అన్వేషించండి

Kavitha Saree Trends: కవిత మేకోవర్‌ రహస్యమేంటి? పట్టు చీరల నుంచి చేనేత వైపు మారిన తెలంగాణ ప్రజా జాగృతి అధ్యక్షురాలు!

Kavitha Saree Trends: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీతో వస్తున్న కవిత తన ఆహారాన్ని పూర్తిగా మార్చేశారు. చేనేత చీరలు కట్టుకుంటున్నారు. మట్టిగాజులు వేసుకుంటూ కొత్త సందేశం ఇస్తున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కవిత, కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ప్రజా జాగృతితో రాజకీయాల్లోకి.
  • సామాన్యులకు దగ్గరవ్వడానికి కవిత తన వస్త్రధారణ మార్చారు.
  • చేనేత చీరలు, మట్టి గాజులతో గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నారు.
  • గతంలో ఖరీదైన దుస్తులు, ఇప్పుడు చేనేతపై దృష్టి సారించారు.

Kavitha Saree Trends: కేసీఆర్ కుమార్తెగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కల్వకుంట్ల కవిత సరికొత్త ప్రయాణం ప్రారంభించారు. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పరీక్షలు సిద్ధమయ్యారు. దీని కోసం గత ఏడాది నుంచి ఆమె గ్రౌండ్ వర్క్ చేశారు. పార్టీలో తనకు సరైన గౌరవం లేదని గ్రహించినప్పటి నుంచి తన స్టైల్ మొత్తం మార్చేశారు. పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత తన ఆహార్యాన్నే పూర్తిగా మార్చేశారు. సామాన్యురాలి మాదిరిగా కనిపించేందుకు ప్రజల్లో ఒకరిగా గుర్తింపు పొందేందుకు మేకవోవర్ అయ్యారు. 

Image

స్టైల్ మార్చిన కవిత 

భారత్ రాజకీయాల్లో ఒక లీడర్‌ వేషధారణ కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు అది ప్రజలకు పంపే బలమైన సందేశం. మహాత్మాగాంధీ నుంచి నేటి తరం నాయకుల వరకు ప్రతి ఒక్కరూ తమ వస్త్రధారణ ద్వారా ఒక నిర్దిష్టమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే కవిత కూడా తన స్టైల్ మార్క్ సృష్టించే పనిలో ఉన్నారు. 

Image

ప్రజలకు చేరువయ్యేందుకు సామాన్యురాలిలా...

గతంలో ఖరీదైన పట్టు చీరలు, విదేశీ బ్రాండెడ్ వారీలు, స్టైలీష్ హెయిర్ స్టైల్స్‌తో కనిపించిన కవిత ఇప్పుడు తన లుక్‌ను లోకల్‌గా మార్చుకున్నారు. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ప్రజలకు మరింత చేరువ కావడమే. తాను ధరించే చీరకట్టు వల్ల సామాన్య ప్రజలు తనను తమలో ఒకరిగా భావిస్తారని ఎవరైనా ధైర్యంగా వచ్చి తనతో మాట్లాడగలుగుతారని ఆమె భావన. 

Also Read: కవిత పార్టీ ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ - సెంటిమెంట్లు లేని రాజకీయాలే - కేటీఆర్ తట్టుకోగలరా?

పూర్తిగా మేకవోర్ మార్చేసిన కవిత 

కవిత తన రాజకీయ ప్రస్థానం ప్రారంభంలో డిజైనర్ శారీలు, ఖరీదైన వాచ్‌లు ధరించేవారు. ఒక సందర్భంలో ఆమె తాను కట్టుకున్న వాచ్‌ ఖరీదు 25 లక్షల వరకు ఉంటుందని చెప్పడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. విదేశాల నుంచి తెప్పించిన కాస్మోటిక్స్, ఖరీదైన పట్టు చీరలు లేటెస్ట్ చెప్పులు ఆమె ఆహార్యంలో అంతర్భాగంగా ఉండేవి. రోజుకు రెండు మూడు కార్యక్రమాలు ఉన్నా, సందర్భాన్ని బట్టి ఆమె తన మేకోవర్ మార్చుకునే వారు. 

Kavitha Saree Trends: కవిత మేకోవర్‌ రహస్యమేంటి? పట్టు చీరల నుంచి చేనేత వైపు మారిన తెలంగాణ ప్రజా జాగృతి అధ్యక్షురాలు!

చేనేత చీర- మట్టి గాజులు 

అయితే బీఆర్‌ఎస్‌లో విభేదాల వల్ల జనం బాట పేరుతో జిల్లాల పర్యటనలు చేపటినప్పటి నుంచి ఆమె శైలిలో స్పష్టమైన మార్పు వచ్చింది. విలాసవంతమైన వస్తువుల స్థానంలో సింప్లిసిటీకి ఆమె పెద్దపీట వేస్తున్నారు. ఇప్పుడు ఆమె చేతులకు ఖరీదైన వాచీలు కనిపించడం లేదు. వాటి స్థానంలో సాధారణ మట్టి గాజులు వచ్చాయి. ఈ మార్పు కేవలం బాహ్య రూపానికే పరిమితం కాలేదు. ప్రజలతో ఆమె సంభాషించే విధానంలో మార్పు కనిపిస్తోంది. 

