్‌లను మార్చాలి. తీసేసిన తర్వాత వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయకూడదు. ఏదైనా కవర్ లేదా పేపర్లలో చుట్టి డస్ట్ బిన్‌లో మాత్రమే పాడేయాలి. ఇటీవల ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. షాపుల్లో కొనుగోలు చేసే ప్యాడ్‌లతో దద్దుర్లు, దురద వస్తున్నట్లయితే.. ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్‌లు ఉపయోగించండి.  టాంపోన్‌లను కూడా 8-10 గంటల్లో కంటే ఎక్కువ సేపు ఉపయోగించకూడదు. టాంపోన్ ఎక్కువసేపు ధరించడం వల్ల టాక్సిక్ షాక్ సిండ్రోమ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. 

Also Read: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

మహిళలూ.. ఈ విషయాలు తెలుసుకోండి: 
❂ రుతుక్రమం గురించి మాట్లాడం తప్పుకాదు. దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ప్రతి స్త్రీలో ఏర్పడే సాధారణ ప్రక్రియ ఇది.
❂ పాఠశాల రోజుల నుంచే రుతుక్రమంపై పిల్లలకు అవగాహన కలిగించాలి. 
❂ 10-12 సంవత్సరాల వయస్సులో గల బాలికలకు ఋతు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి.
❂ ఋతుక్రమం సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవలసిన పోషకాహారం, వ్యాయామాల గురించి చెప్పాలి.
❂ ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం, పెల్విక్ వ్యాయామాలు, మెడిటేషన్ వంటివి నేర్పించాలి. 
❂ థైరాయిడ్ అసమతుల్యత లేదా హార్మోన్ల కారణంగా క్రమరహిత రుతుక్రమం మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు.
❂ 3 నుంచి 6 నెలల కంటే ఎక్కువ రోజులు బహిస్టు క్రమరహితంగా ఉంటే తప్పనిసరిగా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.
❂ ఒకసారి ఉపయోగించిన శానిటరీ నాప్‌కిన్ మళ్లీ ఉపయోగించకూడదు. 
❂ శానిటరీ నాప్‌కిన్‌లు పరిశుభ్రమైన ప్రాంతాల్లో మాత్రమే ఉంచాలి. 
❂ బయటకు వెళ్లినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ శానిటరీ నాప్‌కిన్‌లు మీతో ఉంచుకోవాలి. 
❂ రుతుక్రమం సమయంలో యోనిని శుభ్రం చేయడానికి సబ్బులు లేదా ప్రత్యేక ఉత్పత్తులు అవసరం లేదు. నీరు సరిపోతుంది.
❂ యోనిని శుభ్రం చేసే ఉత్పత్తుల ఉచ్చులో పడకండి. వాటిలో రసాయనాలు pH బ్యాలెన్స్‌కు హాని కలిగిస్తాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

టాప్ హెడ్ లైన్స్

Eating on Time : టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Henna for Grey Hair : తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి
తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి
Snoring in Men : గురకను తేలిగ్గా తీసుకోకండి? పురుషుల్లో అది స్లీప్ అప్నియా కావచ్చు.. ఈ సంకేతాలను గమనించండి
గురకను తేలిగ్గా తీసుకోకండి? పురుషుల్లో అది స్లీప్ అప్నియా కావచ్చు.. ఈ సంకేతాలను గమనించండి
Calcium and Protein Rich Foods : కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget