అన్వేషించండి

Lung Health : ఇంట్లోనే ఊపిరితిత్తులను డీటాక్స్ చేసుకోండిలా.. ప్రతీరోజూ వీటిని తాగితే లంగ్స్​కి మంచిదట

Detox Your Lungs Naturally : ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, వాటి సహజ శుభ్రపరిచే ప్రక్రియకు మద్దతు ఇవ్వడానికి.. ఆవిరి పట్టడం, కొన్ని సాధారణ అలవాట్లతో పాటు ఈ డ్రింక్ తీసుకుంటే మంచిదంటున్నారు

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కాలుష్యం, ధూళి ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి; వాటి ఆరోగ్యం ముఖ్యం.
  • గోరువెచ్చని నీరు, అల్లం టీ, నిమ్మరసం శ్లేష్మాన్ని పలుచపరుస్తాయి.
  • ఆవిరి పట్టడం, పొగతాగడం మానేయడం శ్వాసకోశాన్ని శుభ్రపరుస్తాయి.

Best Drinks for Lung Health : ఇంట్లోనే ఊపిరితిత్తులను డీటాక్స్ చేసుకోండిలా.. ప్రతీరోజూ వీటిని తాగితే ఎంత మంచిదో తెలుసా?
ఈరోజుల్లో దుమ్ము, పొగ, కాలుష్యం, సిగరెట్ పొగ సర్వసాధారణంగా మారిపోయాయి. తప్పించుకోలేని ఇలాంటి వాతావరణంలో ఎక్కువకాలం ఉంటే కచ్చితంగా ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది. ఇవి ఊపిరితిత్తులతో పాటు ఇతర శరీర భాగాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పలు పరిశోధనలు చెప్తున్నాయి. అందుకే చాలామంది లంగ్స్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని.. శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. 

ఊపిరితిత్తులను శుద్ధి చేసుకోవడానికి చాలామంది వివిధ పానీయాల వైపు మొగ్గు చూపుతారు. అయితే ఏ ఒక్క డ్రింక్ కూడా ఊపిరితిత్తులను పూర్తిగా శుభ్రపరచదు. కానీ రెగ్యులర్​గా తీసుకుంటే లంగ్స్ ఆరోగ్యానికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సహజమైన డ్రింక్స్ ఏంటో.. వాటిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. 

Also Read : స్మోకింగ్ తర్వాత ఊపిరితిత్తులను డీటాక్స్ చేయగలమా? లంగ్స్ హెల్తీగా ఉంచే సింపుల్ టిప్స్

లంగ్స్ క్లెన్సింగ్..

మన ఊపిరితిత్తులు కూడా సహజమైన శుభ్రపరిచే ప్రక్రియ ద్వారా.. దుమ్ము, ఇతర కాలుష్య కారకాలను బయటకు పంపుతాయి. ఇవి అలా పనిచేయాలంటే మన డైలీ లైఫ్​లో కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. పుష్కలంగా నీరు తాగడం నుంచి.. డైట్లో పోషకమైన ఆహారాలను చేర్చుకోవడం, స్మోకింగ్ మానేయడం వంటి ఉంటాయి. అలాగే ఇంట్లోనే ఊపిరితిత్తులను డిటాక్స్ చేయడానికి హెల్ప్ చేసే సులభమైన పానీయాలు తీసుకోవచ్చు. అవేంటంటే.. 

గోరువెచ్చని నీరు

గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అవ్వడమే కాకుండా.. ఊపిరితిత్తులు, శ్వాసనాళాలలో ఉండే శ్లేష్మాన్ని పలుచగా చేయడానికి కూడా సహాయం చేస్తుంది. దీనివల్ల శ్లేష్మాన్ని బయటకు పంపడం సులభతరం అవుతుంది. దీనివల్ల శ్వాసనాళాలు శుభ్రంగా మారవచ్చు. ప్రతిరోజూ తగినంత నీరు తాగడం వల్ల ఊపిరితిత్తుల సహజంగా శుభ్రపరిచే ప్రక్రియకు మద్దతు అందుతుంది. 

Also Read : స్మోకింగ్ చేయని వారిలో వేగంగా పెరుగుతోన్న లంగ్స్ క్యాన్సర్.. అసలైన కారణాలు వెల్లడించిన నిపుణులు

అల్లం టీ

అల్లంలోని సహజ సమ్మేళనాలు శరీరంలో వాపును తగ్గించడానికి సహాయపడతాయి. గోరువెచ్చని నీటిలో అల్లం కలుపుకుని తాగడం వల్ల గొంతుకు ఉపశమనం లభిస్తుంది. ఇది తేలికపాటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. అందుకే అల్లాన్నీ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి తోడ్పడే ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. 

నిమ్మరసం

నిమ్మకాయలలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. డీహైడ్రేషన్‌ను తిరిగి నింపడానికి నిమ్మరసం ఒక సులభమైన మార్గంగా చెప్పవచ్చు. శరీరానికి తగినంత నీరు అందించడం దాని సహజ శుభ్రపరిచే ప్రక్రియకు సహాయపడుతుంది. కాబట్టి నిమ్మరసం ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా మేలు చేసే డ్రింక్​గా పరిగణిస్తారు. 

Also Read : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం

ఆవిరి పట్టడం..

వేడి నీటి ఆవిరి శ్వాసనాళాల్లోని శ్లేష్మాన్ని వదులు చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల శ్లేష్మాన్ని బయటకు పంపడం సులభమవుతుంది. ముక్కు లేదా గొంతు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆవిరిని ఒక సులభమైన ఇంటి చికిత్సగా పరిగణించవచ్చు.

స్మోకింగ్​కి చెక్..

ఊపిరితిత్తుల సహజ శుభ్రతను కాపాడుకోవడానికి, వాటిని హానికరమైన పదార్థాల నుండి రక్షించడం చాలా ముఖ్యం. అందుకే సిగరెట్, పొగాకు పొగకు దూరంగా ఉండాలి. అధిక కాలుష్యం ఉన్న ప్రాంతాలలో మాస్క్ ధరిస్తే మంచిది. అలాగే ప్రతిరోజూ కొంత వ్యాయామం చేయడం, పుష్కలంగా నీరు తాగడం, హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 

Also Read : రోజూ ఆకుకూరలు తినడం ఊపిరితిత్తుల(Lungs)కు మంచిదేనా? కొత్త అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
MS Dhoni Retirement:  ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
Tirumala News: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
Embed widget