Kavitha Saree Trends: కవిత మేకోవర్‌ రహస్యమేంటి? పట్టు చీరల నుంచి చేనేత వైపు మారిన తెలంగాణ ప్రజా జాగృతి అధ్యక్షురాలు!

కొప్పునకు ప్రాధాన్యత 

కవిత తన హెయిర్‌స్టైల్‌ విషయంలో కూడా కీలక మార్పులు చేశారు. గతంలో  జుట్టును లూజ్‌గా వదిలేసి లేకా రకరకాలైన హెయిర్ స్టైల్‌లో కనిపించేవారు. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దంపట్టే కొప్పు పెట్టుకుంటున్నారు. పల్లెటూరి మహిళల జీవనశైలిలో కొప్పునకు ప్రాధాన్యత ఇచ్చే దృష్టితో ఆమె తన స్టైల్ మార్చేశారు. ఇది ప్రజల్లో ఆమె పట్ల ఒక ఆత్మీయ భావన కలిగిస్తోందని ఆశిస్తున్నారు. 

Also Read: ఏప్రిల్ 25 సీతానవమి రోజు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం! సవాళ్లు దాటుకుని సత్తాచాటుతారా? ఈ ముహూర్తం వెనుక రహస్యమేంటి?

ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నాలు 

కవిత కేవలం రాజకీయ నాయకురాలిగానే కాకుండా చేనేత రంగానికి అండగా నిలబడ్డారు. జాగృతి సంస్థ ద్వారా చేనే కార్మికుల సంక్షేమానికి కార్యక్రమాలు చేపట్టారు. చేనేత చీరలు ధరించడం ఆనేది కేవలం వస్త్రధారణ మాత్రమే కాదు, పది మంది ఫాలో అయితే చేనేత వస్త్రాలకు గిరాకీ పెరుగుతుందని ఆమె భావన. ఆమె వార్డ్‌రోబ్‌లో కాటన్,సిల్క్ , షిఫాన్ చీరలు కూడా ఉంటాయి. రాజకీయ పర్యటనల్లో మాత్రం ఆమె ఎక్కువ చేనేత వస్త్రాలకే ప్రాధాన్యత ఇస్తారు. జయలలిత, మమతా బెనర్జీ మాదిరిగానే తనకూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకుంటున్నారు. అ దిశగానే మేకవోర్ అయ్యారు. 

Image

సోషల్ మీడియాలో ట్రోల్స్‌

ఇటీవల తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థానికి కవిత హాజరైనప్పుడు ధరించిన చీర రంగులపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఆమె ధరించిన చీర రంగులు కాంగ్రెస్ పార్టీ జెండా రంగులను పోలి ఉండటంతో ఆమె త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఆమె ప్రత్యర్థులు ట్రోల్ చేశారు. 

Kavitha Saree Trends: కవిత మేకోవర్‌ రహస్యమేంటి? పట్టు చీరల నుంచి చేనేత వైపు మారిన తెలంగాణ ప్రజా జాగృతి అధ్యక్షురాలు!

సందర్భానికి తగ్గుట్టు కట్టూబొట్టు 

కవిత వివిధ సందర్భాల్లో ధరించిన చీరలు ఎంతో పాపులర్ అయ్యాయి. ఆయుత చండీ మహాయాగం చేసిన తొలి రోజు పసుపు రంగు ఇక్కత్ సిల్క్ చీర, రెండో రోజు గులాబీ రంగు సిల్క్ చీర, మూడో రోజు తెలుపు రంగు సిల్క్ చీరతో ఆమె ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించారు. తన తండ్రి పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు జట్టు వెనక్కి ముడివేసి చేనేత చీరలో ఒక గంభీరమైన లుక్‌తో కనిపించారు. 

Frequently Asked Questions

కవిత తన రూపాన్ని ఎందుకు మార్చుకున్నారు?

ప్రజలకు మరింత చేరువ కావడానికి మరియు సామాన్యురాలిగా గుర్తింపు పొందడానికి కవిత తన రూపాన్ని మార్చుకున్నారు. ఇది ప్రజలు తనతో సులభంగా సంభాషించడానికి సహాయపడుతుందని ఆమె భావిస్తున్నారు.

కవిత గతంలో ఎలాంటి దుస్తులు ధరించేవారు?

గతంలో కవిత ఖరీదైన పట్టు చీరలు, విదేశీ బ్రాండెడ్ వస్తువులు, స్టైలిష్ హెయిర్ స్టైల్స్ మరియు ఖరీదైన వాచీలు ధరించేవారు.

కవిత తన వేషధారణలో ఎలాంటి మార్పులు చేసుకున్నారు?

కవిత ఇప్పుడు చేనేత చీరలు, మట్టి గాజులు ధరిస్తున్నారు మరియు తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దంపట్టే కొప్పు పెట్టుకుంటున్నారు.

చేనేత చీరలు ధరించడం వెనుక కవిత ఉద్దేశ్యం ఏమిటి?

చేనేత చీరలు ధరించడం ద్వారా చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వాలని, వాటికి గిరాకీ పెంచాలని కవిత భావిస్తున్నారు. అలాగే, ఇది తనకోసం ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టిస్తుందని ఆమె ఆశిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget