News
News
X

Egg: గుడ్డు తినడం నిజంగా గుండెకు హానికరమా? వారానికి ఎన్ని గుడ్లు తినవచ్చు?

గుడ్లు అధికంగా తినడం వల్ల గుండె ప్రమాదంలో పడుతుంది అని చాలామంది అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజం.

FOLLOW US: 
Share:

గుడ్డు ఆరోగ్యకరమైన ఆహారం. అయితే గుండెకు మాత్రం మంచిది కాదని ఒక అభిప్రాయం ఉంది. దీనిలో కొలెస్ట్రాల్ నిండుగా ఉంటుంది. అధికంగా శరీరంలో చేరితే గుండెను నిశ్శబ్దంగా చంపేస్తుందని చెబుతారు. అందుకే గుడ్లు తినడం మానేయాలని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం.

గుడ్డులో చెడు కొలెస్ట్రాల్ ఉంటుందా? 
 గుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందనేది నిజం. కేవలం కొలెస్ట్రాల్ మాత్రమే కాదు, మన శరీరానికి అత్యవసరమైన ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. మితంగా సోడియం కూడా ఉంటుంది. అలాగే రాగి, అయోడిన్, ఐరన్, మాంగనీస్, సెలీనియం, జింక్ లభిస్తాయి. అందుకే గుడ్లను పోషకాహారంగా చెబుతారు. దీనిలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుందనేది మాత్రం నిజం కాదు.

రోజుకు ఎన్ని తినాలి? 
శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి రోజుకో గుడ్డు తింటే సరిపోతుంది అని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.  ఒక రోజులో ఎక్కువ గుడ్లు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాహారం అందడంతో పాటు కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం ఉండదు. అయితే గుడ్డును చీజ్, బేకన్, మెఫిన్, ఎగ్ పఫ్ ఇలాంటి రూపంలోకి మార్చుకొని తింటే మాత్రం సంతృప్త కొవ్వులు అధికంగా శరీరంలో చేరే అవకాశం ఉందని హార్వర్డ్ ఆరోగ్య నివేదిక చెబుతుంది. కాబట్టి గుడ్డును కేవలం గుడ్డుగానే తినాలి. అంటే ఉడకబెట్టిన ఒక గుడ్డును, వేరే పదార్థాలు చేర్చకుండా తినడం వల్ల ఎక్కువ కొలెస్ట్రాల్ ఆహారంలో చేరదు. 

వారానికి ఎన్ని?
బోస్టన్ యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో వారానికి ఐదు గుడ్లు తింటే సరిపోతుందని తెలింది. ఇలా మితంగా గుడ్లు తినడం వల్ల రక్తపోటు, బ్లడ్ షుగర్, డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుందని అధ్యయనం చెబుతోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం ఒక గుడ్డు 78 క్యాలరీలను అందిస్తుంది. అలాగే ఆరు గ్రాముల ప్రోటీన్ ను కూడా ఇస్తుంది. 

మీరు ఇప్పటికే కొలెస్ట్రాల్ ఉంటే?
కొంతమంది ఊబకాయంతో బాధపడుతూ ఉంటారు. వారి శరీరంలో అప్పటికే అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇలాంటివారు గుడ్డును తినవచ్చా అనే అనుమానం కూడా ఉంది. అధిక బరువు, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు గుడ్డులోని పచ్చసొనను తీసేసి, కేవలం బయట తెల్ల సొన మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఎలా తింటే మంచిది?
వండే పద్ధతి కూడా ఆహారంలోని పోషకాలను నిర్ణయిస్తుంది. అంటే ఉడికించిన గుడ్లు తినడం వల్ల పోషకాలు అధికంగా బయటికి పోవు, ఆరోగ్యకరం కూడా. అలా కాకుండా నూనె వేసి చేసే ఆమ్లెట్లు, ఖీమాలాంటి వాటిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తగ్గుతాయి. కాబట్టి రోజుకు ఒక ఉడికించిన గుడ్డును తినడం వల్ల ప్రయోజనాలు ఎక్కువ. 

Also read: రూ.99 చెల్లిస్తే కోపం తీర్చుకునేందుకు ఏవైనా పగలగొట్టొచ్చు - అదే ఈ రేజ్ రూమ్ ప్రత్యేకత

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 09 Feb 2023 06:25 AM (IST) Tags: Eggs benefits Eggs eating Healthy Heart Eggs bad for Heart

సంబంధిత కథనాలు

పెదవులు పొడిబారుతున్నాయా? అలసటగా ఉందా? అయితే, ప్రమాదమే - వెంటనే ఇలా చేయండి

పెదవులు పొడిబారుతున్నాయా? అలసటగా ఉందా? అయితే, ప్రమాదమే - వెంటనే ఇలా చేయండి

International Day Of Happiness: సంతోషమే సగం బలం - హ్యాపీగా ఉంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

International Day Of Happiness: సంతోషమే సగం బలం - హ్యాపీగా ఉంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Vitamin A: విటమిన్ A లోపిస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Vitamin A: విటమిన్ A లోపిస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

ఇన్ఫ్లూయేంజా వల్ల జలుబు, జ్వరంతో బాధపడుతున్నారా? ఈ ఐదు సూపర్ ఫుడ్స్‌ను మీ డైట్ లో చేర్చుకోండి

ఇన్ఫ్లూయేంజా వల్ల జలుబు, జ్వరంతో బాధపడుతున్నారా? ఈ ఐదు సూపర్ ఫుడ్స్‌ను మీ డైట్ లో చేర్చుకోండి

Weight Loss Tips: డైటింగ్ చేయకుండా, వ్యాయామం లేకుండా బరువు తగ్గే సులభమైన పద్ధతులు ఇదిగో

Weight Loss Tips: డైటింగ్ చేయకుండా, వ్యాయామం లేకుండా బరువు తగ్గే సులభమైన పద్ధతులు ఇదిగో

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్