IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Brain Stroke: ఈ అలవాట్లే... మెదడు స్ట్రోక్‌కు కారణమవుతాయి

మన అలవాట్లే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. కొన్ని రకాల హానికర అలవాట్లు బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారి తీస్తాయి.

FOLLOW US: 

ఆధునిక జీవనశైలి అనేక రోగాలకు కారణం అవుతోంది. అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి, చెడు అలవాట్లు ఇవన్నీ ప్రాణాంతక వ్యాధులకు కారణం అవుతున్నాయి. వీటిలో  బ్రెయిన్ స్ట్రోక్  కూడా ఒకటి. మెదడులోని వివిధ భాగాలకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు, మెదడు కణజాలానికి ఆక్సిజన్, పోషకాలు అందక స్ట్రోక్ కి దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆరోగ్యపరంగా, ఆహారపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల అలవాట్లను వదిలేయాలి. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో జాన్ హాప్కిన్స్ మెడిసిన్ పరిశోధకులు వివరిస్తున్నారు. 

1. మహిళలు అధికంగా గర్భనిరోధక మాత్రలు వాడడం వల్ల వారిలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గర్భనిరోధక మాత్ర లేదా ప్యాచ్ లలో ఈస్ట్రోజన్ హార్మోన్  అధికంగా ఉండి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి గర్భనిరోధకంగా లూప్ లేదా కండోమ్ వంటి పద్ధతులు పాటించడం ఉత్తమం.

2.  ధూమపానం హానికరమని తెలిసినా చాలా మంది ఆ అలవాటును వదులుకోలేకపోతున్నారు. కనీసం తగ్గించుకున్నా ఎంతో కొంత ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారు అవతారు. సిగరెట్ తాగడం వల్ల ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే అవకాశం రెట్టింపు అవుతుంది. శ్వాసక్రియ పనితీరు కూడా ప్రభావితం అవుతుంది. గుండె ఆరోగ్యం చెడిపోతుంది. 

3. ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా గంటల తరబడి కూర్చునే వాళ్లకి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. దీని వల్ల బరువు అధికంగా పెరగి కొన్ని పెద్ద జబ్బులకు కారణంగా మారుతుంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం. 

4. అతిగా ఆల్కహాల్ తాగడం వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొంతమంది ఉదయం నుంచే తాగడం మొదలుపెడతారు. ఇలాంటి వారికి భవిష్యత్తులో స్ట్రోక్ వచ్చే ముప్పు ఎక్కువే. 

5. కొన్ని రకాల వైద్య పరిస్థితులు కూడా బ్రెయిన్ స్ట్రోక్ కు కారకాలుగా మారతాయి. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, గుండె దడ వంటి వాటి వల్ల కూడా కలగవచ్చు. అయితే వీటిని చికిత్స ద్వారా నియంత్రించవచ్చు. కానీ కుటుంబచరిత్రలో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఉంటే అడ్డుకోవడం కష్టమే. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు. 

Also read: కాఫీ అధికంగా తాగుతున్నారా... ఆల్కహాల్ కంటే ప్రమాదం

Also read: పెరుగుతో పాటూ వీటిని తింటే... ఎంత ఆరోగ్యమో

Also read: మనీ ప్లాంట్ లేదా కాయిన్ ప్లాంట్... రెండింటిలో ఏది పెంచితే మీ ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయి?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Oct 2021 02:21 PM (IST) Tags: Good Habits Brain stroke Lifestyle Habits Stroke risk

సంబంధిత కథనాలు

High Blood Pressure: ఈ  పండు రసంతో అదుపులో అధిక రక్తపోటు, రోజూ తాగితే ఎంతో మేలు

High Blood Pressure: ఈ పండు రసంతో అదుపులో అధిక రక్తపోటు, రోజూ తాగితే ఎంతో మేలు

Vitamin Deficiency: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు

Vitamin Deficiency: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు

HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు

HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు

Protein Laddu: పిల్లలకు రోజూ ఒక ప్రొటీన్ లడ్డూ, ఎలా చేయాలంటే

Protein Laddu: పిల్లలకు రోజూ ఒక ప్రొటీన్ లడ్డూ, ఎలా చేయాలంటే

Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ

Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ

టాప్ స్టోరీస్

MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్

MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్

NTR: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ

NTR: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ

PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video

PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video

Hyderabad Honour Killing Case: అవమానం తట్టుకోలేని సంజన ఫ్యామిలీ, పక్కా ప్లాన్‌తో నీరజ్‌ పరువు హత్య - రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు ఇవే

Hyderabad Honour Killing Case: అవమానం తట్టుకోలేని సంజన ఫ్యామిలీ, పక్కా ప్లాన్‌తో నీరజ్‌ పరువు హత్య -  రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు ఇవే