News
News
వీడియోలు ఆటలు
X

Fire Accidents: అగ్ని ప్రమాద సమయంలో ఏం చెయ్యాలి? ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి?

ఫైర్ యాక్సిడెంట్‌లో ఎక్కువ మంది మంటలు కంటే.. పొగ వల్లే ఎక్కువ మరణాలు చోటుచేసుకుంటాయి. అలా జరగకూడదంటే.. ఈ కింది చర్యలు పాటించండి.

FOLLOW US: 
Share:

గ్నిప్రమాద ఘటనలు సంభవించిన సమయంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరిగేది మంటల వల్ల కాదు.. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడకపోవడం వల్లే. అందుకు ఉదాహరణలు 2017లో జరిగిన కమలా మిల్స్ అగ్నిప్రమాద ఘటన ఒకటి. బాధితులు తమని తాము రక్షించుకోవడం కోసం వాష్ రూమ్ కి వెళ్ళి తాళం వేసుకున్నారు. దాని వల్ల ఊపిరి ఆడక సుమారు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా సికింద్రాబాద్ లోని ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ లో చోటు చేసుకున్న ఘటనలో సైతం ఎక్కువ మంది పొగ పీల్చుకునే చనిపోయారు. తాజాగా సికింద్రాబాద్ ఘటనలోనూ పొగ దట్టంగా వ్యాపించడం వల్లనే 8 మంది చనిపోయారు. మంటలు వ్యాపించక ముందే దాని తాలూకు మసితో కూడిన పొగ వేగంగా వ్యాపిస్తుంది. ఆ హానికరమైన పొగ పీల్చడం వల్ల శ్వాస ఆడక ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

మంటలు అంటుకున్న సమయంలో ఆక్సిజన్ వేగంగా క్షీణిస్తుంది. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్, హైడ్రోజన్ క్లోరైడ్ వంటి విష వాయువులు పెద్ద మొత్తంలో గాల్లోకి విడుదలయ్యాయి. ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళు ఆ విషపూరిత వాయువులు పీల్చడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. వెంటనే శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తి అవయవాలు విఫలమైపోతాయి. దీని వల్లే ఎక్కువ మంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. అగ్ని ప్రమాద ఘటనల్లో దాదాపు 80 శాతం మరణాలు మంటలు అంటుకొని కాకుండా విషపూరిత వాయువులు పీల్చి చనిపోతున్నారు.

ఈ విషవాయువులు ఏ విధంగా ప్రభావం చూపుతాయి?

కార్బన్ మోనాక్సైడ్: ఈ ప్రాణాంతక వాయువు అగ్ని ప్రమాద సమయంలో విడుదల అవుతుంది. దీన్ని పీల్చడం వల్ల హిమోగ్లోబిన్ తో కలిసిపోయి కణజాల హైపోక్సియా వచ్చి మరణం సంభవించవచ్చు.

కార్బన్ డయాక్సైడ్: ప్రాణాలు ప్రమాదంలో పడేసే మరొక విషవాయువు కార్బన్ డయాక్సైడ్.  ఇది శ్వాసక్రియను పెంచి శ్వాస తీసుకోవడం కష్టం చేస్తుంది.

హైడ్రోజన్ సైనైడ్: దుప్పట్లు, సిల్క్ ఫాబ్రిక్, తివాచీలు, ఉన్ని లేదా ఫర్నిచర్ వంటి గృహోపకరణాలు కాల్చినప్పుడు ఈ విష వాయువు విడుదలవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ మాదిరిగా హైడ్రోజన్ సైనైడ్ కణజాలం, అవయవ నష్టం కారణంగా మరణానికి దారితీస్తుంది.

హైడ్రోజన్ క్లోరైడ్: పాలీ వినైల్ (ఫర్నిచర్‌లో ఉపయోగించే సమ్మేళనం) కాలినప్పుడు ఇది విడుదల అవుతుంది. హైడ్రోజన్ క్లోరైడ్ శ్లేష్మాన్ని నాశనం చేయడం ద్వారా తీవ్రమైన బ్రోన్కైటిస్‌కు కారణమవుతుంది.

పొగ పీలిస్తే ఏమవుతుంది?

పొగ పీల్చడం వల్ల భిన్నమైన లక్షణాలు కనిపిస్తాయి. వ్యక్తి కార్బాక్సీహెమోగ్లోబిన్ స్థాయిలు 15% మించి ఉంటే అతనికి వెంటనే వైద్య చికిత్స అవసరం. 15%-20% మధ్య ఉన్నప్పుడు బాధితులు తలనొప్పి, గందరగోళానికి గురవుతారు. 20-40% మధ్య ఉంటే అయోమయం, వికారం, అలసట, దృష్టి మందగించడం వంటివి జరుగుతాయి. 40-60% పొగ పీలిస్తే కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 60% మించితే మాత్రం మరణానికి దారి తీస్తుంది.

