అన్వేషించండి

RO Water: మనదేశంలో RO వాటర్ తాగాల్సిన అవసరం లేదంటున్న శాస్త్రవేత్తలు, ఎందుకో తెలుసా?

RO వాటర్ వల్ల మంచి కంటే హాని ఎక్కువగా జరుగుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కుళాయిల నుంచి నేరుగా వచ్చే నీరు బ్యాక్టీరియా, హానికరమైన టాక్సిన్లతో నిండి ఉంటుందని ఇప్పుడు ప్రతీ ఒక్కరూ RO సిస్టమ్ ఉపయోగిస్తున్నారు. ఫ్రిజ్, మిక్సీ మాదిరిగానే ఈ RO కూడా అత్యవసర వస్తువుగా మారిపోయింది. నగరాల నుంచి గ్రామాల వరకు ప్రజలు స్వచ్చమైన, ఆరోగ్యకరమైన నీటిని తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాటిని ఈ రివర్స్ అస్మాసిస్ సిస్టమ్ అందిస్తాయని విశ్వసిస్తున్నారు. కానీ ఇవి నిజంగానే ఆరోగ్యాన్ని ఇస్తాయా?

శుద్ధి చేసిన దాని కంటే ఎక్కువ నీరు వృధా

నిజం చెప్పాలంటే ఈ RO వాటర్ ఫ్యూరిఫైయర్ శుద్ది చేసే నీటి పరిమాణం కంటే మూడు రెట్లు నీటిని వృధా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక లీటర్ నీరు శుద్ది అయితే మూడు లీటర్ల నీరు వేస్ట్ గా పోతుంది. స్వచ్చమైన నీటిని పొందాలని అనుకుంటే అందుకు RO సిస్టమ్ ఎంచుకోవాల్సిన అవసరం లేదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు చేసిన అధ్యయనం వెల్లడిస్తోంది. RO వ్యవస్థ ద్వారా ప్రతి పది లీటర్ల నీటికి మూడు లీటర్ల మంచి నీరు లభిస్తుంది. మిగిలిన ఏడు లీటర్లు మురుగు నీటి లైన్ల ద్వారా భూగర్బ జలాల్లో కలుస్తుంది. ఇది వాటికి మరింత కాలుష్యాన్ని జోడిస్తుందని పరిశోధకులు తెలిపారు.

2021-22 లో పశ్చిమ బెంగాల్ లోని హల్దీయా లో డాక్టర్ మిశ్రా, అతని బృందం విస్తృతంగా అధ్యయనం నిర్వహించింది. అక్కడ సీసంతో సహా లోహ సాంద్రత అనుకున్న దాని కంటే చాలా తక్కువగా ఉందని వాళ్ళు కనుగొన్నారు.

స్వచ్చమైన నీరు మంచి కంటే హాని ఎక్కువ

RO వాటర్ అన్ని సహజ ఖనిజాలు, ఆయాన్లని తొలగిస్తుంది. దీని గురించి ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ చీమను చంపేందుకు దుప్పటి ఉపయోగించినట్టు ఉంటుందని ఐఐటీ కాన్పూర్ అసోసియేషన్ ప్రొఫెసర్ ఒకరు చెప్పుకొచ్చారు. RO చేసేది నీటి నుంచి మొత్తం కరిగిన ఘనపదార్థాలు తీసేసి దాన్ని స్వచ్చమైన దానిగా మారుస్తుంది. ఇవి ప్రస్తుతం బాగానే ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా ఆరోగ్య ప్రభావాలు చూపిస్తుంది.

సురక్షితమైన తాగునీరు అంటే?

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం తాగునీటిలో TDS స్థాయిల పరిమితి 500 ppm ఉండాలి. WHO 300 ppm పరిమితి చెప్పింది. కానీ దీని కంటే ఎక్కువ ఉంటే ఆరోగ్య ప్రభావాలని కలిగిస్తుందని చెప్పలేదు.

RO ఉండాల్సిన అవసరం ఏమి లేదని అధ్యయనం నిర్వహించిన పరిశోధకులు అంటున్నారు. పెట్రోకెమికల్ పరిశ్రమలు ఉన్న కొన్ని ప్రాంతాలు మినహా చాలా ప్రదేశాలలో లభించే నీటిలో కొంత జింక్ ఉంటుంది. మిగిలిన అన్నీ జలాలు నేరుగా తాగడానికి అనువుగా ఉంటునాయి. నీటిలోని బ్యాక్టీరియా తొలిగించేందుకు కాచుకుని వడకట్టుకుని తాగడం మేలు. ఇది ఖర్చులేని సులభమైన మార్గం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: సిగరెట్లు తాగితే నాలుకపై వెంటుకలు వస్తాయా? ఇతడి నరకయాతన చూస్తే వణికిపోతారు!

టాప్ హెడ్ లైన్స్

Homemade Hair Oil : మెంతులు, మందారంతో హెయిర్ ఆయిల్.. జుట్టు సమస్యలు దూరం చేసుకునేందుకు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండిలా
మెంతులు, మందారంతో హెయిర్ ఆయిల్.. జుట్టు సమస్యలు దూరం చేసుకునేందుకు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండిలా
Post Office RD : రోజుకు 500 పొదుపు చేస్తే 10 ఏళ్లలో 25 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పూర్తి లెక్క ఇదే
రోజుకు 500 పొదుపు చేస్తే 10 ఏళ్లలో 25 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పూర్తి లెక్క ఇదే
Palakura Pappu Recipe : నోరూరించే పాలకూర పప్పు రెసిపీ.. కుక్కర్​లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
నోరూరించే పాలకూర పప్పు రెసిపీ.. కుక్కర్​లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
Cumin Water Benefits : 7 రోజులు జీలకర్ర నీరు తాగితే ఏం అవుతుంది? తయారు చేసే విధానం, ఆరోగ్య ప్రయోజనాలివే
7 రోజులు జీలకర్ర నీరు తాగితే ఏం అవుతుంది? తయారు చేసే విధానం, ఆరోగ్య ప్రయోజనాలివే

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
US Divorce Decree: అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
Railway Projects In AP and Telangana: రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
Vallabhaneni Vamsi: కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
KTR: సబిత, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి, కేసీఆర్ చావు కోరుకుంటున్నారు: ప్రభుత్వంపై గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
సబిత, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి, కేసీఆర్ చావు కోరుకుంటున్నారు: ప్రభుత్వంపై గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
Kavya Shree: 'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా
'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా
Epic Review : ఎపిక్ ఓ బ్యూటిఫుల్ జర్నీ - 90s బయోపిక్ సీక్వెల్ కాదు... యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ
ఎపిక్ ఓ బ్యూటిఫుల్ జర్నీ - 90s బయోపిక్ సీక్వెల్ కాదు... యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ
Embed widget