![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Husband is Woman: కెవ్వ్, నా భర్త ఓ మహిళ - పెళ్లయిన 10 నెలలకు తెలిసిన నిజం, అంత టైమ్ ఎందుకు పట్టింది?
ఇద్దరు ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ, 10 నెలల వరకు తన భర్త మహిళ అని ఆమె తెలుసుకోలేకపోయింది.
![Husband is Woman: కెవ్వ్, నా భర్త ఓ మహిళ - పెళ్లయిన 10 నెలలకు తెలిసిన నిజం, అంత టైమ్ ఎందుకు పట్టింది? Indonesian Woman Discovers Her Husband Is Actually A Woman after 10 Months Of Marriage Husband is Woman: కెవ్వ్, నా భర్త ఓ మహిళ - పెళ్లయిన 10 నెలలకు తెలిసిన నిజం, అంత టైమ్ ఎందుకు పట్టింది?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/21/175f439f8f7fb126b3222e846b412f2e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
డేటింగ్ యాప్స్‌లో పార్టనర్‌ను వెతుక్కుంటున్నారా? అయితే, జాగ్రత్త.. మీకు కూడా ఇలా జరగొచ్చు. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ.. డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ వ్యక్తిని ఇష్టపడింది. ఆ వెంటనే పెళ్లి కూడా చేసుకుంది. అయితే, పది నెలల తర్వాత ఆమె పెళ్లి చేసుకున్నది పురుషుడిని కాదని, మహిళను అని తెలుసుకుని గొల్లుమంది. అయినా, పెళ్లి చేసుకున్న 10 నెలల వరకు ఆమె ఎందుకు కనిపెట్టలేకపోయింది? అన్ని నెలల్లో ఒక్కసారి కూడా వారు బెడ్ రూమ్ చూడలేదా? అనేగా మీ సందేహం? అంత గ్యాప్ ఎందుకు వచ్చిందో చూడండి.
పెళ్లిలో భాగంగా ఆ వ్యక్తి ఇచ్చిన సర్టిఫికెట్లో అతడు బొగ్గు వ్యాపారంలో శిక్షణ పొందిన నిపుణుడిగా ఉంది. పెళ్లి తర్వాత ఆ పని ఉంది.. ఈ పని ఉందని చెప్పి.. అతడు ఆమె నుంచి సుమారు రూ.15.82 లక్షలు వరకు డబ్బులు తీసుకున్నాడు. అయితే, వారి పెళ్లి ధృవీకరణకు అవసరమైన పత్రాలను అధికారులకు సమర్పించడంలో ఆలస్యం చేసేవాడు. దీంతో ఆ పెళ్లి చెల్లదని అధికారులు చెప్పడంతో నికా సిరి సాంప్రదాయం ప్రకారం పెద్దలు వారికి మళ్లీ పెళ్లి చేశారు. ఈ పెళ్లిని మతం ద్వారా మాత్రమే గుర్తిస్తారు. కానీ ప్రభుత్వం వారిని పెళ్లయిన జంటగా భావించదు.
పెళ్లి తర్వాత వరుడు.. అత్తమామల ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులకు సందేహం వచ్చింది. అలాగే, అతడు బొగ్గు వ్యాపారవేత్త అని చెప్పుకోవడంపై సందేహం కలిగింది. పైగా అతడు ఎలాంటి ఉద్యోగాలకు వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యాడు. ఓ రోజు భార్య కోపంతో ఇల్లు వదిలి పెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను పిలిపించి ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది.
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?
పోలీసుల విచారణలో తన భర్త పురుషుడు కాదు మహిళ అని బాధితురాలు తెలిపింది. మరి పది నెలల వరకు ఎందుకు తెలియలేదు? కనీసం బెడ్ రూమ్‌లోనైనా కనిపెట్టాలి కాదా అని పోలీసులు అడిగారు. ఇందుకు ఆమె చెప్పిన సమాధానం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. బెడ్ రూమ్‌లో లైట్ కడితేనే ఆ పని చేస్తానని చెప్పేవాడు(చెప్పేది) అని, తన కళ్లకు గంతలు కట్టి.. సెక్స్ డాల్‌తో ఆ పని కానిచ్చేవాడని భార్య చెప్పింది. ప్రస్తుతం ఈ కేసు ఇండోనేషియాలోని జంబి జిల్లా కోర్టులో ఉంది. విచారణ కొనసాగుతోంది.
Also Read: శృంగారం ఇంత సేపు చేస్తే మీరే కింగ్స్, భారతీయుల సరాసరి టైమ్ ఇదే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)