ఎవరికి ప్రమాదం?

ప్రమాద సమయంలో ఎవరు పొగ ఎక్కువగా పీల్చిన ప్రమాదం అయినప్పటికీ గుండె జబ్బులు, ఛాతీ నొప్పి, ఉబ్బసం, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవాళ్ళు చాలా త్వరగా ప్రమాదంలో పడతారు. ప్రాణాపాయం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది.

పీల్చకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?

అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోయినప్పుడు పొగ పీల్చకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం నుంచి కొంతవరకు బయటపడవచ్చు. ప్రమాదాన్ని గ్రహించిన వెంటనే స్పందించాలి. బయటకి వెళ్ళే మార్గాలు అన్వేషించాలి. గదుల్లోకి వెళ్ళి తలుపులు మూసుకోవడం వంటివి అసలు చెయ్యకూడదు. నేల మీద మోకాళ్ళు, చేతులు ఉంచి పడుకోవాలి. లేదా కిందకి వంగుతూ మోకాలిపై నడుస్తూ తప్పించుకోడానికి ప్రయత్నించాలి. అగ్ని ప్రమాద సమయంలో మంటల్లో నుంచి వచ్చే పొగలోని విష వాయువులు పైకి వెళ్తాయి. కింద మాత్రమే మనం పీల్చగలిగే వాయువు ఉంటుంది. కనుక మీ ముఖం భూమికి దగ్గరగా ఉంటే వాటిని తక్కువగా పీలుస్తారు. విష వాయువులు పీల్చకుండా మీ ముక్కు లేదా నోటికి అడ్డంగా మందపాటి వస్త్రం ఏదైనా పెట్టుకోవాలి. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలోని గదిలో చిక్కుకున్నట్లైతే పొగ మీ గదిలోకి రాకుండా తలుపు వేసి తడి వస్త్రం లేదా తలుపు, వెంటిలేటర్ ఫ్రేమ్ కి టేప్ అతికించాలి. పొగ ఎక్కువగా ఉండే గదుల్లోకి అసలు వెళ్లకూడదు.

బయటపడిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రమాదం నుంచి బయట పడిన తర్వాత అత్యవసర సిబ్బంది అప్రమత్తంగా ఉంది బాధితులకు వెంటనే చికిత్స చెయ్యాలి. 100% ఆక్సిజన్ అందే విధంగా చూడాలి. కాలిన గాయాలకి చికిత్స చెయ్యాలి. ఇటువంటి విషాదకరమైన సంఘటనలను నివారించడానికి సంస్థలు భద్రతా నిబంధనల విషయంలో రాజీ పడకూడదు. ఇళ్లలో కూడా స్మోక్ అలారంలు, కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్లను అమర్చుకోవాలి.

Also Read: ఫ్రొజెన్ ఫుడ్ అతిగా తింటున్నారా? అనారోగ్యాన్ని 'కొని' తెచ్చుకున్నట్లే!

Also read: రవ్వ పాయసం, రవ్వ గారెలు - బొంబాయి రవ్వతో టేస్టీ వంటలు

Published at : 13 Sep 2022 03:12 PM (IST) Tags: fire accidents Smoke Smoke Prevention Save Lives Symptoms Of Smoke Inhalation Prevent Smoke Inhalation

సంబంధిత కథనాలు

Sleeping Disorder: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే

Sleeping Disorder: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే

ఈ జీవులతో జాగ్రత్త - కరవడమే కాదు, చర్మంలో గుడ్లు కూడా పెట్టేస్తాయ్!

ఈ జీవులతో జాగ్రత్త - కరవడమే కాదు, చర్మంలో గుడ్లు కూడా పెట్టేస్తాయ్!

Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!

Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!

Diabetes: డయాబెటిస్‌‌ బాధితులకు వేసవి చాలా డేంజర్ - ఇలా అదుపులో ఉంచుకోండి

Diabetes: డయాబెటిస్‌‌ బాధితులకు వేసవి చాలా డేంజర్ - ఇలా అదుపులో ఉంచుకోండి

ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌తో హార్ట్ ఫెయిల్యూర్‌ ముప్పును ముందే తెలుసుకోవచ్చట!

ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌తో హార్ట్ ఫెయిల్యూర్‌ ముప్పును ముందే తెలుసుకోవచ్చట!

టాప్ స్టోరీస్

Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

Telangana New Party :  తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

AP Flexi War : ఫ్లెక్సీల వార్ చేసుకుంటున్న ఏపీ రాజకీయ పార్టీలు - వైసీపీ పోస్టర్లకు టీడీపీ, జనసేన కౌంటర్లు !

AP Flexi War :  ఫ్లెక్సీల వార్ చేసుకుంటున్న ఏపీ రాజకీయ పార్టీలు -  వైసీపీ పోస్టర్లకు టీడీపీ, జనసేన కౌంటర్లు !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Road Accident News : తెలుగు రాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!

Road Accident News : తెలుగు రాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!