News
News
X

Ginger: అల్లంలో కూడా నకిలీలు ఉంటాయా? ఇది తెలుసుకోకపోతే మోసపోతారు జాగ్రత్త!

అల్లం కొనుగోలు చేస్తున్నారా? ఆగండి.. ఆగండి.. మీరు కొనే అల్లం అసలైనదా? నకిలీదా తెలుసుకోండి.

FOLLOW US: 

మీరు ఎప్పుడైనా మార్కెట్లో అల్లం కొనేటప్పుడు అది నిజమైనదేనా, కాదా అనే డౌట్ వచ్చిందా? అదేంటి, అల్లంలో కూడా రియల్, ఫేక్ ఉంటాయా అని ఆలోచిస్తున్నారా? కానీ.. ఉంటాయండి. కొన్ని అచ్చం అల్లంలాగా కనిపిస్తాయి, అనిపిస్తాయి. కానీ వాటికి ఎటువంటి రుచి ఉండదు. అది ఫేక్ అల్లం. అదే ఘాటైన వాసన కలిగి ఉంటే మాత్రం అది నిజమైన అల్లమని గుర్తించాలి. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అందుకోసం ఈ మూడు చిట్కాలు గుర్తు పెట్టుకుని టెస్ట్ చేశారంటే మీరు కొనేది నిజమైన అల్లమా లేదా నకిలీదా అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది.

వాసన: అల్లం కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక చిన్న ముక్క తీసుకుని వాసన చూడండి. నిజమైన అల్లం వాసన ఎప్పుడు ఘాటుగా ఉంటుంది. నకిలీ అల్లం వాసన ఉండదు.

తొక్క తీసి చూడండి: అల్లం.. అసలైనదా? నకిలీదా? అనే విషయం తెలుసుకోవడానికి ఉన్న మరొక మార్గం దాని తొక్క తియ్యడం. అల్లం ఒలిచేందుకు ప్రయత్నించినప్పుడు అది నిజమైనదే అయితే ఆ తొక్క మీ చేతులకి అతుక్కుపోతుంది. ఒక వేళ తొక్క రాకుండా గట్టిగా తీసేందుకు కష్టంగా అనిపిస్తే మాత్రం అది నకిలీదని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

అల్లం రూపం కూడా: ఎటువంటి మట్టి లేకుండా ఉన్న అల్లం ఎప్పుడు కొనుగోలు చెయ్యకూడదు. చాలా సార్లు అల్లాన్ని డిటర్జెంట్లు, యాసిడ్స్ తో కడుగుతారు. వాటి అవశేష రసాయనాలు అందులోకి వెళ్లిపోతాయి. యాసిడ్ లో నానబెట్టడం వల్ల అల్లం విషపూరితం అవుతుంది. దాన్ని తీసుకుంటే మనం అనారోగ్యపాలవుతాం. ఇదే కాదు అల్లం విరిచినప్పుడు కాస్త పీసులుగా కనిపించినా కూడా కొనుగోలు చెయ్యొచ్చు.

News Reels

అల్లంను ఎన్నో ఏళ్ల నుంచి గొప్ప ఔషధంగా ఉపయోగిస్తున్నారు. భారతీయుల గృహాల్లో తప్పనిసరిగా ఉంటుంది. వ్యాధులని నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అల్లం తాజాగా, ఎండబెట్టి పొడి చేసుకుని కూడా అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. జలుబు చేసినప్పుడు అల్లం టీ గొప్ప రెమిడిగా ఉపయోగపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అవి చర్మ ఆరోగ్యానికి గొప్ప సప్లిమెంట్ గా పని చేస్తాయి. అజీర్ణం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యల నుంచి అల్లం ఉపశమనం కలిగిస్తుంది.

అల్లం వల్ల ప్రయోజనాలు

⦿ అల్లం వికారం తగ్గిస్తుంది. కీమోథెరపీ వంటి క్యాన్సర్ చికిత్సలతో సహ కొన్ని రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వాళ్ళకి వాంతులు, వికారంగా అనిపిస్తుంది. అటువంటి వాళ్ళు అల్లం తీసుకుంటే ఆ ఫీలింగ్ పోయేలా చేస్తుంది.

⦿ గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్ నెస్ తగ్గిస్తుంది.

⦿ బరువు తగ్గడానికి కూడా అల్లం సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

⦿ జీర్ణక్రియకి సహాయపడుతుంది. అజీర్ణ సమస్యల్ని దూరం చేస్తుంది.

⦿ నెలసరి సమయంలో వచ్చే నొప్పులని తగ్గించడంలో సహాయపడుతుంది.

అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించే అల్లానికి డిమాండ్ పెరగడం వల్ల నకిలీ అల్లం మార్కెట్లో విస్తృతంగా కనిపిస్తోంది. దాని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. పైగా నిరంతరం నకిలీ అల్లం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆటంకం ఏర్పడుతుంది. అజీర్ణం, అల్సర్లు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అల్లం నిజమైనదో కాదో ఖచ్చితంగా గుర్తించిన తర్వాతే కొనుగోలు చెయ్యాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: చలికాలంలో చన్నీటితో స్నానం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా?

Published at : 18 Nov 2022 05:21 PM (IST) Tags: Ginger health benefits Ginger Ginger Benefits Real Vs Fake Ginger Fake Ginger Side Effects

సంబంధిత కథనాలు

పాదాలు చల్లగా మారిపోతున్నాయా? ఈ వ్యాధి గురించి తెలుసుకోకపోతే గుండె ప్రమాదంలో పడినట్లే

పాదాలు చల్లగా మారిపోతున్నాయా? ఈ వ్యాధి గురించి తెలుసుకోకపోతే గుండె ప్రమాదంలో పడినట్లే

Lung Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యొద్దు - అది ప్రాణాంతక లంగ్ క్యాన్సర్ కావొచ్చు

Lung Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యొద్దు - అది ప్రాణాంతక లంగ్ క్యాన్సర్ కావొచ్చు

Viral Video: సెగలు కక్కే లావాలోకి మనిషి పడిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో ఈ వీడియో చూడండి

Viral Video: సెగలు కక్కే లావాలోకి మనిషి పడిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో ఈ వీడియో చూడండి

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

Men Suicide: పాపం మగ మహారాజులు - కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి ఏడ్వనివ్వండి !

Men Suicide: పాపం మగ మహారాజులు - కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి ఏడ్వనివ్వండి !

టాప్ స్టోరీస్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్