అన్వేషించండి

Ice Facial : ఇంట్లోనే సింపుల్​గా చేసుకోగలిగే ఐస్ ఫేషియల్.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

Beauty Benefits with Ice Facial : ఫేషియల్ అంటే పార్లర్​కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇంట్లోనే పార్లర్​లాంటి మెరుపునిచ్చే ఐస్ ఫేషియల్​ గురించి ఎక్కువమందికి తెలియదు. దీనిని ఎలా చేయాలి? లాభాలేంటి?

Skin Care Tips for Summer : సమ్మర్​లో స్కిన్​ కేర్ తీసుకోవడం చాలా అవసరం. అయితే ఎండలో బయటకు వెళ్లడం కష్టమనుకునేవారు.. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వాటిలో ఐస్ ఫేషియల్ ఒకటి. ఇది చర్మ సంరక్షణలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఫేషియల్​ను ఎలా చేయాలి? దీనివల్ల కలిగే లాభాలు ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

వివిధ కారణాలతో కళ్లు ఉబ్బడం, మొటిమలు రావడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రశాంతంగా ఐస్ ఫేషియల్ చేసుకోవచ్చు. సహజంగా చర్మాన్ని హెల్తీగా ఉంచడంలో సహాయం చేస్తుంది. చర్మ సమస్యలకు చెక్ పెట్టుకోవడానికి ఐస్ ఫేషియల్ హెల్ప్ చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. మరి దీనిని ఎలా చేసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

క్రయోథెరపీ

ఐస్ ఫేషియల్​ను క్రయోథెరపీగా చెప్తారు. ఐస్​ లేదా కోల్డ్ క్రంపెస్​లను ఉపయోగించి.. మొహంపై ముఖానికి అప్లై చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్​ని మృదువైన క్లాత్​లో వేసుకుని.. ముఖంపై మాసాజ్ చేసుకోవాలి. లేదా కోల్డ్ ఫేషియల్ రోల్స్ ఉపయోగించి ఈ ఫేషియల్​ను చేసుకోవచ్చు. ఇది మీకు మంచి ప్రయోజనాలు ఇవ్వడమే కాకుండా వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది. 

బెనిఫిట్స్

చల్లిని ఉష్ణోగ్రత వల్ల చర్మంలోని రక్తనాళాలు సంకోచం చెందుతాయి. అనంతరం విస్తరిస్తాయి. ఆ ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల స్కిన్ టోన్​ కూడా మెరుగవుతుంది. కళ్లు ఉబ్బడం తగ్గుతాయి. కంటి కింద ఉండే నల్ల వలయాలు తగ్గుతాయి. ఈ ఐస్ ఫేషియల్​ను ఉదయాన్నే చేసుకుంటే చర్మం చాలా హెల్తీగా ఉంటుంది. పైగా ఉదయం దీనిని చేయడం వల్ల నిద్ర మత్తు నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా చర్మం తాజాగా ఉంటుంది. 

మొటిమల సమస్యలు ఉంటే..

మొటిమలతో ఇబ్బంది పడేవారు కచ్చితంగా దీనిని ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు. మొటిమల వల్ల కలిగే వాపుని, రెడ్​నెస్​ను, నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. దీనివల్ల మొటిమలు చాలా సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా చర్మంలో ఆయిల్​ విడుదలల కావడం తగ్గుతంది. అలాగే ఓపెన్ పోర్స్​నుంచి కూడా ఉపశమనం అందుతుంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

ఐస్ ఫేషియల్ చేసుకోవాలనుకుంటే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖంపై డర్ట్ లేదా మేకప్​ ఉంటే క్లీన్ చేసుకోవాలి. అనంతరం ఐస్​ను డైరక్ట్​గా ఫేస్​పై పెట్టుకుండా.. సాఫ్ట్ టిష్యూ లేదా.. కాటన్ క్లాత్​లో వేసి ముఖంపై మసాజ్ చేయాలి. లేదంటే కోల్ట్ ఫేషియల్ రోలర్​ని ఉపయోగించవచ్చు. వీటిని సర్కిల్​లో మెల్లగా కదిలిస్తూ మసాజ్ చేయాలి. కంటి కింద, మొటమలు ఉన్న ప్రాంతాలపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. అయితే ప్రతి సెషన్​ను ఒకటి నుంచి రెండు నిమిషాలు మాత్రమే చేయాలి. లేదంటే స్కిన్ ఇరిటేషన్ వచ్చే అవకాశముంది. 

Also Read : వామ్మో.. ఫేషియల్​తో HIV వచ్చిందా? జాగ్రత్తగా లేకుంటే మీ పరిస్థితి కూడా అంతే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget