అన్వేషించండి

సింగిల్స్ అంటే అంత చులకనా? బాస్‌ అలా అన్నాడని ఉద్యోగాన్నే వదిలేశాడు - ఇంతకీ ఏమైంది?

మీరు సింగిలా? అయితే, తప్పకుండా మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. లేదా ఏదో ఒక రోజు ఈ పరిస్థితి మీకూ రావచ్చు.

అతడికి ఇంకా పెళ్లి కాలేదు. సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. పెద్దగా బాధ్యతలు లేకపోవడం వల్ల.. పనులు కూడా ఏమీలేవు. అదే అతడికి శాపమైంది. సింగిల్‌గా ఉండటం వల్ల తోటి ఉద్యోగులకే కాదు.. బాస్‌కు కూడా లోకువయ్యాడు. ఇంకేముంది.. ఆ ఆఫీసులో అతడే ఆటబొమ్మయ్యాడు. చివరికి అక్కడి పరిస్థితులు అతడు తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి దారితీశాయి. 

ఇటీవల రెడ్డిట్‌లో Feggy_JVS అనే ఓ యూజర్ (ఫెగ్గీ) తన బాస్‌తో జరిగిన చాటింగ్ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేశాడు. తన బాస్ నిత్యం ఎలా వేదిస్తున్నాడో చూడండని తెలిపాడు. ఓ రోజు తన బాస్ మార్నింగ్ 7 గంటల షిఫ్ట్‌కు రావాలని కోరాడు. అయితే, ఆ షిఫ్ట్‌కు ప్రిపేర్ అవ్వడం కోసం 6.15 గంటలకే ఆఫీసులో ఉండాలని చెప్పాడు. దీంతో ఫెగ్గి తనకు ఆ రోజ్ డే ఆఫ్ అని, తనకు బదులు బ్రాన్‌(మరో ఉద్యోగి)కి ఆ షిఫ్ట్ వేయగలరా? అని అడిగాడు. అయితే, బ్రాన్‌కు పెళ్లై, పిల్లలు ఉన్నారని.. ఇప్పటికిప్పుడు అతడిని ఆ షిఫ్ట్‌లో పనిచేయమని చెప్పడం కుదరదని బాస్ తెలిపాడు. 

‘‘నువ్వు సింగిలే కదా? నువ్వు ఎందుకు ఆ షిఫ్ట్‌కు రాలేవు?’’ అని బాస్ అడిగాడు. ఇందుకు ఫెగ్గీ సమాధానమిస్తూ.. ‘‘నాకు వారంలో ఒకే డే ఆఫ్ దొరుకుతుంది. నాకు కొన్ని పనులు ఉన్నాయి. నా ఫ్రెండ్ ఇల్లు మారుతున్నాడు. వాడికి సాయం చేయడానికి వెళ్తున్నా’’ అని చెప్పాడు. ఈ సమాధానం విని బాస్‌ మరింత రెట్టించాడు.. రావల్సిందేనని పట్టుబట్టాడు. ‘‘నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తానో మీకు తెలుసు. కాబట్టి, నా పనికి, నాకు విలువను ఇవ్వండి’’ అని ఫెగ్గి సమాధానం ఇచ్చాడు. 

దీంతో అతని బాస్ మాటలు కాస్త సరిగ్గా రానివ్వు అని ఘాటుగా హెచ్చరించాడు. నువ్వు డబ్బుకోసమే పనిచేస్తున్నావని నాకు తెలుసంటూ మరింత రెచ్చగొట్టాడు. దీంతో ఆ ఫెగ్గీకి చిర్రెత్తుకొచ్చింది. నేను రాజీనామా చేస్తున్నా, ఈ మెసేజ్‌ను మీరు రెండు వారాల నోటీసుగా పరిగణించాలని రిప్లై ఇచ్చాడు. తన రాజీనామాను అంగీకరించకపోతే.. సోమవారం ఆఫీసుకు వచ్చి కలుస్తానని చెప్పాడు.

ఫెగ్గీ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో 

ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెలవు రోజుల్లో ఉద్యోగిని ఆఫీసుకు పిలవడం రూల్స్‌కు వ్యతిరేకమని, ఆ రోజు పనిచేయడాని ఉద్యోగిని రిక్వెస్ట్ చేయాలేగానీ.. ఆర్డర్ వేయకూడదని అంటున్నారు. పైగా సింగిల్స్ అంటే మరీ అంత చులకనా? వాళ్లు మనుషులు కాదా? వారికి తల్లిదండ్రులంటూ.. ఇంటి పనులంటూ ఉండవని అనుకుంటున్నారా? అని మండిపడుతున్నారు. సింగిల్స్‌ను, పెళ్లయినవారిని విడదీసి చూడకూడదని.. పని విషయంలో ఎవరైనా ఒకటేనని అంటున్నారు. ప్రతి ఉద్యోగి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని.. మీరు వారం మొత్తం శ్రమిస్తున్నందుకు సంస్థ ఒక్క రోజైనా మీకు విశ్రాంతి ఇవ్వాలని అంటున్నారు. మరి, దీనిపై మీరు ఏమంటారు? మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా?

Also Read: అబ్బాయిలూ ఈ పనులు చేస్తున్నారా? మీ మగతనం మటాషే!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Fatty Liver Diet : ఫ్యాటీ లివర్ సమస్య ఉందా? కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. రోజూ తాగితే మంచిదేనా?
ఫ్యాటీ లివర్ సమస్య ఉందా? కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. రోజూ తాగితే మంచిదేనా?
Winter Health Tips for Kids : పిల్లలకు చలికాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. పేరెంట్స్ ఫాలో అయిపోండి
పిల్లలకు చలికాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. పేరెంట్స్ ఫాలో అయిపోండి
Eating on Time : టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Henna for Grey Hair : తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి
తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
ONGC Gas Leak: అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
Embed widget