(Source: ECI/ABP News/ABP Majha)
Micro Oven: మైక్రోఓవెన్లో ఈ పదార్థాలు పెడితే పేలిపోవడం ఖాయం
మైక్రోఓవెన్... ఇందులో పెట్టకూడని పదార్థాలు, వస్తువుల గురించి తెలుసుకోవాలి.
మైక్రో ఓవెన్... బద్ధకస్తుడికి బెస్ట్ ఫ్రెండ్‌గా చెప్పుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి వండుకుంటే చాలు... మూడు పూటలా తినే ముందు వేడి చేసుకుంటే చాలు. అందుకే ఇది వంట పనినే కాదు, జీవితాన్ని సులభతరం చేస్తుందని అంటారు. ఈ స్మార్ట్ ఉపకరణం కేవలం వేడి చేయడమే కాదు, బేకింగ్ లోను ఉపయోగపడుతుంది. కేకులు, బిస్కెట్లు వంటివి చేసుకొని తినవచ్చు. అయితే ఈ ఓవెన్ వాడే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. దీనిలో కొన్ని రకాల పదార్థాలు పెట్టడం వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.
గుడ్లు
ఉడికించిన గుడ్లు లేదా రిఫ్రిజిరేటర్లో ఉంచి అప్పుడే తీసిన పచ్చి గుడ్లను ఓవెన్ లో ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే గుడ్డు పెంకులతో సహా ఓవెన్లో పెట్టడం వల్ల లోపల అవి పేలి, విద్యుత్ ప్రమాదాలకు కారణం కావచ్చు. ఉడికించిన గుడ్లను పెంకు తీసేసిన తర్వాత వేడి చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు, కానీ పెంకులతో పాటు గుడ్డును లోపల పెట్టకూడదు.
టమోటో సాస్
టమోటో సాస్‌ను చాలా మంది ఓవెన్లో వేడి చేయడానికి చూస్తారు. ఇది చాలా ప్రమాదకరం. టమోటో సాస్ వేడెక్కాలంటే అధిక ఉష్ణోగ్రత అవసరం. ఆ ఉష్ణోగ్రతకు ఓవెన్ చేరుకున్నాక ఆవిరి చాలా ఎక్కువగా మారుతుంది. దీనివల్ల పేలుడు సంభవించవచ్చు.
నీళ్లు
చాలామంది నీటిని మైక్రోఓవెన్లో వేడి చేస్తారు. నీటిని వేడి చేసే సమయంలో బుడగలు ఏర్పడతాయి. ఈ బుడగలు ప్రమాదానికి కారణం అయ్యే అవకాశం ఉంది. ఈ నీటి బుడగలు పేలడం వల్ల ఒక్కొక్కసారి ఓవెన్ పేలే ప్రమాదం ఉంది. ఒకవేళ నీటిని వేడి చేయాలి అనుకుంటే చాలా తక్కువ సమయంలోనే బయటికి తీసేయాలి. 30 సెకన్ల కన్నా ఎక్కువ సమయం నీటిని ఓవెన్లో లోపల ఉంచకూడదు.
చిల్లీ పెప్పర్స్
ఎరుపు, పసుపు రంగులో ఉండే మిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది మిరియాలకు, మిరపకాయలకు మండుతున్న రుచిని ఇస్తుంది. మిరపకాయలను మైక్రోఓవెన్లో పెట్టి వేడి చేయడం వల్ల అధిక ఆవిరి ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల మైక్రో ఓవెన్ డోర్ తీయగానే ఆ ఆవిరి మన ముక్కు, కళ్ళు, శ్వాసకోశ భాగాలకు పట్టేసి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఓవెన్ లో ఎప్పుడు మిరపకాయలను ఉంచకూడదు.
ద్రాక్ష
ద్రాక్ష పండ్లను మైక్రోఓవెన్ లో పెడితే చాలా ప్రమాదం.వాటిని మైక్రోఓవెన్లో పెట్టగానే పేలే ప్రమాదం ఉంది. ఆ వేడికి అవి పేలిపోతాయి.
Also read: ఈ పుట్టగొడుగును తింటే చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది, ఎక్కడైనా కనిపిస్తే వదలకండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.