News
News
X

మీ షాంపూలో గుడ్డు ఉందా ! అది ఎందుకు వాడతారు? అన్ని షాంపూల్లోనూ గుడ్డు కలుపుతారా !

చాలా రకాల జట్టు సమస్యలకు కోడిగుడ్డు చెక్‌ పెడుతుంది. మన జట్టు ధృడంగా ఉండేందుకు కోడిగుడ్డులో ఉండే ప్రోటీన్లు, మాంసకృత్తులు చాలా బాగా ఉపయోగపడుతాయి.

FOLLOW US: 
Share:

ఓ వాలు జడా మల్లెపూల జడా
ఓ పాము జడా సత్యభామ జడా
నువలిగితే...నాకు దడా
ఓ పట్టు జడా రసపట్టు జడా
బుసకొట్టు జడా నసపెట్టు జడా
ఇప్పుడేందుకే ఈ రగడా.... అంటూ అందమైన, పొడవాటి జడపై ఎంతో సినీ రచయితలు ఎన్నో పాటలు, కవిత్వాలు, రాశారు. మహిళల అందాన్ని రెట్టింపు చేయడంలో వారి జుట్టుది కీలక పోషిస్తుందనడం ఎలాంటి సందేహం లేదు. పొడవాటి జుట్టును చూసి వివాహాలు చేసుకున్న వారు, ప్రేమించిన వారు కూడా ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో పెరిగిన పొల్యూషన్‌, మార్కెట్‌లోకి వచ్చిన చిత్రవిచిత్రమైన షాంపూలను వాడిన అమ్మాయిలకే కాదు అబ్బాయిలను సైతం వెంటాడుతున్న సమస్య ఏదైన ఉందంటే.. అది జుట్టు రాలిపోవడం, చుండ్రు, సన్నని వెంట్రుకలుగా మారడమనే చెప్పాలి. మనలో చాలా మందికి ఈ సమస్యలు ఉంటాయి. ఇక ఈ సమస్య నుంచి బయటపడేందుకు జుట్టుకు ఖరీదైన షాంపులు వాడటం, కొత్త కొత్త హెయిర్ ఆయిల్స్‌ను అప్లై చేస్తూ.. ఎక్స్‌పర్‌మెంట్‌ చేస్తుంటారు. కానీ మన జుట్టు సమస్యకు కచ్చితంగా చెక్‌ పెడతాయా.? అంటే ఆ విషయం కూడా షూర్‌గా చెప్పలేము.

ఇక తరచుగా జుట్టును షాంపో వాష్‌ చేయడం వల్లనే జుట్టు రాలడం, పొడిబారిపోవడం వంటివి జరుగుతున్నాయని చాల రోజుల పాటు తల స్నానం చేయడం ఆపుతారు. అయితే నిజానికి జుట్టు వెలిసిపోకుండా ఉండాలంటే ఎక్స్‌పర్ట్స్‌ సహాయంతో సరైన ఆయిల్స్, షాంపులు ఎంపిక చేసుకుంటే మంచిది. రసాయనాలు ఉండే షాంపూలకు దూరంగా ఉంటూ.. యాంటీ ఎయిర్ ఫాల్ షాంపులు మంచి ఫలితాలను ఇస్తాయి. బొటానిక్ నోరిష్ రీప్లెనిష్ షాంపూ సల్ఫేట్‌తో పాటు పారాబెన్ వంటి కఠినమైన రసాయనాలు ఉండే షాంపూలకు దూరంగా ఉండాలి. అయితే ఎన్నో మంచి ప్రోటీన్స్‌ ఉండే గుడ్డు మన ఆరోగ్యానికే కాదు.. మన జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. గుడ్లు తినడం వల్ల ప్రొటీన్ లోపాన్ని దూరం చేసుకోవచ్చు. అంతేకాదు శీతాకాలంలో ఇది జుట్టు, చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. గుడ్డు జుట్టును మెరిసేలా, దృఢంగా చేస్తుంది.

గుడ్డును హెయిర్ మాస్క్ లాగా అప్లై చేసుకోవచ్చు. అయితే కొంత మంది పచ్చి గుడ్డును హెయిర్‌కు డైరెక్ట్‌గా అప్లై చేసుకునేందుకు ఇష్టపడరు. ఎందుకంటే.. పచ్చి గుడ్డు నుంచి వచ్చి వచ్చే వాసనను భరించలేక.. గుడ్డును అప్లై చేసుకోవడం మానేస్తారు. కానీ నిజానికి పచ్చిగడ్డును.. డైరెక్ట్‌గా అప్లై చేసుకుంటేనే మంచిది. అయితే ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, చాలా హెయిర్‌ షాంపూ సంస్థలు గుడ్డుతో కూడిన షాంపులు అందుబాటులోకి తెచ్చాయి. కానీ.. అన్ని షాంపుల్లో గుడ్డు ఉంటుందా..? అంటే కచ్చితంగా ఉండదనే చెప్పాలి. కేవలం కొన్నింటిలోనే గుడ్డును ఉంచేలా చూశారు. కోడిగుడ్డులో సాధారణంగా 65 గ్రాముల వెయిట్‌ ప్రొటిన్స్‌ ఉంటాయి.  ఇక ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. ఒక గుడ్డు నుంచి 6.29 గ్రాముల ప్రోటీన్తో పాటుగా 78 క్యాలరీలు అందుతాయని పరిశోధనల్లో తేలింది. గుడ్డులో మాంసకృత్తులు సమృద్ధిగా ఉండడం వల్ల మనిషి ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు దోహదపడుతుంది.

పచ్చి గుడ్డు కండర నిర్మాణానికి, జుట్టు ఎదుగుదలకు దొహదపడుతుంది. అయితే జుట్టు సమస్యకు ముఖ్యమైన కారణం ఏదైన ఉందంటే.. అది పోషకాహార లోపంతో పాటు శరీరంలో ఇమ్యూనుటీ లెవల్స్‌ తక్కువగా ఉండటమే ప్రధాన కారణం. కానీ గుడ్డులో ఈ ప్రొటిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. అందుకే వైద్యులు ఎక్కువ ప్రొటిన్‌ లోపం ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్డు తినడం మంచిదని సలహాలు ఇస్తుంటారు. అలాగే మనం తీసుకునే ఆహారంలో చక్కెర, కొవ్వులు వంటివి ఎక్కువగా తీసుకొంటే జుట్టు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీలైనంత వరకు ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉండేలా జాగ్రత్తపడాలి. అప్పుడే జుట్టు దృఢంగా, అందంగా మెరుస్తూ ఉంటుంది. 

Published at : 30 Nov 2022 09:29 PM (IST) Tags: Hair Fall Egg hairfall solution egg protein shampoo egg protein

సంబంధిత కథనాలు

Prawns Recipe: గోంగూర రొయ్యల ఇగురు - వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది

Prawns Recipe: గోంగూర రొయ్యల ఇగురు - వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది

Vitamin D: మనదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి లోపం - చెబుతున్న టాటా ల్యాబ్స్ సర్వే

Vitamin D: మనదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి లోపం - చెబుతున్న టాటా ల్యాబ్స్ సర్వే

Relationshipe: సహోద్యోగులతో స్నేహబంధం బలపడాలంటే ఐదు మార్గాలు ఇవిగో

Relationshipe: సహోద్యోగులతో స్నేహబంధం బలపడాలంటే ఐదు మార్గాలు ఇవిగో

Periods: పీరియడ్స్ ఆలస్యం అవుతున్నాయా? ఈ ఐదు ఆహారాలూ సమయానికి వచ్చేలా చేస్తాయి

Periods: పీరియడ్స్ ఆలస్యం అవుతున్నాయా? ఈ ఐదు ఆహారాలూ సమయానికి వచ్చేలా చేస్తాయి

Leftover Food: మిగిలిపోయాయి కదా అని ఈ ఆహారాలను దాచుకొని తింటే అనారోగ్యమే

Leftover Food: మిగిలిపోయాయి కదా అని ఈ ఆహారాలను దాచుకొని తింటే అనారోగ్యమే

టాప్ స్టోరీస్

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!