అన్వేషించండి

Valentine Day: ప్రేమ పుట్టేది హృదయంలోనా? మెదడులోనా? లవ్‌లో ఉన్న మ్యాజిక్ ఏంటీ?

Valentine Day:వాలంటైన్స్‌ డే రోజు హార్ట్ సింబల్ ఉన్న కార్డులు, గిఫ్టులను ప్రేమించిన వారికి ఇస్తారు. ప్రేమ అనగానే అదే సింబల్ చూపిస్తారు. అసలు ప్రేమ గుండెకు సంబంధించిందా లేదా మెదడులోని కెమికల్ రియాక్షనా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రేమ భావోద్వేగాల కలయిక, గుండెతో కాదు మెదడుతోనే పుడుతుంది.
  • మెదడు సిగ్నల్స్ వల్లే ప్రేమలో గుండె వేగంగా కొట్టుకుంటుంది.
  • ఇంటిమసీ, ఆకర్షణ, కమిట్మెంట్ కలిసి సంపూర్ణ ప్రేమను ఏర్పరుస్తాయి.
  • బ్రేకప్ లో నొప్పి నిజమే, ఇది బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్.

Valentine Day:మనం సినిమాల్లో చూసినా, గ్రీటింగ్ కార్డులు చూసినా ప్రేమకు గుర్తుగా హార్ట్‌ సింబల్ వేస్తారు. ఎవరినైనా ఇష్టపడగానే నా గుండె నీ కోసమే కొట్టుకుంటుంది, నా గుండెలో గుడి కడతా అని చెప్పడం అలవాటుగా మారింది. సోషల్ మీడియాలో కూడా ప్రేమను తెలపడానికి రకరకాల హార్ట్ ఎమోజీలను వాడుతుంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ప్రేమ అనేది గుండె నుంచి పుడుతుందా? లేగా మన మెదడు ఆడే క్రీడా ? ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం వెతికేద్దాం.

ప్రేమ అనేది కేవలం ఒకి భావోద్వేగం కాదు, అది మెదడు, హార్మోన్లను, జ్ఞాపకాలు, అనుభవాల కలయిక అని సైకాలజీ, న్యూరోసైన్స్ చెబుతున్నాయి. మనం ప్రేమిస్తున్నది గుండెతో కాదు, మెదడుతో అని తెలిస్తే కచ్చితంగా కొత్తగా అనిపిస్తుంది. 

ప్రేమ వెనుక "మాస్టర్ మైండ్"

చరిత్రలో ప్రాచీన ఈజిప్షియన్లు, గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్‌ వంటి వారు గుండెనే భావోద్వేగాలకు కేంద్ర అని నమ్మేవారు. మెదడు కేవలం రక్తాన్ని చల్లబరిచే సాధనం మాత్రమే అనుకునే వారు. కానీ ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం, భావోద్వేగాలన్నీ మెదుడు నుంచే పడుతున్నాయని తేలింది. 

ప్రేమలో ఉన్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం నిజమే. అయితే ఆ గుండెను అలా వేగంగా కొట్టుకునేలా సంకేతాలు పంపేది మాత్రం మెదడే. శాస్త్రీయంగా చెప్పాలంటే నువ్వు నా హృదయాన్ని గెలుచుకున్నావు అనడం కంటే నువ్వు నా మెదుడులోని రివార్డ్ సెంటర్లను యాక్టివేట్ చేశావు అని చెప్పడం కరెక్ట్. కానీ అలా చెబితే పిచ్చోడు అనుకుంటారే తప్ప ప్రేమ గురించి చెబుతున్నాడని అనుకోరు. 

నిపుణులు ఏమంటున్నారు?

మనం హృదయంతో ఫీల్ అవుతాం, కానీ సంబంధాన్ని నిలబెట్టేది మైండ్‌తో తీసుకునే నిర్ణయాలే అని క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ అనిత శర్మ చెప్పారు.  చాలా మంది తమ మ్‌ స్పార్క్ పోయిందని బాధపడతారు. ఆ స్పార్క్‌ అనేది డోపమైన ఇచ్చే కిక్కు మాత్రమే. అది శాశ్వతం కాదు, కాలక్రమేణా ఆక్సిటోసిన్ వల్ల కలిగి నమ్మకమే నిజమైన ప్రేమ అని రిలేషన్షిప్ కౌన్సిలర్‌ డాక్టర్‌ రాహుల్ వర్మ తెలియజేశారు. 

