News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Calcium: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు కాల్షియం లోపం ఉన్నట్టే

కాల్షియం లోపిస్తే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.

FOLLOW US: 
Share:

మన శరీరానికి అత్యవసరమైన పోషకాలలో కాల్షియం ఒకటి. ఇది లోపిస్తే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆహారం ద్వారా కాల్షియాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారం ద్వారా తగిన మొత్తంలో కాల్షియం అందకపోతే వైద్యులు కాల్షియం సప్లిమెంట్లను సూచిస్తారు. ఎంతోమందిలో కాల్షియం లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో 30 ఏళ్లు దాటగానే కాల్షియం లోపం వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. చిన్న చిన్న వస్తువులను కూడా ఎత్తలేరు. అలాగే దంతాల సమస్యలు కూడా వస్తాయి. గోళ్లు విరిగిపోవడం వంటివి జరుగుతాయి. తల తిరుగుతున్నట్టు అనిపించడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వేళ్లు, పాదాలు, కాళ్లల్లో తిమ్మిర్లు వస్తాయి. బద్దకంగా అనిపిస్తుంది. తీవ్రమైన అలసటగా అనిపిస్తుంది. గోళ్లు పెళుసుగా మారిపోతాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. తికమక పడుతుంటారు. ఆకలి కూడా వేయదు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు కాల్షియం లోపం ఉన్నట్టు అర్థం. వెంటనే వైద్యులను కలిసి కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవాలి. లేదా కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను రోజు తింటూ ఉండాలి.

చాలామందికి పాలు తాగడం ఇష్టం ఉండదు. కానీ పాలల్లో పుష్కలంగా అందుతుంది. పాలు తాగగలిగే వాళ్ళు రోజూ గ్లాసుడు పాలు తాగడం అలవాటు చేసుకోవాలి. ఆహారంలో కచ్చితంగా పెరుగు ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగు ఇష్టపడని వారు కాల్షియం ఉన్న ఇతర ఆహార పదార్థాలపై ఆధారపడాలి. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఈ రెండింటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం ఒక స్పూను తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు వేయాలి. అలాగే ఖర్జూరాలలో కూడా కాల్షియం, ఐరన్ రెండూ ఉంటాయి. కాబట్టి రోజుకు మూడు ఖర్జూర పండ్లను తినడం అలవాటు చేసుకోండి. ఇది కాల్షియం, ఐరన్ లోపాలను పరిష్కరించడమే కాదు, రోగనిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడేస్తుంది. అవిసె గింజలు కూడా తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిలో కాల్షియంతో పాటు ఒమెగా ఫ్యాటీ 3 ఆమ్లాలు, ప్రోటీన్ కూడా ఉంటుంది. వీటిని ప్రతిరోజూ పొడి రూపంలో లేదా అవిసె గింజలతో చేసిన లడ్డూల రూపంలో తినండి. కాల్షియం లోపం తగ్గుతుంది. మినరల్ వాటర్ లో కూడా కాల్షియం కలుపుతున్నారు. కాబట్టి కాల్షియం ఉన్న మినరల్ వాటర్ తాగేందుకు ప్రయత్నించండి. గసగసాల వాడకం చాలా వరకు తగ్గిపోయింది. కానీ ఈ గసగసాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి వంటకాలలో అర స్పూన్ గసగసాలు వేసి తినేందుకు ప్రయత్నించండి.

మెంతికూర, మునగాకుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిలో తరచూ తినేందుకు ఇష్టపడండి. గుడ్లు కూడా కాల్షియానికి మంచి మూలం అనే చెప్పాలి. బీట్రూట్, పాలకూర, సోయాబీన్స్, బాదం, జీడిపప్పు వంటి వాటిల్లో కూడా క్యాల్షియం లభిస్తుంది. పొద్దుతిరుగుడు గింజల్లో కూడా కాల్షియం ఉంటుంది. ఈ విత్తనాలను బ్రేక్ ఫాస్ట్ కు ముందు తినడం అలవాటు చేసుకోండి. శరీరం కాల్షియం పుష్కలంగా గ్రహించాలంటే దానికి విటమిన్ డి అవసరం. కాబట్టి విటమిన్ డి లోపం ఉన్న కూడా కాల్షియం లోపం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం సూర్య రశ్మి తగిలేలా చూసుకోండి. దీనివల్ల శరీరం విటమిన్ డి ని గ్రహిస్తుంది. విటమిన్ డి వల్ల కాల్షియం శోషించుకునే శక్తి శరీరానికి వస్తుంది.

Also read: దానిమ్మ తొక్కలు పడేస్తున్నారా? వాటితో అందాన్ని ఇలా పెంచేయొచ్చు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Published at : 18 Sep 2023 08:37 AM (IST) Tags: Calcium deficiency Calcium rich foods Calcium foods Calcium

ఇవి కూడా చూడండి

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

Iron Kadhai: ఐరన్ పాత్రల్లో వంట చేస్తే నిజంగా ఆ సమస్యలు రావా? ఇందులో నిజమెంతా, ప్రయోజనాలేమిటీ?

Iron Kadhai: ఐరన్ పాత్రల్లో వంట చేస్తే నిజంగా ఆ సమస్యలు రావా? ఇందులో నిజమెంతా, ప్రయోజనాలేమిటీ?

Fish Oil Vs Fish: ఫిష్ ఆయిల్ మంచిదా? లేదా నేరుగా చేపలు తినేయడమే బెటరా? వీటిలో ఏది బెస్ట్?

Fish Oil Vs Fish: ఫిష్ ఆయిల్ మంచిదా? లేదా నేరుగా చేపలు తినేయడమే బెటరా? వీటిలో ఏది బెస్ట్?

Heart Attack: ఈ రక్తపరీక్షతో గుండె పోటు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు

Heart Attack: ఈ రక్తపరీక్షతో గుండె పోటు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?

Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

Tiger 3 Teaser : 'టైగర్ 3'లో సల్మాన్ ఖాన్ దేశభక్తుడా? దేశ ద్రోహిగా మారాడా?

Tiger 3 Teaser : 'టైగర్ 3'లో సల్మాన్ ఖాన్ దేశభక్తుడా? దేశ ద్రోహిగా మారాడా?