Avocado Oil: జుట్టు రాలే సమస్యకి చెక్ పెట్టేందుకు అవకాడో నూనె- ఎలా వాడాలి? ఉపయోగాలు ఏంటి?
జుట్టు రాలే సమస్య నుంచి బయట పడేందుకు అవకాడో నూనె వాడి చూస్తే చక్కటి ఫలితాలు పొందుతారు.
జుట్టును ఆరోగ్యంగా ఎటువంటి హాని కలగకుండా చూసుకోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరి సమస్యగా మారిపోయింది. జుట్టుని సంరక్షించుకునేందుకు మార్కెట్లో అనేక రకాల ఉత్పత్తులు, సప్లిమెంట్స్ వచ్చినప్పటికీ వాటిని ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కొన్ని సార్లు అసౌకర్యానికి గురి అవుతూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. శరీర ఆరోగ్యానికి అవసరమైన సూపర్ ఫుడ్స్ మనకు అందుబాటులో ఉంటున్నాయి. అలాగే జుట్టుని సంరక్షించుకోవడానికి కూడా అద్భుతమైన ఆహారముంది. జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో అవకాడో తీసుకోవడం ఒకటి. ఇది మీ డైట్ లో భాగం చేసుకున్నా లేదా దాని ఆయిల్ తో మీ తలకి మసాజ్ చెయ్యడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు.
అవోకాడో నూనె భారతదేశంలోని ఇప్పుడిప్పుడే వంట నూనెలలో ఒకటిగా మారుతోంది. అన్నీ గుణాలని కలిగి వివిధ రకాలుగా ఉపయోగపడుతోన్న మల్టీపర్పస్ నూనెగా మారింది. వంట నూనెగా మాత్రమే కాకుండా ఇది గ్రిల్లింగ్, బ్రాయిలింగ్, ఫ్రైయింగ్, స్టైర్-ఫ్రైయింగ్, బేకింగ్, ఆస్మెటిక్ కోసం కూడా ఉపయోగించవచ్చు. అవకాడో నూనె జుట్టుకి ఏ రకంగా ఉపయోగపడుతుందో చూద్దాం..
అవకాడో నూనె ఉపయోగాలు..
అవకాడో నూనె ఎంతో ఆరోగ్యకరమైనది. ఎందుకంటే ఇది అసంతృప్త కొవ్వులతో తయారు చేయబడింది. అసంతృప్త కొవ్వులు మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు దోహదపడతాయి. అవోకాడో ఆయిల్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీవక్రియను పెంచడంతో పాటు కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. బరువు తగ్గడంలోను సహాయపడుతుంది. అంతే కాదు జుట్టుని రిపేర్ చేసి పెరిగేందుకు దోహదపడుతుంది. చాలా నూనెలు మందంగా ఉండటం వల్ల చర్మం ద్వారా శరీరంలోకి శోషించలేవు. కానీ అవకాడో నూనెలో యాంటీఆక్సిడెంట్లు, మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఒలేయిక్ యాసిడ్, ఒమేగా 3 ఉన్నాయి. ఇవి జుట్టు, స్కాల్ఫ్ ను తేమగా మార్చడంలో సహాయపడుతుంది.
అవకాడో నూనె జుట్టుకు తేమను, బలాన్ని అందిస్తుంది. ఇది స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, UV రేడియేషన్ నుండి జుట్టును సంరక్షిస్తుంది. ఇతర నూనెల మాదిరిగా కాకుండా ఇది చాలా తేలికగా ఉంటుంది. మోనోశాచురేటెడ్ కొవ్వుల ఉండటం వల్ల పొడి లేదా సున్నితమైన చర్మం ఉన్న ఎవరికైనా ఈ అవోకాడో నూనె ఒక అద్భుతమైన ఎంపికగా చెప్పవచ్చు. ఇది తలకు లోతైన మాయిశ్చరైజింగ్ ట్రీట్‌మెంట్ ఇస్తుంది. అవకాడో నూనెలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. కొత్త హెయిర్ ఫోలికల్స్ పెరుగుదలను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది.
అవకాడో నూనె తలకి ఎలా పట్టించాలి
❂ రక్త ప్రవాహాన్ని పెంచి, స్కాల్ఫ్ ని హైడ్రేట్ చేయడానికి స్వచ్ఛమైన అవకాడో నూనెను తలపై, జుట్టు అంచుల చుట్టూ రాస్తూ నెమ్మదిగా మసాజ్ చెయ్యాలి.
❂ స్ప్లిట్స్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు జుట్టు చివర్ల ఈ అవకాడో నూనె రాసి మడత పెట్టుకోవడం వాళ్ళ ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.
❂ జుట్టు బాగా చిక్కు పడి ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ నూనె రాసి విడదీసేందుకు టట్రై చెయ్యండి. అప్పుడు మీకు జుట్టు చిక్కుతీసుకోవడం సులభం అవుతుంది.
❂ కండిషనర్ కి బదులుగా దీన్ని ఉపయోగించవచ్చు. అంతే కాదు వేరే నూనెతో కలిపి దీన్ని జుట్టుకి కొద్దిగా రాసుకున్న మంచి ఫలితం ఉంటుంది.
Also Read: రొయ్యలను ఇలా తింటే ప్రాణాలు పోతాయని మీకు తెలుసా?
Also read: మీరు పెళ్లికి సిద్ధమయ్యే ముందు మీ కాబోయే భార్యని లేదా భర్తని కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలు ఇవే