ప్రేమలో మూడు కోణాలు

1986లో అమెరికన్ సైకాలజిస్ట్ రాబర్ట్ స్టెర్న్‌బర్గ్‌ ప్రేమను మూడు ముఖ్యమైన భాగాలుగా విభజించారు. దీన్నే స్టెర్న్‌బర్గ్‌ ట్రైయాంగ్యులర్‌ థియరీ అంటారు. ఇందులో మొదటిది ఇంటిమసీ. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే భావోద్వేగ సామీప్యతను తెలియజేస్తుంది. రెండోది ఆకర్షణ. ఇందులో శారీరక, లైంగిక ఉద్యేగానికి సంబంధించింది. మూడోది కమిట్‌మెంట్‌. కష్ట సుఖాల్లో కలిసి ఉండాలనే దృఢమైన నిర్ణయం తీసుకునే ఈ స్టేజ్‌లోనే. 

ఈ మూడు కలిసినప్పుడు మాత్రమే సంపూర్ణమైన ప్రేమ అవుతుంది. కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటే దాన్ని ఇన్‌ఫ్యాచ్యుయేషన్ అని కేవలం కమిట్‌మెంట్‌ ఉంటే దాన్ని కంపానియన్‌షిప్‌ అని అంటారు. అంటే ప్రేమలో నిర్ణయం తీసుకునే మైండ్‌, భావోద్వేగాలు చూపే హార్ట్‌, శారీరక స్పందనలు అన్నీ భాగస్వాములే. 

ప్రేమలో దశలు

ప్రముఖ ఆంత్రోపాలజిస్ట్‌ హెలన్ ఫిషర్ ప్రకారం, ప్రేమ అనేది మూడు దశల్లో సాగుతుంది. ఇందులో మొదటిది కామం. ఇది సంతానోత్పత్తి కోసం పుట్టే ప్రాథమిక దశ.దీనిని సెక్స్ హార్మోన్లు నియంత్రిస్తాయి. రెండోది ఆకర్షణ. ఇక్కడే ప్రేమలో పడ్డాం అనే ఫీలింగ్‌ కలుగుతుంది. మెదడులోని వెంట్రల్‌ టెగ్మెంట్‌ల్‌ ఏరియా నుంచి డోపమైన్ అనే రసాయనం విడుదల అవుతంది. ఇది మనకు విపరీతమైన ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. అనుబంధం ఈ దశల్లో మూడోది. దీర్ఘకాలిక సంబంధాలకు ఇది చాలా ముఖ్యం. ఇక్కడ ఆక్సిటోసిన్ అనే బాండింగ్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది భాగస్వాముల మధ్య నమ్మకాన్ని భద్రతను పెంచుతుంది. 

ఇష్టమైన వ్యక్తులు కనిపించనప్పుడు గుండె వేగంగా ఎందుకు కొట్టుకుంటుంది?

మనం ఇష్టపడే వ్యక్తి కనిపించగానే గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. దీనికి కారణం మెదడు విడుదల చేసే అడ్రినలిన్, నార్‌ ఎప్రినెఫ్రిన్ అనే హార్మోన్‌లు. ఇవి రక్తంలో కలిసి గుండెకు చేరుతాయి. అప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, అర చేతులకు చెమటలు పట్టడం జరుగుతుంది. అంటే మెదడు ఆర్డర్ వేస్తే గుండె పని చేస్తుందన్నమాట. 

ప్రేమలో లాజిక్ ఎందుకు పని చేయదు?

ప్రేమ గుడ్డిది అనే సామెత ఉంది. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. ప్రేమలో ఉన్నప్పుడు మెదడులోని ప్రీఫ్రంటల్‌ కార్టెక్స్‌ అనే భాగం తాత్కాలికంగా తన పనిని తగ్గిస్తుంది. ఈ భాగమే మనకు లాజికల్ ఆలోచనలను, నిర్ణయాలను ఇస్తుంది. ఇది షట్ డౌన్‌ అవ్వడం వల్ల మనం ప్రేమించే వ్యక్తిలోని తప్పులను సరిగ్గా చూడలేం. కేవలం మన మెదడు ఇచ్చే ఎమోషన్స్‌ మాత్రమే మనల్ని నడిపిస్తాయి. దీనినే సైకాలజీలో కాగ్నిటివ్ డిసోనెన్స్‌ అంటారు. ఎదుటి వ్యక్తి మనల్ని బాధపెడుతున్నా సరే మంచివాడు అని మనల్ని మనం సమర్థించుకోడానికి మెదడు ప్రయత్నిస్తుంది. 

సోషల్ మీడియా ప్రేమ

నేటి కాలంలో ప్రేమ స్క్రీన్‌ టు స్క్రీన్ అయిపోయింది. టిండర్, బంబుల్‌ వంటి యాప్స్‌ మనకు తక్షణ సంతృప్తిని ఇస్తున్నాయి. ఒక మ్యాచ్‌ దొరకగానే మెదడులో డోపమైన విడుదలై ఒక చిన్న హై వస్తుంది. దీని వల్ల మనం నిజమైన బంధం కంటే డోపమైన్ కిక్కు కోసం వెతుకుతున్నామేమో అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతర జంటల ఫొటోలు చూసి మన సంబంధాన్ని తక్కువగా భావించడం కూడా ఒక మానసిక సమస్యగా మారింది. ఇది మన మెదడులో అవసరమైన అసూయను, పోలికలను పెంచుతుంది. 

మానసిక ఆరోగ్యంపై ప్రేమ ప్రభావం

ప్రేమ కేవలం కవిత్వం కాదు, అది మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన బంధంలో ఉంటే స్ట్రెస్ హార్మోన్‌లు తగ్గి, ఆయుష్షు పెరుగుతుంది. మంచి సంబంధాలు ఉన్న వారిలో డిప్రెషన్ లక్షణాలు 20-30 శాతం తక్కువగా ఉంటాయి. 

బ్రేకప్ అయినప్పుడు హార్ట్‌ బ్రేక్ నిజమేనా 

బ్రేకప్ అయినప్పుడు నిజంగానే గుండెలో నొప్పిగా అనిపిస్తుంది. దీన్ని సైన్స్‌లో బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు. విపరీతమైన మానసిక బాధ వల్ల గుండె కండరాలు తాత్కాలికంగా స్తంభిస్తాయి. విరహం అనేది ఒక రకమైన అడిక్షన్ విత్‌డ్రావల్‌ వంటిదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 

ప్రేమ అనేది మెదడులో మొదలవుతుంది కానీ దాని ప్రకంపనలు మాత్రం శరీరమంతా, ముఖ్యంగా గుండెలో తెలుస్తాయి. ప్రేమలో పడటం మన చేతిలో లేకపోవచ్చు, కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవడం మాత్రం మనం తీసుకునే నిర్ణయాల్లో ఉంటుంది. 

Frequently Asked Questions

ప్రేమకు గుండెకు సంబంధం ఏమిటి?

ప్రేమ గుండె నుండి పుట్టదు. మెదడు నుండి వచ్చే సంకేతాల వల్లే గుండె వేగంగా కొట్టుకుంటుంది. గుండె ప్రేమకు కేంద్రం కాదు, మెదడులోని రివార్డ్ సెంటర్లు ప్రేమకు కారణమవుతాయి.

ప్రేమలో లాజిక్ ఎందుకు పని చేయదు?

ప్రేమలో ఉన్నప్పుడు మెదడులోని లాజికల్ ఆలోచనలకు కారణమయ్యే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పనితీరు తాత్కాలికంగా తగ్గుతుంది. దీనివల్ల ఎదుటివారి లోపాలను గుర్తించలేము.

బ్రేకప్ అయినప్పుడు గుండెలో నొప్పి నిజమేనా?

అవును, బ్రేకప్ అయినప్పుడు కలిగే తీవ్రమైన మానసిక బాధ వల్ల గుండె కండరాలు తాత్కాలికంగా స్తంభించి నొప్పి కలుగుతుంది. దీనిని బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు.

ఆరోగ్యకరమైన ప్రేమ మానసిక ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది?

ఆరోగ్యకరమైన బంధంలో ఉండటం వల్ల స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతాయి, ఆయుష్షు పెరుగుతుంది. డిప్రెషన్ లక్షణాలు కూడా 20-30% తక్కువగా ఉంటాయి.

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి

వీడియోలు

HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget