అన్వేషించండి

Ileana Suffering with BDD : బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్.. ఇలియానాకు వచ్చిన వ్యాధి ఇదే, దీనికి చికిత్స ఉందా?

Body Dysmorphic Disorder Treatment : బాడీ డిస్మోర్ఫిక్ డిజార్డర్ (BDD) అనేది ఒక మానసిక ఆరోగ్య పరిస్థితి. దీనిగురించిన షాకింగ్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Body Dysmorphic Disorder Causes : సాధారణంగా ప్రతి మనిషి తన శరీరంలో కొన్ని మార్పులను చూసి బయటకు వెళ్లినప్పుడు వాటి గురించి ఇన్​సెక్యూర్​గా ఫీల్​ అవుతాడు. కొందరు వీటిని ఓవర్​కామ్ చేస్తారు. మరికొందరు వీటి గురించి ఆలోచించి.. కృంగి కుమిలిపోతుంటారు. ఈ బాడీ డిస్మోర్పిక్ డిజార్డర్ కూడా అలాంటిదే. అయితే దీనిప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. మానసికంగా బాగా వీక్​ చేస్తుంది. హీరోయిన్ ఇలియానా కూడా ఈ డిజార్డర్​తోనే బాధపడుతున్నట్లు తాజాగా ఇంటర్వ్యూలో చెప్పింది. 

మనసులో ప్రతికూల ఆలోచనలు ఉంటే.. అది రోజువారి దినచర్యపై కూడా బాగా ప్రభావం చూపిస్తుంది. హీరోయిన్ ఇలియానా కూడా ఈ సమస్యతోనే ఇబ్బందిపడుతుందట. తాజాగా తను సఫర్​ అవుతున్న డిజార్డర్​ గురించి నోరు విప్పింది ఇలియానా. బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్ అనేది జన్యుపరమైన రుగ్మత. మీరు ఎంత అందంగా ఉన్నా.. శరీరంలోని ఏదొక పార్ట్ బాలేదనే ఫీలింగ్​తో ఉంటారు. దానిగురించి తెగ సఫర్ అయిపోతూ.. ఇన్​సెక్యూర్​గా ఫీల్ అవుతారు. 

సింపుల్, సిల్లీ రీజన్​ కూడా మిమ్మల్ని కృంగదీయొచ్చు. మీ శరీరంపై ఓ పుట్టుమచ్చకూడా మీలో ఈ ఫీలింగ్​ని పెంచవచ్చని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివల్ల అసౌకర్యంగా ఫీల్ అయి.. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారట. ఇది జన్యుపరంగా వచ్చే మానసిక సమస్య. ఇది ఉన్నవారు.. తమ శరీరంలో ఏదొకదానిని లోపంలా ఫీల్ అవుతారట. అది చూసేవారికి మంచిగా ఉన్నా.. వారికి మాత్రం అదొక డిఫెక్ట్​లా కనిపిస్తుందట. ఇలియానా కూడా ఓ విషయంలో అలానే భావించేదట. మరి ఈ డిజార్డర్ లక్షణాలు ఏంటి? ఎలా ఓవర్​ కామ్ చేయాలో చూసేద్దాం. 

బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్ లక్షణాలు.. 

శరీరంలో ఏదో భాగం వెలితిగా ఉందని ఫీల్ అవ్వడం, ప్రతిసారి తనని ఇతరులతో పోల్చుకోవడం, నెగిటివ్ ఆలోచనలు, సమస్యను అధిగమించలేకపోవడం, ఒంటరిగా ఉండడం, అద్దంలో చూసుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం, మానసిక ఒత్తిడి వంటి వాటిని బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్ లక్షణాలుగా చెప్తున్నారు. అయితే ఇది జన్యుపరమైన కారణాలవల్లే వస్తుందట. సోషల్ మీడియా.. పబ్లిక్​లో ఎక్కువగా కనిపించేప్పుడు ఇది ఎక్కువయ్యే అవకాశముంది.

నివారణ మార్గాలు.. 

ఒంటరిగా ఉండకండి. మిమ్మల్ని చీర్​ అప్ చేసే వ్యక్తులతో సమయాన్ని గడపండి. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. యోగా, మెడిటేషన్ బాగా హెల్ప్ చేస్తాయి. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు. మీలో ఉన్న మంచి గురించి మాత్రమే ఆలోచించండి. ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడపండి. మీరు ఎలా ఉన్నా.. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి. 

చికిత్స ఉందా.. 

కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ మంచి ప్రయోజనాలు అందిస్తుంది. యాంటీ డిప్రెసెంట్స్ మందులు కూడా హెల్ప్ చేస్తాయి. ఇష్టమైనవారితో టైమ్ స్పెండ్ చేయండి. లేదంటే మిమ్మల్ని మీరే హీల్ చేసుకునే ప్రాసెస్ ప్రారంభించండి. 

Also Read : హైదరాబాద్ స్ట్రీట్​ ఫుడ్​ అంతా విషమేనా? మోమోలు, షవర్మాలు తినేవారు జాగ్రత్త.. ఆ ఒక్కటే కొంపముంచేస్తోందట

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget