అన్వేషించండి

Choosing a Neighborhood : ఇల్లు కొనేముందు, అద్దెకు తీసుకుంటున్నప్పుడు ఇవి మైండ్​లో ఉండాలి

Neighborhood Saftey : ఇల్లు కొనాలన్నా.. అద్దెకు తీసుకోవాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. 

Perfect Neighborhood : అవసరాల రీత్యా కొన్నిసార్లు కొత్త ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే ఇతర కారణాల వల్ల ఇల్లు మారడమో.. కొత్త ఇల్లు కొనుక్కోవడమో చేస్తుంటారు. అలాటంప్పుడు మీరు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే మీరు పెట్టిన పైసలు వృథ్యా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు సొంత ఇల్లు కొనాలనుకున్నా.. అద్దె ఇంటికి మారుతున్నా లొకేషన్​ ఎంచుకోవడంలో కొన్ని ఛాయిస్​లు ఉంచుకోవాలి. చిన్న చిన్న విషయాలు విస్మరిస్తే అవి మీకు కచ్చితంగా తలనొప్పిగా మారుతాయి. కాబట్టి మీరు సామరస్యంగా, సంతృప్తికరమైన వాతావరణాన్ని పొందేందుకు ఏయే విషయాలు పరిగణలోకి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఖాళీ ప్లాట్లు..

కొత్త ప్లాట్లు సంగతి ఎలా ఉన్నా.. కొన్నిసార్లు జప్తు చేసినా, ఖాళీ స్థలాలో, చుట్టు పక్కల ఎవరూ లేని ప్రాంతాల్లో ఉండే ఇళ్లను అవాయిడ్ చేయండి. దగ్గర్లో ఉంది కదా అనో.. తక్కువ ఖర్చుకే వచ్చేస్తుంది కదా అనో ఇలాంటి వాటిని తీసుకోకూడదు.

ఎందుకంటే వాడని గృహాలు, ఖాళీ స్థలాలు వ్యాపార అభివృద్ధి లేనివి, ఆస్తి విలువలు పడిపోవడం వల్ల మిలిగిలిపోయినవి అయి ఉంటాయి. లేదంటే ఏదో అశుభకార్యం జరగడం వల్ల కూడా వాటిలోకి ఎవరూ రాకపోయి ఉండొచ్చు. కాబట్టి మీరు అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. 

ప్రయాణ దూరం..

మీరు ఆఫీస్​ లేదా కాలేజ్​కి వెళ్లాల్సిన వారు అయితే కచ్చితంగా మీరు ఇంటిని ఎంచుకునే ప్రాంతం దానికి దగ్గర్లో ఉండేలా చూసుకోవాలి. లేదంటే ప్రయాణ దూరం గురించి ఆలోచించాల్సి అవసరం ఎంతో ఉంది. 

మీరు డ్రైవ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే.. బస్సులు, లోకల్ ట్రైన్స్, మెట్రో వంటి ప్రదేశాలు మీకు అందుబాటులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. షాప్స్, పబ్లిక్ పార్కులు, పాఠశాలలు, ఉపాధి స్థలాలకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకోండి. ఇది మీ రాకపోకలను, జీవన విధానాన్ని సులభతరం చేస్తుంది. 

వినోద సౌకర్యాలు

పొరుగువారి సౌకర్యాన్ని డిస్టర్బ్ చేయని కమ్యూనిటీలు ఎంచుకుంటే మంచిది. ఇది మీకు ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన జీవనశైలిని అందిస్తుంది. కమ్యూనిటీలో పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ ఉండేవాటిని ఎంచుకోవచ్చు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు అలా నడకకు వెళ్లినా.. కాసేపు మొక్కల దగ్గర కూర్చోవాలనుకున్నా సౌకర్యంగా ఉండే ప్రాంతాలను ఎంచుకోండి. పిల్లలు ఉంటే గేమ్స్ ఆడేందుకు అనువైన ప్రదేశాలు ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి.

పొరుగువారి విషయంలో..

మీరు ఒక్కరే ఉన్నా.. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి ఉన్నా.. పొరుగువారి విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడుండే వారు ఎలాంటి వారు.. ఏమైనా ఇబ్బందులు కలిగిస్తారా? పార్టీల పేరుతో సౌండ్స్, చెత్త వేసే వారు ఉన్నారా అనే విషయాలు తెలుసుకోవాలి. మీరు ఇంటికోసం వెళ్లే సమయంలోనే చుట్టు పక్కన పరిసర ప్రాంతాలు క్లీన్​గా ఉన్నాయో లేదో చూడండి. ఇవే మీకు సగం ఇన్​ఫర్​మేషన్ ఇస్తాయి. 

పెట్స్ ఫ్రెండ్లీ..

మీకు పెంపుడు జంతువుల పట్ల ఆసక్తి ఉంటే.. మీరు కచ్చితంగా పెట్స్ ఫ్రెండ్లీ ప్లేస్​ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు తీసుకునే ప్లేస్ వాటికి అనువైనదో కాదో ముందే గుర్తించండి. ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో పెట్స్​ని అనుమతించవు. లేదంటే మీ ఇంట్లో ఎక్కువ డబ్బులు చెల్లించమని అడగవచ్చు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే ముందే మాట్లాడుకుంటే తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 

కాబట్టి మీరు ఇల్లు మారాలనుకునేప్పుడు ఈ విషయాలు కచ్చితంగా పరిగణలోకి తీసుకోండి. చివర్లో ఏది పడితే అది దొరికుతుందిలే కదా అని లేట్​ చేసి ఇల్లు మారితే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

Also Read : టెస్ట్​ కన్నా ముందే గర్భవతి అవునో కాదో తెలుసుకోవచ్చట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Embed widget