అన్వేషించండి

Artificial Womb: భవిష్యత్తులో ల్యాబ్‌లోనే కృత్రిమ గర్భాశయాలు, ఏడాదికి 30,000 పిల్లల ఉత్పత్తి - బిడ్డల రంగు, ఎత్తు కూడా ఎంచుకోవచ్చు

త్వరలో పూర్తి స్థాయిలో కృత్రిమ గర్భాశయాలు ల్యాబ్‌లో పనిచేయనున్నాయి. ఇదే జరిగితే ప్రపంచంలోనే పెద్ద అద్భుతం అని చెప్పవచ్చు

గర్భంలో తొమ్మిది మాసాలు నిండాక తల్లి ప్రసవ వేదన మధ్య ఈ ప్రపంచాన్ని చూస్తుంది బిడ్డ. ఆ ప్రయాణం ఏ తల్లికీ జీవితకాలం మర్చిపోలేని అనుభూతినిస్తుంది. అయితే చాలా మందికి గర్భసంచిలో సమస్యలు, ఇతర అనారోగ్య కారణాల వల్ల పిల్లలు కలగరు. అలాంటి వారికి వరంలా వచ్చింది ఐవీఎఫ్ పద్ధతి. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అంటే తండ్రి నుంచి స్పెర్మ్, తల్లి నుంచి అండం తీసుకుని ల్యాబ్‌లో కృత్రిమ పద్ధతిలో ఫలదీకరణం అయ్యేలా చేస్తారు. పిండం ఏర్పడ్డాక దాన్ని తల్లి గర్భంలో ప్రవేశ పెడతారు. ల్యాబ్ లో ఏర్పడిన పిండం బిడ్డగా ఎదగాలంటే కచ్చితంగా తల్లి గర్భం కావాల్సిందే. కానీ సమీప భవిష్యత్తులో ఆ అవసరం కూడా ఉండదు. పూర్తి స్థాయిలో బిడ్డల్ని ల్యాబ్‌లోనే పెరిగి పెద్దయి ప్రసవించేలా చేస్తారు. ఇందుకు ప్రయోగశాలల్లోనే కృత్రిమ గర్భాశయాలు సిద్ధమవుతున్నాయి. చదువుతుంటే సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించవచ్చు కానీ, ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రయోగాలు, సదుపాయాలు శరవేగంగా జరుగుతున్నాయి. 

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 'కృత్రిమ గర్భ కర్మాగారం' సిద్ధమవుతోంది. ఇందులో ఫలదీకరణం నుంచి తొమ్మిది నెలల వరకు ఈ బిడ్డ కృత్రిమ గర్భంలోనే పెరుగుతుంది. తల్లికి నొప్పులు పడే బాధ కూడ లేదు. కృత్రిమ గర్భం తెరను తీసి బిడ్డను బయటికి తీస్తారు. తరువాత ఆ గర్భంలో మరో బిడ్డను పెంచడం మొదలుపెడతారు. ఇలా ఏడాదికి 30,000 బిడ్డలను సృష్టించేందుకు వీలుగా అతి పెద్ద ల్యాబ్ నిర్మితమవుతోంది. ,

ఎవరి ఆలోచన?
ప్రపంచంలో ఇదో పున:సృష్టి అని చెప్పవచ్చు. ఈ 'కృత్రిమ గర్భ కర్మాగారం' పేరు ఎక్టో లైఫ్. బెర్లిన్‌కు చెందిన బయోటెక్నాలజిస్టు హషేమ్ అల్ ఘైలీ దీని సృష్టికర్త.  సంతానం లేని తల్లిదండ్రుల కోసం ఈ ల్యాబ్‌ను నిర్మిస్తున్నట్టు చెప్పారాయన. ఆయన మాటల్లో ఈ ఎక్టో లైఫ్ గర్భధారణ విషయంలో మనిషి పడుతున్న బాధలను తగ్గించడం, అలాగే సి సెక్షన్ కాకుండా ఆడవారి ఆరోగ్యాన్ని కాపాడడం అని చెప్పుకొచ్చారు. ఇంకా ఇది పరిశోధన దశలోనే ఉన్నట్టు చెప్పారు. 

ఎప్పుడు అందుబాటులోకి?
మానవ పిండాలపై పరిశోధన అనేది నైతిక మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం, మానవ పిండాలపై పరిశోధన 14 రోజులకు మించి అనుమతించడం లేదు. ఆ తరువాత ఆ పిండాలను నాశనం చేయాలి. ఆ నిబంధనలు లేకపోతే ఈ సదుపాయం అతి త్వరలోనే తీసుకువస్తానని చెబుతున్నారు శాస్త్రవేత్త అల్ ఘైలీ.  అలా అయితే పది నుంచి పదిహేనేళ్లలో ప్రతి చోట ఎక్టో లైఫ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇదే జరిగితే తల్లి గర్భం అవసరం లేకుండానే పిల్లలు పుట్టేస్తారు. కానీ ఇది ప్రకృతికి విరుద్ధమని వాదిస్తున్న వారు ఉన్నారు. తల్లి గుండె చప్పుడు వింటూ బిడ్డ పెరగడం అత్యవసరమని చెబుతున్నారు. అదే వారి మధ్య బంధాన్ని పెంచుతుందని అంటున్నారు. 

Also read: ఆవలించినప్పుడు కళ్లల్లో నీళ్లెందుకు వస్తాయి?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget